Link copied!
Sign in / Sign up
35
Shares

పాలు తాగే పిల్లలకు అలవాటు చేయాల్సిన 5 అద్భుతమైన ఆహారాలు


మొదట్లో పిల్లలకు కావాల్సిన పోషకాలు, తల్లిపాల ద్వారా అందుతాయి. కానీ వారు ఎదిగే కొద్ది, శరీరానికి ఎక్కువ పోషకాలు కావాలి. అందుకే పిల్లలు పాలు తాగడం మానేసేలోపు పోషక విలువలున్న కొన్ని ఆహారాలను అలవాటు చేయాలి. పిల్లలకు సులువుగా అలవాటు చేయకలిగే ఆహారాలు ఇవే…

1. అరటి పండు

పిల్లలకు మొదటి సారి తినిపించాల్సిన ఆహారాలలో, అరటి పండు మొదటిది మొదటిది. ఇందులో చాలా పోషక విలువలు ఉంటాయి. అలాగే పిల్లలకు సులువుగా తినిపించచ్చు. అరటి పండును మెత్తగా నలిపి, అందులో తల్లిపాలు కలిపి పిల్లలకు తినిపించచ్చు.

2. అవకాడో

ఈ మధ్య మార్కెట్లో అవకాడో దొరుకుతుంది. ఇందులో పిల్లల ఎదుగుదలకు కావాల్సిన పోషకాలు ఉంటాయి, అంతే కాకుండా సులువుగా అరుగుతుంది. లోపలి గుజ్జు తీసి, పాలతో కలిపి పిల్లలకు తినిపించండి.

3. బేబీ సిరియల్

పిల్లల కోసం సిరియల్స్  మార్కెట్ లో దొరుకుతాయి. 10 నిమిషాల పాటు నీళ్ళతో ఉడికించి, మెత్తగా చేసి తినిపించచ్చు.

4. చిలకడ దుంప

చిలకడ దుంప ఆరోగ్యకరమైన, రుచికరమైన ఆహారం. పిల్లలకు కూడా సులువుగా అరుగుతుంది. చిలకడ దుంప తొక్క తీసి, మెత్తగా ఉడకపెట్టండి. తర్వాత నలిపి, పాలతో కలిపి పిల్లలకు తినిపించండి.

5.కూరగాయలు

క్యారట్, బీట్రూట్, పొటాటోస్, బ్రోకలీ, క్యాలీఫ్లవర్ లాంటి వాటిని బాగా ఉడికించి. మెత్తగా బజ్జిలా చేసి పిల్లలకు తినిపించచ్చు. వీటిలో మంచి పోషక విలువలు ఉంటాయి.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon