Link copied!
Sign in / Sign up
0
Shares

ఈ రోజు ఎన్టీఆర్ గారి జయంతి : ఆయన గురించి ఎవ్వరికీ తెలియని 5 నిజాలు

మన తెలుగువారికి రాముడు, కృష్ణుడు,దుర్యోధనుడు, రావణుడు, పోతులూరి వీరబ్రహ్మం.. వీళ్ళు ఇలాగే ఉంటారేమో అనేంతలా తన అద్భుతమైన నటనతో, వాక్చాతుర్యంతో మెప్పించి తెలుగు ప్రజల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు నందమూరి తారక రామారావు. ఆయన మనతో పాటు లేకపోయినా అన్నగారు అనే మాట వినిపించినప్పుడు, తెలుగు సినిమా బ్రతికున్నంత కాలం ప్రతి ఒక్కరి మదిలో అలా ఉండిపోతారు. ఈ రోజు ఆయన జయంతి సందర్భంగా ఎన్టీఆర్ గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు మీకోసం..

ఎన్టీఆర్ పుట్టగానే పెట్టాలనుకున్న పేరు..

1923 మే 28 న ఆంద్రప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లాలో గల నిమ్మకూరు గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామమ్మ దంపతులకు జన్మించారు ఎన్టీఆర్. ఎన్టీఆర్ పుట్టగానే వాళ్ళ అమ్మగారు ఆయనకు కృష్ణ అనే పేరు పెడితే బాగుంటుందని భావించారట. అయితే ఎన్టీఆర్ మేనమామ మాత్రం ఆయన ముఖవర్ఛస్సు చూసి తారక రాముడు అనే పేరు ఎలా ఉందని అడిగాడట. తారక రాముడు కాస్త తారక రామారావు అయ్యింది. బహుశా ఈ విషయం కొద్దిమందికి తెలిసి ఉండవచ్చు.

రూ. 1016 లు మొదటి సినిమాకు

ఇప్పుడు వెయ్యి నూట పదహార్లు అంటే కాస్త చిన్న విషయం కావచ్చు గానీ అప్పట్లో ఇంత డబ్బంటే అమ్మో అని ఆశ్చర్యం వ్యక్తం చేసేవారు. ఎన్టీఆర్ కళాశాలలో చదువుతుండగా స్టేజీ నాటకాలు బాగా వేశేవారు. తన 20 ఏళ్ళ వయస్సులో మేనమామ కూతురు బసవ రామతారకాన్ని వివాహం చేసుకున్న ఎన్టీఆర్, ఆ తర్వాత ఇంట్లో ఆర్ధిక ఇబ్బందుల కారణంగా పాల వ్యాపారం, కిరాణా కొట్టు, ముద్రణాలయం నడిపారు. ఆ తర్వాత సబ్ రిజిస్ట్రార్ గా ఉద్యోగం వచ్చింది. అయితే ఎన్టీఆర్ కు సినిమాలు, నాటకాలు బాగా ఇష్టం కావడంతో అటుగా ప్రయత్నాలు చేశేవారు. ఒకేసారి ఆయన ఫోటో చూసిన దర్శకుడు, నిర్మాత బి.ఏ. సుబ్బారావు ఎన్టీఆర్ హీరోగా ‘పల్లెటూరి పిల్ల’ అనే సినిమా చేశారు. ఆ సినిమాకు రూ.1016 లు రెమ్యునరేషన్ ఇచ్చారట. సినిమాల్లోకి వచ్చాక తన సబ్ రిజిస్ట్రార్ ఉద్యోగం వదిలేశారు.

ఒకే టేకులో చెప్పేవారు

విశ్వవిఖ్యాత నటసార్వభౌమ ఎన్టీఆర్ పేరు వినపడగానే మన అందరికీ గుర్తుకువచ్చేది ఇదే కదా. తన అద్భుతమైన నటనతో, గుక్క తిప్పకుండా చెప్పే డైలాగులతో తెలుగు ప్రేక్షకుల హృదయాలలో చెరగని ముద్ర వేసుకున్నారు. అయితే తన వృత్తి పట్ల ఆయన చాలా క్రమశిక్షణగా ఉండేవారట. షూటింగ్ కు ఒక గంట ముందుగానే రావటం, నెక్స్ట్ రోజు షూటింగ్ లో ఏం చేయబోతున్నారో తెలుసుకుని ముందే డైలాగులు ప్రాక్టీస్ చేయడం వలన షూటింగ్ లో మరోసారి అస్సలు మరో టేక్ తీసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదట.

ఎన్టీఆర్ కుటుంబం

ఎన్టీఆర్ కుటుంబం చాలా పెద్దది. ఎన్టీఆర్, బసవ రామ తారకం దంపతులకు 11 మంది సంతానం కాగా అందులో 7 మంది మగ పిల్లలు, నలుగురు ఆడపిల్లలు. వీరిలో బాలకృష్ణ, హరికృష్ణ, రామకృష్ణ, దగ్గుబాటి పురంధేశ్వరి సినిమాలలో, రాజకీయ రంగాలలో రాణించారు, రాణిస్తున్నారు. అప్పట్లో రాష్ట్రంలో వచ్చిన రాజకీయ గొడవల కారణంగా ఎన్టీఆర్ తెలుగుదేశం అనే పార్టీని స్థాపించి 1983లో ఆంధ్రప్రదేశ్ కు 10 వ రాష్ర్ట ముఖ్యమంత్రిగా ఎన్నికయ్యారు.

ఎన్టీఆర్ బయోపిక్

జానపద, సాంఘిక, పౌరాణిక ఇలా ఏ చిత్రమైనా సరే అందులో అవలీలగా ఒదిగిపోయి తెలుగుజాతికి కీర్తికిరీటంగా, భారతజాతి గర్వకారణంగా నిలిచిన ఎన్టీఆర్ తెలుగు, తమిళ మరియు హిందీ భాషలలో కలిపి దాదాపు 400 పైగా చిత్రాలలో నటించారు. కాగా, ప్రస్తుతం ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ క్రిష్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ జీవిత చరిత్రను సినిమాగా తెరకెక్కిస్తున్నారు.

తెలుగువారి హృదయాలలో చెరగని ముద్రను వేసుకున్న ఎన్టీఆర్ గారి జయంతిని గుర్తుచేసుకుంటూ ఇవే మా ఘన నివాళులు..   

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon