Link copied!
Sign in / Sign up
9
Shares

పడుకునే విధానాన్ని బట్టి మీ వ్యక్తిత్వం తెలుసుకోవచ్చు. అలాగే మీ ఆరోగ్యం గురించి కూడా..

జీవంతో ఉండే ప్రతి ప్రాణికీ నిద్ర అనేది ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  మన శరీరంలో రోగ నిరోధక శక్తి స్థిరంగా ఉండటానికి, అనారోగ్యం బారిన పడకుండా, శరీరంలోని నరాలు, మెదడు సరిగ్గా పనిచేయడానికి..ఇలా ప్రతి ఒక్కటి మనం పడుకునే విధానం, నిద్రించే పొజిషన్ బట్టి ఉంటుంది. పడుకునే విధానం వలన మన వ్యక్తిత్వం మరియు మన ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపెడుతుందో కూడా తెలుసుకోవచ్చు..

ఎడమచేతిపై తల వాల్చి నిద్రిస్తే

ఈ విధంగా నూటికి నలభై శాతం మంది నిద్రిస్తున్నారని తాజా ఆరోగ్య పరిశోధనలలో తేలింది. బయటకు కఠినంగా కనిపిస్తున్నా వీరు చాలా సున్నితమైన వ్యక్తులు. చిన్న మాట అన్నా సరే తట్టుకోలేరు. ఇలా మీ నిద్రించే పొజిషన్ ఐతే మీ కుడివైపున నిద్రకు మంచి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అలాగే ఎడమవైపు అవయవాలైన కాలేయం, ఊపిరితిత్తులు, కడుపుపై ఒత్తిడి పడుతుంది.

వెల్లకిలా పడుకుని నిద్రిస్తే

రెండు చేతులను తలదిండుపై ఉంచి ముఖం పక్కకు వాల్చి కడుపుపై భారం వేసి పడుకుని నిద్రిస్తున్నట్లయితే, వీరు ఏదైనా అనుకుంటే వెంటనే చెప్పాలనుకుంటారు. బయటకు చాలా కాన్ఫిడెన్స్ గా కనిపిస్తున్నా, అతి నమ్మకం వలన దెబ్బతినే అవకాశం ఉంది. ఇలా నిద్రించడం వలన జీర్ణ ప్రక్రియ బాగా జరుగుతుందని చెబుతున్నారు.

ఎడమవైపు పడుకుని చేతులు రెండు ఇలా..

ఎడమవైపున తల వాల్చి కాళ్లు, చేతులు స్ట్రైట్ గా పెట్టి నిద్రిస్తున్నట్లయితే ఎదుటివారు ఏది చెప్పినా సరే త్వరగా నమ్మస్తారు. అంటే మంచితనం, నమ్మకం ఎక్కువ కాబట్టి అదే వీరిని కొంపముంచేలా చేస్తుంది. ఇలా పడుకుని నిద్రించడం వలన వెన్నెముక, నడుం నొప్పికి ఉపశమనంగా ఉంటుంది.

చేతులు రెండు శరీరానికి దూరంగా

ఫొటోలో చూపించిన విధంగా రెండు చేతులను శరీరానికి దూరంగా ఉంచి పడుకున్నట్లయితే, వీరికి కొత్త విషయాలు తెలుసుకోవడం, క్రియేటివిటీగా ఆలోచించడం చాలా ఇష్టం. త్వరగా నిర్ణయం తీసుకోలేరు మరియు కాస్త భయం ఉండటం వలన కంగారుపడుతూ ఉంటారు. ఒక్కసారి నిర్ణయం తీసుకుంటే ఇక దేనికి భయపడరు. ఇలా నిద్రించడం వలన కడుపులో గ్యాస్ ఫామ్ అవ్వదు మరియు స్లీప్ అప్నియా సమస్య నుండి బయటపడతారు.

ఉదరం పై భాగానికి ఉంచి నిద్రిస్తే

వీరు చాలా సైలెంట్ గా ఉంటారు కానీ ఏదైనా సమస్య వస్తే దృఢంగా ఉండగలరు మరియు దానికి ఎదురెళ్లి పోరాడగలరు. ఏ విషయంలోనైనా తమనితాము నియంత్రించుకోగలరు. ఇలా నిద్రించడం వలన ఎక్కువ శాతం మంది గురక పెడుతున్నట్లు మరియు సరైన నిద్రను పొందలేరట.

చేతులు దూరం దూరంగా పైకి చూపిస్తున్నట్లయితే

ఒక కాలు చక్కగా మరొక కాలు పక్కకు పెట్టి రెండు చేతులను దూరంగా పైకి చూపిస్తున్నట్లుగా ఉంచితే..మీరు ఎదుటివారు చెప్పేది బాగా వింటారు మరియు స్నేహితులతో వీరి స్నేహం ఎక్కువకాలం చేయగలరు. పదిమందిలో నేనే స్పెషల్ అనేలా ఉండటానికి ఇష్టపడరు. ఇలా నిద్రించడం వలన గురక మరియు శ్వాస సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

ఇలా కాకుండా ఇంకా వేరేలా మీ నిద్రించే పొజిషన్ ఉంటే COMMENT చేయవచ్చు. నచ్చితే SHARE చేయండి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon