Link copied!
Sign in / Sign up
1
Shares

బెడ్ రూమ్ లో భార్యభర్తలు ఎలా ఉండాలి..?

భార్యభర్త, ఎటువంటి స్వార్థం లేకుండా సంతోషంగా ఉండటానికి, అనురాగం ఆప్యాయతలు పంచుకోవడానికి ఇద్దరినీ ఒక్కటి చేసేది పెళ్లి. పెళ్లి అయ్యాక ప్రతి ఒక్కరి జీవితం కొత్తగానే ఉంటుంది, ఐతే భార్యభర్తల జీవితంలో ఎన్నో సమస్యలు, గొడవలు వస్తూ ఉంటాయి.  ఆ సమస్యలన్నిటినీ పరిష్కరించుకునే చోటు బెడ్ రూమ్. మీ రహస్యాలను మాట్లాడుకునే ఈ బెడ్ రూమ్ లో భార్యభర్తలు ఎలా ఉండాలో తెలుసుకోండి..

సిగ్గు

సాధారణంగా పడకగదిలో భర్తలు సిగ్గు పడరు. మహిళలే కాస్త సిగ్గు పడటం, బిడియంగా ఉండటం చేస్తుంటారు. కొత్తగా పెళ్లైన మహిళలే కాకుండా రోజు తన భర్తతో ఉన్న మహిళలు కూడా పడకగదిలో సిగ్గు పడుతూ ఉంటారు. ఇక్కడ అలానే ఉండాలని కాదు గానీ, మీరు అనుకున్న విషయాలను ముక్కు సూటిగా లేదా మీ భర్తకు అర్థం అయ్యేలా చెప్పాలి. అంతేగానీ ప్రతి ఒక్క విషయానికి సిగ్గుపడి, మొహమాటంగా ఉంటే మీ దాంపత్య జీవితానికే ఇబ్బంది అవుతుంది.

మొండిగా ఉండటం

తాను పట్టుకున్న కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్లు ఎప్పుడు ఒకే విధంగా ఉండటం, ఒకేలా ఆలోచించడం అంత మంచిది కాదు. మీ ఆయన మాట్లాడుతున్నా, బుజ్జగిస్తున్నా మీకేమీ పట్టనట్లుగా ఏ విషయంలోనూ కల్పించుకోకుండా ఉండటం మొండితనం అంటారు. ఇలా ఉంటే మీ సంసార సుఖంగా ఉండదు, పైగా ఇలా ఉండటం వలన లేనిపోని సమస్యలు వస్తాయి కూడా.

పిల్లలకు తెలియకుండా..

మీరు బెడ్ రూమ్ లో ఏం మాట్లాడుకుంటున్నా సరే ఆ విషయాలు పిల్లలకు తెలియకుండా చూసుకోవాలి. ఏదైనా సమస్యలు వారికి తెలిస్తే వారు కూడా ఆ విషయాల గురించే ఎక్కువగా ఆలోచిస్తారు కానీ తమ గురించి పట్టించుకోరు. చిన్నతనంలో చదువుకునే పిల్లలకు మీ ఆర్ధిక ఇబ్బందులు, మీరు వారితో ఎలా ఉన్నారు అనే సంగతులు వాళ్లకు తెలియకుండా చూసుకోవాలి.

అలా చేస్తున్నప్పుడు పిల్లలు లేకుండా..

ఇది ప్రతి ఒక్క దంపతులు తెలుసుకోవాల్సిన విషయం. భార్యాభర్తలన్నాక రతిలో పాల్గొనటం సర్వసాధారణం. ఇటువంటప్పుడు మీ పడకగదిలో పిల్లలు లేకుండా, ఒకవేళ పిల్లలు నిద్రిస్తూ ఉంటే వారిని పక్కగదిలో పడుకోబెట్టడం చేయాలి. చిన్నతనంలో వారికి తెలియని ఈ విషయాలు తెలిస్తే వారి మైండ్ డైవర్ట్ అవుతుంది. అది వారి ఉన్నత భవిష్యత్ ను దెబ్బతీస్తుంది కూడా.

ఇంకా పడకగదిలో భార్యభర్తలు ఎలా ఉంటే మంచిదో మీ సలహాలు మాకు కామెంట్ లో తెలపండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon