Link copied!
Sign in / Sign up
6
Shares

‘ఓట్స్ పాయసం’ : పిల్లలు, పెద్దలు ఇష్టంగా తినేలా 10 నిముషాల్లో ఎలా చేసుకోవచ్చో చూడండి

ఓట్స్.. ఈ పేరు ఎంతమందికో తెలుసో, తెలియదో గానీ మంచి పౌష్టికాహారాన్ని ఇచ్చే ఆహారం. ఇందులో అధిక మోతాదులో విటమిన్స్, ప్రోటీన్స్, పీచు పదార్థాలు మరియు కార్బోహైడ్రేట్స్ ఉండటం వలన శరీరానికి మంచి శక్తిని మరియు ఆరోగ్యాన్ని ఇస్తుంది. ఓట్స్ తీసుకోవడం వలన తీసుకున్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది మరియు గుండె జబ్బులు, మధుమేహం రాకుండా చేయగలదు. అయితే మన టైనీ స్టెప్ రెగ్యులర్  గా ఫాలో అయ్యే ఒక మహిళ సొంతంగా వండి పంపించారు. అదే ‘ఓట్స్ పాయసం’. ఓట్స్ పాయసం ఎలా పదే 10 నిముషాలలో ఎలా చేసుకోవచ్చో ఇక్కడ చూద్దాం.. 

ఓట్స్ పాయసం తయారీకి కావలసిన పదార్థాలు :

◼️ ఓట్స్

◼️ చక్కర

◼️ పాలు

◼️ బాదం

◼️ కాజు

◼️ కిస్ మిస్

◼️ యాలకుల పొడి

◼️ నెయ్యి

◼️ ఒక ఓట్స్ కప్పుకు రెండు కప్పుల పాలు మరియు ఒక కప్పు చక్కర కలుపుకోవాలి.

ఓట్స్ పాయసం తయారీ విధానం

◼️ ముందుగా ప్యాన్ తీసుకుని చిన్నగా మంట పెట్టుకుని అందులో ఒకటి లేదా రెండు స్పూన్ల నెయ్యి వేసి అందులో బాదం, కాజు, కిస్ మిస్ వేసి కాస్త రంగు మారేవరకు ఉంచి తర్వాత కిందకు దోచుకోవాలి.

◼️ వీటిని ప్యాన్ నుండి కిందకు తీశాక రెండు స్పూన్ల నెయ్యి వేసుకుని అందులో కప్పు ఓట్స్ వేసి ఫ్రై గా చేసుకోవాలి.

◼️ ఆ తర్వాత ఓట్స్ ను ఒక గిన్నెలోకి వేసుకుని, ప్యాన్ లో రెండు కప్పుల పాలు వేసి మరిగించాలి. పాలు మరుగుతున్నప్పుడే అందులో ఓట్స్ మరియు చక్కర కలిపి మిక్స్ చేసి మరిగించుకోవాలి.

◼️ ఇక చివరగా ఫ్రై చేసుకున్న బాదం, కాజు, కిస్ మిస్ లను వేసి మిక్స్ చేసినట్లయితే ఓట్స్ పాయసం రెడీ అయినట్లే.

ఓట్స్ పాయసం ఎవరు తినవచ్చు..?

◼️ ఓట్స్ పాయసం గర్భవతులు అనగా 6-9 నెలలు ఉన్నవారు తీసుకోవచ్చు. అలాగే 12-36 నెలల ఉన్న పిల్లలకు, ఆపై వయస్సు వారికి కూడా ఇవ్వవచ్చు. 10 నిముషాల్లో తయారు చేసుకునే ఈ వంటకాన్ని స్వాతి గారు మనకు రాసి పంపించారు. ఓట్స్ తో చేసిన ఈ పాయసం ఆరోగ్యానికి మంచిది కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon