Link copied!
Sign in / Sign up
0
Shares

ఒకే బొడ్డు తాడుతో పుట్టిన కవల పిల్లలు : 6 సెకన్ల వీడియో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది


పిల్లలు జన్మించేటప్పుడు ఏం అద్భుతం జరుగుతుందో ఏమో గానీ ఇప్పటికీ డాక్టర్లకు కూడా అంతుచిక్కని రహస్యాలు ఉన్నాయి. కొందరు పిల్లలు పుట్టిన వెంటనే నడవటం, ఏడవకుండా నిశ్శబ్దంగా ఉండటం, అంతుచిక్కని వ్యాధులు లేదా ఒకే అవయవాల కలయికతో జన్మించడం..ఇలా మనదేశంలోనూ ఎక్కువగానే జరుగుతున్నాయి. అటువంటి వాటిలో ఇది ఎటువంటి రకమో ఆ భగవంతుడికే తెలియాలి. ఒకే బొడ్డు తాడుతో జన్మించిన ఈ కవల పిల్లల వీడియో ఇదే…

ఒకే బొడ్డు తాడుతో పుట్టారు

ఈ చిత్రంలో కనిపిస్తున్న చిన్నారులు తల్లి కడుపుని చీల్చుకుని ఒకే బొడ్డు తాడుతో ఈ భూమి మీద అడుగుపెట్టారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కొన్ని రోజుల క్రితం ఈ పిల్లలు జన్మించారు. ఒకే బొడ్డు తాడు, దిగువ భాగాన రెండు శరీరాలు కలిసి ఉండటం, ఒకే గుండె, 4 అవయవాలు అతుక్కుపోయి పుట్టారు. తన కవల పిల్లలను ఈ స్థితిలో చూసిన ఆ తల్లి, బిడ్డలు పుట్టిన కొన్ని గంటలలోనే హాస్పిటల్ నుండి వెళ్ళిపోయింది. తన బిడ్డలను సంతోషంగా చూసుకోవాలని, బ్రతికించుకోవాలని…

ఆపరేషన్ కు ఒప్పుకోలేదు

ఉత్తరప్రదేశ్ లో జన్మించిన ఈ కవల పిల్లలలో అబ్బాయా లేక అమ్మాయా అని వైద్యులు గుర్తించలేకపోయారు. ఎందుకంటే ఆ చిన్నారుల తల్లి తన కవల పిల్లలకు ఏం జరుగుతుందో అని భయపడి ఆపరేషన్ కు ఒప్పుకోలేదు. అలాగే ఇంకా ఏదైనా అనారోగ్యం కారణంగా పిల్లలు ఇలా ఒకే బొడ్డు తాడుతో దిగువ భాగాన అవయవాలతో కలిసి జన్మించారా అని తెలుసుకోలేకపోయారు.

తల్లి కడుపులో బిడ్డలను చూసి షాక్ అయిన వైద్యులు

నెలలు నిండడంతో హాస్పిటల్ కు ఆమె రావడంతో మొదట స్కాన్ చేసి చూశారు. తల్లి కడుపులో 75 సెం.మీ పొడవుతో బిడ్డ ఉండటం చూసి షాక్ అయ్యారు. మారుమూల గ్రామంలో ఉండటం వలన, ప్రెగ్నన్సీ గురించి, కడుపులోని బిడ్డ ఆరోగ్య పరిస్థితి గురించి ఎప్పటికప్పుడు తెలుసుకోకపోవడం, అందుకు తగ్గ జాగ్రత్తలు తీసుకుపోవడం కూడా ఇలా జరగడానికి కారణాలు అని కొందరు అంటున్నారు. ఏది ఏమైనా ఆ పిల్లలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుందాం… 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon