Link copied!
Sign in / Sign up
2
Shares

ఆరోగ్యాన్నిచ్చే ‘పాలకూర పప్పు’ 15 నిముషాల్లో సులభంగా ఎలా చేయాలి..?

మన తెలుగువాళ్లకి పప్పు అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా అందులో ఆకుకూరలు పెట్టుకుని తింటే రుచికరంగా ఉంటుంది.  అందుకని ఎప్పుడు ఒకే రకమైన వంటకంలా కాకుండా ఈ విధంగా డిఫరెంట్ గా ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి వాటిలో పాలకూర పప్పు ఒకటి. ఇది మీ ఆరోగ్యానికి   ఎంతో మేలు చేస్తుంది కూడా. మరి 15 నిముషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూడండి.

పాలకూర పప్పుకు కావలసిన పదార్థాలు :

పాలకూర - ఒక కట్ట

కందిపప్పు - ఒక కప్పు

ఉల్లిపాయ ముక్కలు - ఒక కప్పు

పచ్చి మిర్చి - 3

టమోటో ముక్కలు - ఒక కప్పు

పసుపు, చింతపండు, ఉప్పు - తగినంత

పోపు దినుసులు :

వెల్లుల్లి రిబ్బలు - 4

మినపప్పు - అర స్పూన్

జీలకర్ర - అర స్పూన్

ఆవాలు - అర స్పూన్

ఇంగువ - చిటికెడు

ఎండు మిర్చి - 2

నెయ్యి - 2 స్పూన్లు

కరివేపాకు - 2 రిమ్మలు

పాలకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలి..?

1.ముందుగా పాలకూరను శుభ్రంగా కడిగి చిన్నగా తురముకోవాలి. అలాగే కందిపప్పును శుభ్రంగా కడిగి కుక్కర్ లో కందిపప్పు, పాలకూర, ఉల్లిపాయ ముక్కలు, పసుపు మరియు పచ్చిమిర్చి వేసి ఉడికించాలి. చిన్న గ్లాస్ లో నీటిని ఉంచి అందులో చింతపండు నానబెట్టుకోవాలి.

2.ఆకుకూర, కందిపప్పు ఉడికిన తర్వాత గట్టిగా ఉంటే కాసిన్ని నీరు వేసి మళ్ళీ ఉడికించాలి. అలాగే తగినంత ఉప్పు మరియు చింతపండు వేసుకోవాలి.

3. దీని తర్వాత బాణలి తీసుకుని స్టవ్ పై పెట్టి అందులో నూనె లేదా నెయ్యి వేసి వేడిచేయాలి. ఇందులో ఎండుమిర్చి, ఆవాలు, వెల్లుల్లి, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మినపప్పు, ఇంగువ వేసి వేయించాలి. వేయించిన పోపు దినుసులను ఉడికించిన ఆకుకూర, కందిపప్పులో వేసినట్లయితే ‘పాలకూర పప్పు’ రెడీ అయినట్లే.

4. రుచికరమైన పాలకూర పప్పును అన్నంతో లేదా చపాతీతో కలుపుకుని తింటే కమ్మగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి మంచిది కూడా.

పాలకూర పప్పు ఎలా చేయాలో తెలుసుకున్నారు కదా. ఇది మీకు నచ్చితే SHARE చేయండి. అలాగే మీ COMMENT కూడా చేయవచ్చు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon