Link copied!
Sign in / Sign up
6
Shares

ఒకరు వాడిన టవల్ ను ఇంకొకరు వాడచ్చా? వాడితే ఏమవుతుంది?

ప్రతి ఇంట్లో టవల్స్ ఉంటాయి. ముఖాన్నీ, శరీరాన్ని తుడుచుకోవడానికి అందరూ టవల్స్ వాడుతారు. శరీరాన్ని శుభ్రపరుచుకోవడానికి, ఆరోగ్యంగా ఉంచుకోడానికి మనం వాడే టవల్స్ విషయంలో జాగ్రత్త తీసుకోకపొతే అవి మనకు ప్రమాదాన్ని తీసుకొస్తాయి. టవల్స్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం…

1. ఉతకడం

మీ ఇంట్లో టవల్ ను ఎన్ని రోజులు ఒకసారి ఉతుకుతారు? ఇప్పటినుండి వారానికి ఒకసారి ఉతకండి. మీరు వాడే టవల్ లో వారానికి క్రీములు చేరిపోవచ్చు. ఆ క్రిములు చేరిన టవల్ ను మీరు వాడడం వలన చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎండా కాలంలో ఇంకా జాగ్రత్తగా ఉండాలి. చెమట అధికంగా కలగడం వలన క్రిములు అధికంగా ఉంటాయి.

2. ఆరపెట్టడం

మీరు టవల్స్ ను తుడుచుకోడానికి వాడిన తరువాత తప్పకుండా ఆరబెట్టండి. వాడిన తరువాత తడి టవల్ ను ముద్దగా చుట్టి పడేయడం, తరువాత మళ్ళి అవసరమైనప్పుడు అదే టవల్ ను వాడడం మంచిది కాదు. తడి టవల్ అలానే ఉంచడం వలన అందులో బాక్టీరియా చేరుతుంది. దానిని తిరిగి వాడడం వలన ఆ బాక్టీరియా చర్మం పై చేరి ఇన్ఫెక్షన్ కలిగించే అవకాశం వుంది.

3. మెత్తవి తెల్లవి

మీరు ఎలాంటి టవల్స్ వాడుతున్నారు అన్నది కూడా ముఖ్యమే. గరుకుగా ఉండే టవల్స్ వాడకండి, మెత్తగా ఉండే వాటిని ఎంచుకోండి. అలానే రంగులలో కాకుండా తెల్లవి వాడడం మంచిది. అవి మాసిపోవడం అర్ధమవుతుంది. టవల్ మార్చుకోవచ్చు.

4. ఒకరు వాడినవి

ఒకరు వాడిన టవల్స్ ను ఇంకొకరు వాడడం ప్రమాదం.  ముఖ్యంగా పిల్లలకు. ఇంట్లో పిల్లలకు, మీకు వేరు వేరు టవల్స్ ను వాడండి. ఇలా చేయడం వలన క్రిములు, బాక్టీరియా పిల్లలకు వ్యాపించవు. పిల్లలకు ప్రత్యేకంగా టవల్స్ ఉంచండి.

5. ముఖానికి శరీరానికి వేరు

ముఖానికి శరీరానికి ఒకే టవల్ వాడడం కూడా మంచిది కాదు. ముఖం పై చర్మం మిగతా శరీర భాగాల పై చర్మం కన్నా చాలా సున్నితంగా ఉంటుంది. శరీరం లోని కొన్ని భాగాలలో క్రీములు అధికంగా ఉంటాయి. ఆ భాగాలను తుడుచుకోడానికి వాడిన టవల్ ను ముఖానికి వాడడం వలన ముఖం మీద ఇన్ఫెక్షన్ వచ్చే అవకాశం ఉంటుంది. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon