Link copied!
Sign in / Sign up
24
Shares

నోటిలో పుండ్లు తగ్గాలంటే వెంటనే ఏం చేయాలి? అద్భుత ఇంటి చిట్కాలు మీకోసం..

నోటి పుండ్లు లేదా నాలుక పూత..దాదాపు ఈ సమస్యను ప్రతి ఒక్కరూ ఎదుర్కునే ఉంటారు. నోటిలో పుండ్లు వచ్చినప్పుడు నోటి లోపల సున్నితమైన చర్మం చీలి పోవడం, పుండుగా మారిపోయి ఎర్రగా అవ్వటం, కొన్నిసార్లు రక్తం వచ్చినట్లుగా ఉండటం జరుగుతూ ఉంటుంది. నోటిలో పుండ్లు రావడానికి కారణాలు ఏంటి? నోటి పూతను ఎలా తగ్గించుకోవాలో ఇక్కడ చూద్దాం..

నోటి పుండ్లు కారణాలు :

- నీరు తీసుకోకపోవడం వలన 

- రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటం 

- దంతాల వ్యాధులు లేదా నోరు శుభ్రంగా లేకపోవడం 

- ఎక్కువగా మందులు వేసుకున్నప్పుడు 

- టూత్ పేస్ట్ లు తరచూ మారుస్తున్నప్పుడు 

- వైరస్, బాక్టీరియా, ఫంగస్ కారణంగా 

-మౌత్ క్యాన్సర్ వలన 

నోటి పుండ్లు లక్షణాలు :

- నోరు, నాలుక భాగం పగిలిపోయి ఎర్రగా మారటం 

- నీరు, ఆహారం తీసుకోలేకపోవడం 

- నోట్లో నీరు ఊరుతూ ఉండటం 

- మంట పుట్టడం, కొన్నిసార్లు రక్తం రావడం 

- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు 

నోటి పుండ్లు నివారణ చర్యలు :

నోటి పుండ్లు ప్రతి ఒక్కరినీ ఏదో ఒక సందర్భంలో బాధించే సమస్య. నోటి పూత కారణంగా ఆహారం, నీరు తీసుకోవడానికి ఇబ్బంది పడటం, మానసిక ఒత్తిడి, ఏ పనిపైనా దృష్టి కేంద్రీకరించలేకపోవడం వంటివి ఎదురవుతూ ఉంటాయి. అందుకని ఇక్కడ చెప్పుకునే ఇంటి చిట్కాలు ఫాలో అవ్వడం వలన నోటి పుండ్ల సమస్త నుండి బయటపడవచ్చు. 

తేనె 

నోటి పుండ్లు లేదా నాలుకపూత సమస్యతో బాధపడుతున్నప్పుడు కొద్దిగా తేనె తీసుకుని పుండ్లుగా ఉన్న భాగంలో రాసుకోవాలి. ఇలా చేయడం వలన నొప్పి తగ్గి ఉపశమనం లభిస్తుంది. తేనెలో ఆమ్లా పౌడర్ లేదా కాస్త కలుపుకుని నోటి పూతపై రాసుకున్నా సరే మంచి ఫలితం ఉంటుంది. 

నెయ్యి లేదా కొబ్బరి నూనె 

నోటిలో పుండ్లు ఉన్నప్పుడు నెయ్యి లేదా కొబ్బరి నూనెను వాటి చుట్టూ రాసుకుని నెమ్మదిగా మసాజ్ చేసుకోవాలి. ఇలా చేస్తున్నప్పుడు నోటిలో నీరు ఊరటం జరుగుతూ ఉంటుంది. అలా జరగగానే బయటకు ఉమ్మి వేయాలి. మళ్ళీ కొద్దిసేపు ఆగిన తర్వాత నెయ్యి లేదా కొబ్బరి నూనె రాసుకోవడం చేయాలి. ఇలా చేయడం వలన నోటి పుండ్లు త్వరగా నయం అవుతాయి. 

ఉప్పు నీరు 

ఉప్పు నీటితో పుక్కిలించడం వలన నోటిలో పుండ్లు త్వరగా నయం అవుతాయనేది వాస్తవమే కానీ కాస్త మంట పుడుతుంది. ఒక స్పూన్ ఉప్పు తీసుకుని, ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో వేసుకోవాలి. .ఉప్పు బాగా కరిగిన తర్వాత ఈ నీటితో పుక్కిలించుకోవడం వలన తక్షణ ఉపశమనం లభిస్తుంది. అయితే ఇలా చేస్తున్నప్పుడు కాస్త మంటగా ఉండటం నిజమే. నోటి భాగంలో ఇంకా ఉప్పగా ఉన్నట్లు అనిపిస్తే మంచి నీటితో నోటిని పుక్కిలించుకోవాలి. 

తులసి ఆకులు 

తులసి ఆకుల వలన ఆరోగ్యపరంగా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. నోటి పుండ్లు ఉన్నప్పుడు కొన్ని తులసి ఆకులు తీసుకుని బాగా నమలడం వలన తులసి ఆకుల నుండి వచ్చే రసం నోటి పుండ్లను త్వరగా నయం అయ్యేలా చేస్తుంది. అలాగే ఒక గ్లాస్ నీటిలో తులసి ఆకులను ఉంచుకుని ఈ నీటిని సేవించినా మంచి ఫలితం ఉంటుంది. 

నోటి పుండ్లు ఉన్నప్పుడు ఈ చిట్కాలు బాగా ఉపయోగపడతాయి. ఇంకా మీకు ఏమైనా చిట్కాలు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్ లో తెలుపవచ్చు. అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి.

cover image source : Mavcure.com

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

Recently, we launched a baby-safe, natural and toxin-free floor cleaner. Recommended by moms and doctors all over India, this floor-cleaner liquid gets rid of germs and stains without adding harmful toxins to the floor. Click here to buy it and let us know if you liked it.

Stay tuned for our future product launches - we plan to launch a range of homecare products that will keep your little explorer healthy, safe and happy!

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon