ఒకే నెలలో పీరియడ్స్ రెండు సార్లు ఎందుకు వస్తాయి? ఆశ్చర్యపరిచే నిజాలు
మహిళలలో ఋతుచక్రం సాధారణంగా నెలకు ఒక్కసారి జరుగుతూ ఉంటుంది. రెండు పీరియడ్స్ మధ్య సమయం 28 రోజులు ఉంటే, కొందరు మహిళలలో మాత్రం కేవలం రెండు వారాలకే (14 రోజులకే) పీరియడ్స్ జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగితే ఏమవుతుంది అనే అనుమానం ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ అనుమానం నుండి వెంటనే బయటపడండి.
నెలలో రెండుసార్లు పీరియడ్స్ ప్రమాదమా?
సాధారణంగా యుక్త వయస్సు దాటిన తర్వాత ఎప్పుడూ నెలకు రెండుసార్లు పీరియడ్స్ అవుతుంటే ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే కొందరిలో అకస్మాత్తుగా నెలకు రెండోసారి జరగడం, తర్వాతి నెలలో ఆగిపోవడం జరుగుతుంది. ఇలా జరగడం కూడా ఇబ్బందికరమేమీ కాదు గానీ వెంటనే వైద్యుడిని సంప్రదించడం మంచిది.
ఋతుక్రమం నెలలో రెండుసార్లు కారణాలు :
నెలలో రెండు సార్లు పీరియడ్స్ ఎందుకు జరుగుతాయి? అందుకుగల ముఖ్య కారణాలు ఏంటో వివరంగా మీకోసం..
బరువు పెరగడం, తగ్గడం
మహిళలు ఉన్నట్లుండి బరువు పెరగడం లేదా బరువు తగ్గినప్పుడు ఋతుక్రమంపై ప్రభావం చూపడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అందుకే కొందరిలో నెలకు రెండుసార్లు పీరియడ్స్ జరుగుతుంది. కొందరిలో నెల దాటుతున్నా పీరియడ్స్ రావు.
హార్మోన్స్ సమస్య
పీరియడ్స్ సరైన సమయానికి వచ్చేలా చేసే హార్మోన్స్ సమతుల్యంగా లేకపోవడం వలన కొన్నిసార్లు పీరియడ్స్ ఆగడం జరుగుతుంటే హార్మోన్స్ అధిక స్థాయిలో ఉన్నప్పుడు ఋతుక్రమం రెండు సార్లు జరగడానికి కారణం.
థైరాయిడ్స్ వలన
మహిళలలో ఉండే మరో ప్రధానమైన సమస్య థైరాయిడ్. ముందే చెప్పుకున్నట్లు హార్మోన్స్ సమతుల్యంగా లేకపోతే పీరియడ్స్ సమస్య ఉంటుంది. అలాగే థైరాయిడ్ వలన పీరియడ్స్ పై ప్రభావం ఉంటుంది.
మందులు
క్రమం తప్పకుండా కొన్ని మందులను ఎప్పుడూ తీసుకుంటూ ఉండటం, ముఖ్యంగా గర్భ నిరోధక మాత్రలు వాడినప్పుడు యోనిస్రావంపై ప్రభావం చూపి ఋతుక్రమం ముందుగానో లేదా ఆలస్యంగా జరిగేలా చేస్తుంది.
భయం, ఒత్తిడి
చాలామంది మహిళలలో పీరియడ్స్ గురించి ఆలోచించినప్పుడు ఒత్తిడి, ఆందోళన మరియు భయం కలుగుతూ ఉంటుంది. వీటి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ ఉండటం కూడా ఇందుకుగల ప్రధాన కారణం. మహిళలలో జరిగే సాధారణ ప్రక్రియ అని గుర్తుంచుకోండి.
ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.
