Link copied!
Sign in / Sign up
1
Shares

పాలు ఇచ్చేటప్పుడు పిల్లలు కొరకకుండా ఉండాలంటే ఏం చేయాలి

బిడ్డకు పాలు ఇచ్చే ప్రతి తల్లికీ ఎదురయ్యే సంఘటన ఇది, పాలు తాగే సమయంలో పిల్లలు తల్లి రొమ్ములు (నిపుల్స్) ను కొరకడం చేస్తుంటారు. తల్లికి కష్టంగా ఉన్నా కూడా బిడ్డ ఆకలిని తీర్చేందుకు ఓర్చుకుంటుంది. అసలు పిల్లలు ఎందుకు కొరకడం చేస్తారు, కొరగాకుండా ఉండాలంటే తల్లులు ఏం చేయాలో తెలుసుకోండి.

పాలు వృద్ధిగా ఉంటే పిల్లలు కొరకరు

తల్లి నుండి పాల ఉత్పత్తి బాగా ఉన్నప్పుడు, ఆకలి తీరేవరకు పాలు సేవించినప్పుడు పిల్లలు తల్లి రొమ్ములను (చన్నులను) కొరకడం చేయరు. ఎప్పుడైతే పాల ఉత్పత్తి తగ్గినా, పాలు సరిగ్గా తనకు అందనపుడు ముందు పళ్లతో కొరకడం చేస్తుంటారు.

కొరికితే దూరం పెట్టకూడదు

పాలు తాగే సమయంలో తల్లి నిపుల్స్ ను పిల్లలు కొరకడం చేస్తుంటే చాలావరకు తల్లులు తట్టుకోగలరు కానీ కొందరు మాత్రం ఆ నొప్పిని భరించలేక దూరంగా పెడుతుంటారు. దూరంగా పెట్టకుండా కొద్దిసేపు పిల్లలను పక్కనబెట్టి తన నోటికి రొమ్ములు అందుతున్నాయో లేదో చూడాలి. అప్పుడు కొరకడం ఆపివేస్తారు.

బలవంతం పెట్టకూడదు

పిల్లలకు ఎప్పుడు ఆకలి అవుతుందో తల్లి కంటే ఇంకెవరికీ బాగా తెలియదు కాబట్టి పిల్లలను పాలు తాగేందుకు బలవంతం చేయకూడదు. మీరు ఎప్పుడైనా బయటకు వెళ్తున్నపుడు మీ బాబు/పాప నిద్రిస్తుంటే పాలు ఇచ్చి వెళదాం రావడానికి ఆలస్యం అవుతుందని నిద్రిస్తున్న మీ పిల్లలకు పాలు పట్టించడం వలన వారికి ఇష్టం ఉండకపోవడంతో ఎలా చెప్పాలో తెలియక కొరకడం చేస్తుంటారు.

పాలు పట్టడం ఆపేయాలి

ఒక్కోసారి పిల్లలు పాలు తాగుతూ నిద్రిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో వారికి తెలియకుండానే తల్లి రొమ్ములను కొరకడం చేస్తుంటారు కాబట్టి, నిద్రిస్తున్న సమయంలో పిల్లలకు పాలు పట్టడం ఆపివేయాలి. ఎప్పుడైతే నిద్రలేవగానే మళ్ళీ వారు పాల కోసం ఎదురు చూస్తుంటే పాలు ఇవ్వడం మంచిది.

కింద కూర్చోబెట్టండి

పిల్లలు పాలు తాగుతూ కొరకడం చేస్తుంటే వెంటనే ఎద భాగం నుండి వారిని పక్కనబెట్టి కింద కూర్చోబెట్టడం లేదా పడుకోబెట్టడం చేయాలి. మళ్ళీ కొరకడం చేస్తుంటే మళ్ళీ అలాగే చేయాలి. ఇలా చేయడం వలన పిల్లలు కొరకడం ఆపివేస్తారు.

పాల పళ్ళు వచ్చిన తర్వాత ఏం చేయాలి?

పాల పళ్ళు వచ్చిన తర్వాత ఆ పళ్లతో ఆహారం తినాలి, కనిపించిన వస్తువును నోట్లో పెట్టుకోవాలని పిల్లలకు అనిపిస్తూ ఉంటుంది. అటువంటి సమయంలో పాలు తాగుతూ నిపుల్స్ ను పళ్లతో పట్టుకుని లాగుతూ ఉంటారు కాబట్టి, అలా జరగకుండా ఉండాలంటే పిల్లల నోటిని రొమ్ములకు బాగా అందేలా ఉంచడమే ఉత్తమమైన మార్గం.

తల్లికి ఎంత కష్టంగా ఉన్నా పిల్లల ఆకలి తీరుస్తూనే ఉంటుంది. అందుకే అమ్మకు హ్యాట్సాఫ్ చెప్పాలి. అందరికీ SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon