Link copied!
Sign in / Sign up
7
Shares

ఒక అమ్మ కథ, ప్రతి అమ్మ కథ - పిల్లల గురించి వారు పడే ఆరాటం

అప్పుడు నా కూతురికి కేవలం రెండు వారల వయస్సు. మొట్టమొదటిసారిగా డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళినప్పుడు తనకు కామెర్లు అని తెలిసింది. నాకు ఎలా రియాక్ట్ అవ్వాలో తెలీలేదు, భయం నన్ను ఆవరించింది. నా చిన్నారి ఏమవుతుందో అన్న ఆందోళన తప్ప ఇంకేమి లేదు నా మనస్సులో.

అప్పటి నుండి ఆందోళన అనేది నా జీవితాల్లో ఒక భాగంగా అయిపోయింది. ప్రేగ్నన్ట్ అయిన క్షణం నుంచి ఇప్పటి దాకా పడిన ప్రతి కష్టం, కన్న ప్రతి కల గుర్తుకు వచ్చాయి.

నేను చిన్నగా ఉన్నప్పుడు, మా అమ్మ ప్రవర్తన చూసి నాకు చాలా కోపం వచ్చేది. ప్రతి చిన్నదానికి ఆందోళన పడతావ్ ఎందుకు అని విసుక్కునే దానిని. కాలేజీ నుంచి లేటుగా వచ్చినా, కొంచెం కడుపు నొప్పి వచ్చినా, అంత ఎందుకు ఒక దగ్గు దగ్గినా కూడా కంగారు పడిపోయేది. నాకు కోపం వచ్చేది. కానీ, ఆ సమయంలో నా గురించి తాను పడే ఆరాటం గ్రహించలేకపోయా.

ఇంకా గుర్తు, నాకు పెళ్లైనప్పుడు, నా వివాహ జీవితం ఎలా ఉంటుందో అని మా అమ్మ చాలా భయపడేది. బాగుండాలని పూజలు చేసేది. కొంచెం డల్ గా కనపడినా భయపడేది. ఎందుకు ఇంత చిన్న విషయాలకు భయపడతారు అనేది నాకు అప్పుడు అర్థం అయ్యేది కాదు.

కానీ, ఇప్పుడు అంతా అర్థమవుతోంది. నేను కూడా తల్లి అయ్యాక మా అమ్మ పడే ఆవేదన అర్థమవుతోంది. బిడ్డ గురించి ఆందోళన చెందడం అనేది తల్లి యొక్క సహజ లక్షణం అని అర్థమైంది. ముఖ్యముగా మా అమ్మ ప్రేమ అర్థమైంది. నా బిడ్డ పుట్టి నాకు నా తల్లి ప్రేమను తెలియ చేసాడు అని అనిపించినప్పుడు మరింత ఆనందంగా అనిపించింది.

అంతే కాదు, మా అమ్మ ఆందోళన మాత్రమే కాదు, ప్రతి తల్లి పడే ఆవేదన ఇప్పుడే అర్థం అయ్యింది. పిల్లలు ఎంత పెద్దవారు అయినా, ఇంకో బిడ్డకు జన్మనిచ్చినా తల్లి ప్రేమ తగ్గదు, మారదు. నాకిప్పుడు 40 ఏళ్ళు, కానీ మా అమ్మ ఇంకా నా గురించి ఆందోళన చెందుతూనే ఉంటుంది.

మనం కొత్తగా తల్లి అయినప్పుడు, బిడ్డకు కావాల్సిన పాలు అందుతున్నాయో లేదో అని దిగులు చెందుతాం. నిద్ర సరిగా పోతున్నారా? డైపర్ రాష్ ఏమైనా వచ్చిందా? ఇలా ప్రతి క్షణం ఎదో ఒక భయం.

కొంచెం పెరిగాక, స్కూల్ గురించి, ఫ్రెండ్స్ గురించి, వారి చదువు గురించి, భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటాం. అంత ఆలోచిస్తాం కనుకనే వారిలో చిన్న మార్పు కనపడినా భయపడిపోతాం. కానీ, మనం మం తల్లి అర్థం చేసుకోనట్టే మన బిడ్డకు కూడా దీనిని అర్థం చేసుకునే అనుభవం లేదు.

యవ్వనంలోకి అడుగు పెట్టాక, మంచి కాలేజీ వస్తుందా లేదా, ఎవరినైనా ప్రేమించి కష్టాలు పడుతుందా, పెళ్లి చేయాలి అంటే మంచి వరుడిని వెతకాలి, వెతికిన మంచివాడేనా, జీవితాంతం నేను చూసుకున్నట్టే న బిడ్డను చూసుకుంటాడు? ఇలా ఎంత ఆందోళన చెడుతుంటామో కదా!

కానీ, ఆందోళన చెందడం తగ్గించి ఆలోచిండానికి ప్రయత్నం చేయాలి.  ఎందుకంటే ఆందోళన తీసుకునే నిర్ణయాలు అంత మంచివి కాదు.

ఏది ఏమైనా, అమ్మతనం అనేది అనేక ఆవేదనల మరియు ఆనందాల రంగుల రాట్నం. ఒక్క సారి చాలా ఆనందం, ఒక్కసారి భయం, ఒక్కసారి ఓదార్పు మరొక సారి నిటూర్పు. మోతంగా ప్రపంచంలో ఉన్న అన్ని ఫీలింగ్స్ కలిపితే వచ్చేదే అమ్మతనం. దేవుడు ఇచ్చిన వరం. జీవితానికి అదే ఆధారం మరియు సంపూర్ణం. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon