Link copied!
Sign in / Sign up
19
Shares

పచ్చగా అయిపోయిన పళ్ళను 3 నిముషాలలో తెల్లగా మార్చే అద్భుత ఇంటి చిట్కాలు

పళ్ళు పచ్చగా, పళ్ళపై పసుపు చేరినట్లుగా ఉంటే పళ్ళకు గార పట్టింది అని అంటారు. పళ్ళ వరుస బాగుండి పళ్ళు పచ్చగా ఉంటే మాత్రం అందరితో మాట్లాడడానికి, నవ్వడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అలాగే పళ్ళు పసుపు పచ్చగా ఉండటం వలన కొంతమంది వేరే విషయాల కన్నా దీని గురించే ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటం వలన ఆత్మ విశ్వాసం తగ్గిపోతుందని అంటున్నారు. ఐతే ఇక్కడ చెప్పుకునే ఈ సింపుల్ ఇంటి చిట్కాల వలన పళ్ళపై ఉన్న పసుపుదనం  తొలగిపోయి మీ పళ్ళు తెల్లగా, కాంతివంతంగా మెరుస్తాయి.

ఆరంజ్ తొక్కలు

పళ్ళపై ఉన్న గార తొలగిపోవడానికి ప్రతి రోజూ రాత్రి పడుకునేముందు తాజా ఆరంజ్ తొక్కలతో పళ్ళపై రుద్ది శుభ్రంగా నీటితో పుక్కిలించడం వలన పళ్ళపై ఉన్నటువంటి పసుపుదనం తొలగిపోతుంది. ఒకవేళ ఆరంజ్ తొక్కలు తాజాగా లేకపోతే ముందుగానే వీటిని పొడిగా చేసుకుని రోజుకొకసారి వాడటం వలన పళ్ళు తెల్లగా, అందంగా అవుతాయి.

బేకింగ్ సోడా

ఒక టేబుల్ స్పూన్ బేకింగ్ సోడాను బౌల్ లోకి తీసుకుని, అందులో రెండు స్పూన్ల నిమ్మరసం కలిపి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని టూత్ పేస్ట్ తో గానీ, బ్రష్ పై వేసుకుని తోముకోవాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో పుక్కిలించాలి. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తే చాలు.

లెమన్

ఒక స్పూన్ నిమ్మరసంలో కొద్దిగా ఉప్పు కలుపుకుని మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పళ్ళపై రాసుకుని కొన్ని నిముషాల పాటు ఉంచాలి. ఆ తర్వాత మంచి నీటితో పుక్కిలించడం వలన పచ్చని పళ్ళు తెల్లగా, అందంగా ఉంటాయి. రోజుకొక రెండుసార్లు రెండు వారాల పాటు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

తులసి ఆకులు

కొన్ని తులసి ఆకులను తీసుకుని ఎండబెట్టి పొడిగా చేసుకోవాలి. బ్రష్ లేదా చేతి వేలితో తులసి పొడిని పచ్చని పళ్ళపై రాసుకుని నీటితో బాగా పుక్కిలించడం వలన పళ్ళపై ఉన్నటువంటి గార తొలగిపోతుంది.

లవంగాలు

లవంగాలు తీసుకుని మెత్తగా పొడిగా చేసుకోవాలి. చిటికెడు లవంగాల పొడిలో కాస్త నిమ్మరసం కలిపి పేస్ట్ గా అయ్యేలా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పళ్ళు తోముకున్నట్లుగా బ్రష్ తో లేదా చేతి వేలితో తోముకుని చల్లని నీటితో పుక్కిలించాలి. ఇది వాడేటప్పుడు కాస్త మంటగా ఉన్నా కూడా ఫలితం బాగుంటుంది. ఇంకా మీకు పచ్చని పళ్ళను తెల్లగా ఎలా మార్చుకోవచ్చో ఈ వీడియోలో చూడవచ్చు..

మీ అందరికీ ఈ సమాచారం నచ్చితే SHARE చేయగలరు. 

Video Credits : Top 10 Home Remedies

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon