Link copied!
Sign in / Sign up
12
Shares

పడక గదిలో ప్రతి భర్త తన భార్య నుండి కోరుకునే 8 విషయాలు

దంపతుల మధ్య అనురాగం, అనుబంధం తార స్థాయికి చేరుకునేది పడక గదిలోనే. అక్కడే అవధులు లేని   ప్రేమను పొందుతారు. మనుసు శరీరాలు కలిసిపోతాయి.  అయితే ఆ ఆనందాన్ని ఇంకా పెంచాలంటే, మీ ఆయన మీ నుంచి ఏమి కోరుకుంటున్నాడో తెలుసుకోవాలి. అందుకే పడకగదిలో భర్త కోరుకునే విషయాలేంటో ఇక్కడ తెలుసుకోండి…

1. ముందు మీరే

ప్రతి భర్త, పడక గదిలో తన భార్య నుండి కోరుకునేది చొరవ. భార్య తనే చొరవ తీసుకుని, మొదలుపెడితే తాను చాలా సంతోషిస్తాడు. ప్రతి సారి కాకపోయిన, అప్పుడప్పుడు ఇలా చేయడానికి ప్రయత్నించండి.

2. సెక్సీ బట్టలు

శృంగార సమయంలో బట్టలతో అవసరం లేకపోయినా. అది మొదలయ్యే ముందు ప్రతి భర్త తన భార్యను అందంగా, సెక్సీగా చుడాలనుకుంటాడు. ఆ కోరికను మీరే తీర్చాలి.

3. ఫోర్ ప్లే

మగవాళ్ళు నేరుగా సెక్స్ చేయడానికే ఇస్టపడుతారు అన్నది నిజం కాదు. వారు కూడా సెక్స్ కి ముందు సున్నితమైన కౌగిలింతలు, ముద్దులు కోరుకుంటారు. అందుకే మీరు తప్పకుండా మీ శృంగారంలో ఫోర్ ప్లే ఉండేలా చూడండి.

4. తనకు తానుగా

శృంగార సమయంలో భర్త ఏదైనా చేయడానికి ప్రయత్నించినప్పుడు, వెంటనే మీరు తనకు అనుకూలంగా మారిపోవడం, వారికి చాలా ఇష్టం.

5. తన పేరు పలకడం

అవును,శృంగారం సమయంలో మీరు తారా స్థాయికి చేరుకున్నాక, తన పేరు మీ నోటి నుండి వస్తే అతను చాలా ఆనందపడుతాడు. మీ నుండి దాన్ని కోరుకుంటాడు.

6. చతురత

శృంగార సమయంలో జరిగే కొన్ని తప్పులు నవ్వు తెప్పిస్తాయి. అప్పుడు మీరు కూడా తనతో కలిసి నవ్వడం తనకు చాలా ఇష్టం.

7. మాట్లాడడం 

మగవాళ్ళు శృంగారంలో మాటలు ఉంటే, దానిని ఇంకా ఎంజాయ్ చేస్తారు. అందుకే మీరు ఆ సమయంలో మీకు ఎం కావాలో చెప్పడం, తన గురించి అడగడం ఇలా ఏదైనా మాట్లాడడానికి ప్రయత్నించండి.

8. మీకు భావప్రాప్తి కలిగించడం

ఎక్కువ మంది భర్తలు పడకగదిలో కోరుకునేది ఇదే. తమ భార్యలకు భావప్రాప్తి పొందేలా చూడడం. మీరు దానికి అనుగుణంగా ఉండండి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon