Link copied!
Sign in / Sign up
63
Shares

మీ పిల్లలు తాగుతున్న పాలు కల్తీవా? లేక మంచివా? అని ఎలా గుర్తించాలో తెలుసుకోండి..

చిన్న పిల్లలు తినే ఆహారం నుండి ప్రతి ఒక్క వస్తువు కల్తీ సరుకే. డబ్బులిచ్చి కొంటున్నా మంచి ఆహారం లభించకపోవడం దురదృష్టకరం.   ఇలా కల్తీ వ్యాపారాన్ని వద్దని వారిస్తున్నా ఇంకా ఎక్కడో ఒకచోట జరుగుతూనే ఉంది. అలా కల్తీ జరుగుతున్న వాటిలో పాలు ఒకటి. పసిపిల్లలు ఆరోగ్యం ఏమవుతుందో అని కూడా చూడకుండా పాలలో కొన్ని పదార్థాలను కలుపుతున్నారు. మరి ఈ కల్తీ పాలను ఎలా గుర్తించాలో తెలుసుకోండి. అందరికీ తప్పకుండా SHARE చేయండి…

కల్తీపాలను కనుగొనే సులభమైన పద్ధతులు

1. మీరు తీసుకున్న పాలలో 5 మిల్లీ లీటర్ల లేదా ఒక చిన్న గ్లాస్ లో కొన్ని తీసుకుని అందులో రెండు చుక్కలు అయోడిన్ కలపాలి.  కొన్ని నిముషాల తర్వాత ఇవి నీలి రంగులోకి మారితే కల్తీవని అని అర్థం. అలా కాకుండా తెల్లగా ఉంటే స్వచ్ఛమైన పాలు. అయోడిన్ మెడికల్ షాపులలో దొరుకుతుంది.

2. ప్రస్తుతం పాలలో నీళ్లను కలపనివారు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఐతే ఎక్కువ నీళ్లు కలుపుతూ ఉంటే కొనకపోవడం మంచిది. అందుకని మీరు తీసుకున్న పాలను ఒక స్లేట్ పై లేదా ప్లేట్ పై కొన్ని చుక్కలు జారవిడిచితే తెల్లని గీతతో కాకుండా వెంటనే జారితే అందులో నీరు ఉన్నట్లు తెలుసుకోండి.

3.పాలు కాచిన తర్వాత గిన్నె అడుగుభాగంలో తెట్టులా గడ్డ కట్టుకుని ఉండినట్లయితే అందులో గంజిపొడి లేదా స్టార్చ్ పొడి కలిపినట్లు.

4.కొన్ని పాలను ఒక చిన్న గ్లాస్ లో తీసుకుని అందులో ఒక స్పూన్ ఉప్పు వేస్తే కల్తీ పాలను కనుక్కోవచ్చు. కొన్ని నిముషాల తర్వాత నీలం రంగులోకి మారితే అందులో గంజిపొడి కలిపారని తెలుసుకోండి. మరికొన్ని పాలలో యూరియా కూడా కలుపుతున్నట్లు చెబుతున్నారు.

కల్తీపాలు తాగితే ప్రమాదమా..!!

కల్తీపాలు పిల్లలు లేదా పెద్దలు తాగడం వలన ప్రమాదమా, అసలు ఏం జరుగుతుందని చాలామందికి ఉన్న అనుమానం. కడుపులో నొప్పిగా, మంటగా ఉండటం, క్యాన్సర్ సమస్యలు, జీర్ణం కాకపోవడం, గుండె జబ్బులు,..ఇలా ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

ఈ ముఖ్యమైన సమాచారాన్ని అందరికీ చేరేలా SHARE చేయండి.. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon