Link copied!
Sign in / Sign up
6
Shares

ప్రగ్నన్సీ సమయంలో పాదాల వాపు ప్రమాదమా..? పాదాల వాపు తగ్గించే ఉత్తమ చిట్కాలు

గర్భంతో ఉన్నప్పుడు సాధారణంగా కాళ్ళ వాపులు రావడం సహజమే. శరీరం ఉబ్బినట్లుగా ఉండటం, చేతులు, ముఖం కూడా ఉబ్బినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. పాదాల వాపు ఎక్కువగా మూడవ నెల నుండి మొదలవుతుంది. కొందరిలో ఏడు, ఎనిమిదవ నెలలలో ఈ విధంగా ఉంటుంది. కాళ్ళ వాపుకు కారణాలు ఏంటి, ఈ విధంగా జరగడం వలన ఏదైనా ప్రమాదమా?, ఎటువంటి చిట్కాలు పాటిస్తే వాపు తగ్గుతుందో తెలుసుకోండి..ప్రతి మహిళకు చేరేలా SHARE చేయండి..

పాదాల వాపుకు కారణం

గర్భంతో ఉన్నప్పుడు కాళ్ళ వాపును ఆరోగ్య నిపుణులు ‘ఎడిమా’ అని అంటారు. సాధారణంగా ఈ సమయంలో ప్రగ్నన్సీ మహిళలకు నీరు ఎక్కువగా తీసుకోవడం అవసరం. తీసుకున్న నీటిని మొత్తం శరీరం గ్రహించడం వలన పిండం అభివృద్ధికి కాస్త కష్టమవుతుంది. ఇటువంటప్పుడు కడుపులోని బిడ్డ  ఆ నీటిలో అటు ఇటు తిరగడం జరుగుతూ ఉంటుంది. ఈ నీరే కిందకు కాళ్లకు చేరి పాదాల వాపుకు కారణమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

కాళ్ళ వాపుకు తగ్గడానికి ఏం చేయాలి..?

కాళ్ళ వాపు అనేది గర్భంతో ఉన్నప్పుడు సహజమే కాబట్టి ఎవరూ ఎటువంటి ఆందోళన పడకూడదు. ఇక్కడ చెప్పుకునే ఈ ఇంటి చిట్కాలు ఫాలో అవ్వడం వలన సులభంగా పాదాల వాపు తగ్గించుకోవచ్చు. మరీ ఎక్కువగా ఉండి, నొప్పిగా ఉంటే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం.

రెండు బకెట్ లలో వేడి నీరు, చల్లని నీరు

పాదాల వాపు ఉన్నప్పుడు ఒక బకెట్ లో గోరు వెచ్చని నీరు, మరో బకెట్ లో చల్లని నీరు తీసుకోవాలి. ముందుగా మూడు నిముషాల పాటు గోరు వెచ్చని నీటిలో ఉంచి, ఆ తర్వాత వెంటనే చల్లని నీటిలో ఉంచాలి. ఇలా వేడి నీటిలో కొద్దిసేపు, చల్లని నీటిలో కొద్దిసేపు 20 నిముషాల పాటు రోజు చేయడం వలన పాదాల వాపు తగ్గుతుంది, అలాగే ఒత్తిడి దూరమవుతుంది.

మసాజ్

ప్రగ్నన్సీ సమయంలో కాళ్ళు వాపుగా ఉంటే ఆముదం లేదా ఆలివ్ ఆయిల్ తీసుకుని సుతిమెత్తగా పైకి కిందికి మసాజ్ చేసుకోవాలి. ఇలా రోజు రెండు మూడుసార్లు 5 నిముషాల పాటు చేసుకోవడం వలన చక్కని ఫలితం ఉంటుంది. ఎక్కువ ఒత్తిడిగా అస్సలు చేయకూడదు. ప్రగ్నన్సీ సమయంలో కొందరు అనుభవం ఉన్న మహిళలు, పెద్దవారికి బాగా తెలుసు.వారిని సంప్రదించాలి.

ధనియాలు

ప్రగ్నన్సీ సమయంలో వికారం, వాంతులు ఎంత సహజమో పాదాల వాపు కూడా అంతే సహజం. కాబట్టి రాత్రి పడుకునేముందు ఒక గ్లాస్ నీటిలో కొన్ని ధనియాలు వేసి, ఉదయాన్నే ఈ నీటిని గోరువెచ్చగా ధనియాలతో సహా ఉడికించాలి. ఈ నీటిని వడగట్టుకుని సేవించడం వలన మంచి ఫలితం ఉంటుంది.

అల్లం

అల్లం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో బహుశా మీకు తెలిసే ఉంటుంది. కాళ్ళ వాపు ఉన్నప్పుడు అల్లం ఆయిల్ ను కొద్దిగా తీసుకుని మసాజ్ చేసుకోవడం ఉత్తమం. అలాగే అల్లంతో తయారుచేసుకున్న టీ సేవించడం వలన వికారం ఉండదు.

ఈ ఫ్రూట్స్ తీసుకోవాలి

గర్భంతో ఉన్నప్పుడు శరీరం ఎక్కువ నీటిని గ్రహించుకుంటుంది కాబట్టి, ఈ సమయంలో నీరు సేవించడం ఎంత ఉత్తమమో, నీటి శాతం అధికంగా ఉండే యాపిల్స్, కీరదోసకాయ, ఆరంజ్, పుచ్చకాయలు తీసుకోవడం అంతే ఆరోగ్యకరం.

పాదాల వాపు ప్రమాదమా..?

ప్రగ్నన్సీ సమయంలో కాళ్ళు వాపు, శరీరం ఉబ్బినట్లు అధికంగా ఉంటే ఊపిరి  తీసుకోవడం కష్టంగా ఉంటుంది. శరీరం అలసిపోయినట్లు ఉంటుంది. అలాగే ఎక్కువ ఒత్తిడి ఉండటం వలన హృదయ సంబంధిత సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అంటున్నారు. అందుకే వీలైనంత వరకు నడవటం, చిన్న చిన్న వ్యాయామాలు చేయడం మంచిది. దయచేసి ఈ విషయాన్ని అందరికీ SHARE చేయండి.. 

మీకోసం మేము అందిస్తున్న నూతన సంవత్సర కానుక. ఈ లింక్ ద్వారా మీరు అమెజాన్ కు వెళ్ళండి.....ఆశ్చర్యపరిచే ఆఫర్లు పొందండి...

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon