Link copied!
Sign in / Sign up
2
Shares

పాలు తాగే పిల్లలకు మొదటిసారి ఆహరం తిన్పించేటప్పుడు గుర్తించుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు


పిల్లలకు పాలు మానిపించి  అలవాటు చేయడం అనేది ఒక కష్టమైన ప్రక్రియ. ఈ ప్రక్రియలో తల్లి బిడ్డ ఇద్దరు ఇబ్బందికి గురవుతారు. చాలా మంది తల్లులకు ఇది ఒక పరీక్షలా అనిపిస్తుంది ఎందుకంటే పిల్లలు అంత సులువుగా ఘణ పదార్థాలకు అలవాటు పడరు కానీ అలవాటు చేయడం వారి ఎదుగుదలకు అత్యంత అవసరం. మీ పని సులువు చేయడానికి ఇక్కడ కొన్ని చిట్కాలు తెలుయ చేస్తున్నాము.

1. బయటికి ఊసేయడం

సాధారణంగా కొత్తగా ఘణ పదార్థాలు తినే పిల్లలు దానిని బయటికి ఊసేస్తారు. అది వారి గొంతులో ఇరుక్కోకుండా ఉండటానికి శరీరం ఆచరించే ఒక రిఫ్లెక్స్ యాక్షన్. అటువంటి సమయంలో ఆహారాన్ని నున్నగా గుజ్జులా చేసి తినిపిస్తే పిల్లలు బయటికి ఊసేయకుండా ఉంటారు. అంతే కాకుండా మీరు ఇవ్వాలనుకునే ఆహారంలో కొన్ని చుక్కలు రొమ్ము పాలు వేయడం ద్వారా రుచి ముందే తెలిసుండటం వలన పిల్లలు ఇష్టంగా తింటారు. అప్పటికి తినకపోతే ఇంకో వారం వేచి  ఉండి ప్రయత్నించండి.

2. మారం చేయడం

మీ చిన్నారి అన్నం తినిపించడానికి వెళ్తుంటే మొఖం తిప్పేస్తుందా? అంటే తాను తినే మూడ్లో లేదు అని అర్థం ఆ ఆహరం నాచల్లేదు అని అర్థం. అటువంటి సమయంలో ఇతర ఆహరం ఇవ్వడానికి ప్రయత్నించండి. కనీసం కొంత అయినా తినిపించండి. నిదానంగా ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా తినేస్తారు.

3. నవ్వుల చిన్నారి

మీ చిన్నారికి ఏదయినా కొత్త ఆహారం తిన్నప్పుడు విచిత్రమైన ఎక్సప్రెషన్ ఇస్తున్నాడా? కంగారుపడకండి! మీ చిన్నారి నాలుక కొత్త రుచులకి ఇప్పుడిప్పుడే అలవాటు పడుతోంది. ఏ ఆహారం అయినా చిన్నారికి అలవాటు పడటానికి కనీసం 15 సార్లు దాని రుచి చూడాలి.

4. ఎలర్జీ

అందరి పిల్లలకు అన్ని రకాల ఆహారాలు మొదట్లో పడవు. దానిని మనం గమనించుకొని కొత్త ఆహరం ఏమైనా పెడుతున్నప్పుడు ఎలర్జీ వస్తుందేమో అని చూడాలి. డైపర్ మార్చే సమయంలో ఎర్రగా రాషెస్ కింద భాగంలో కనపడితే ఎలర్జీ అని భావించవచ్చు. అటువంటి ఎలర్జీ కలిగించిన పదార్థాలను కొన్ని రోజులు దూరంగా ఉంచండి.

5. మల బద్ధకం

ఘాణ పదార్థం ఇవ్వడం ఆరంభించిన మొదట్లో పిల్లలకు మలబద్దకం వచ్చే ప్రమాదం ఉంది. రోజుకి ఎన్ని సార్లు పూ వెళ్లే వాడు అని గమనిస్తే దీనిని గుర్తించవచ్చు. డాక్టర్ని మలబద్దకానికి కారణం అయిన పదార్థాలను గుర్తుపెట్టుకోండి. ఘాణ పదార్థాలు ఇవ్వడం ఆరంభించినప్పుడు వాటిలో పీచు పదార్థం ఉండేలా చూసుకోండి.

6. తినిపించడం

ఒక వయస్సు వచ్చాక వారి చేతులతో తినటాన్ని ప్రత్సాహించాలి.  ఎప్పుడు మనం తినిపించడమే కాకుండా వాళ్ళే తినే లాగా మనం నేర్పించాలి. దీనికి మొదట్లో పిల్లలు ఇష్టపడకపోవచ్చు కావున నచ్చిన పదార్థాలను ఇచ్చి ఈ అలవాటుని ప్రోత్సహించాలి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon