Link copied!
Sign in / Sign up
28
Shares

నోటి దుర్వాసన చాలా ప్రమాదకరం : నోటి దుర్వాసనను పోగొట్టే అద్భుత చిట్కాలు మీకోసం

హాయిగా నవ్వడం, పలకరించడం, నలుగురితో కలిసి మాట్లాడితే ఈ ప్రపంచంలో  ఎటువంటి సమస్యలు ఉండవనేది నా పర్సనల్ ఫీలింగ్.  ఐతే సొంతవారితో కూడా నోరు తెరచి మాట్లాడలేక ఇబ్బంది పడుతున్నారంటే నోటి దుర్వాసనే ఇందుకు కారణం. సొంతవాళ్ళ దగ్గర అవమానకరంగా ఉంటుంది ,  సరిగ్గా మాట్లాడలేక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలా ఉంటే ఏం కాదులే అని మాత్రం నిర్లక్ష్యం చేయకండి. సింపుల్ గా ఈ సమస్య నుండి ఎలా బయటపడాలో తెలుసుకోండి.

నోటి దుర్వాసన రావడానికి కారణాలు

నోరు సరిగ్గా శుభ్రం చేసుకోకపోవడం వలన, దంత సమస్యలు, దంతాలు మరియు చిగుళ్ల ఇన్ఫెక్షన్స్, తీసుకున్న ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం, నోటిలో తేమ లేకపోవడం అంటే నీరు సరిగ్గా తీసుకోకపోవడం..ఇలా నోటి దుర్వాసనను కలిగిస్తాయి. పక్కవాళ్ళకు ఇది నవ్వుతెప్పిస్తుంది కానీ ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే వారు కూడా భరించలేరు కాబట్టి, అందుకే ఈ విషయాలు చెప్పుకోవడం జరిగింది.

లవంగాలు

లవంగాలు లేదా యాలకులను భోజనం చేసిన తర్వాత గానీ ఖాళీగా ఉన్న సమయాలలో రెండు నోట్లో వేసుకుని నమిలితే నోటి దుర్వాసన రాకుండా ఫ్రెష్ గా ఉంటుంది.

సోంపు

నోటి నుండి చెడు దుర్వాసన వస్తున్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా ఈ పని చేయండి. ప్రతి రోజూ బ్రష్ చేసిన తర్వాత సోంపులను నీటిలో వేసుకుని మరిగించుకుని టీలా చేసుకోవాలి. ఇలా సోంపు టీని సేవించడం వలన నోటి దుర్వాసన సమస్య నుండి బయటపడవచ్చు. ఇలా చేయడం వలన నోటిలో తేమ శాతం ఉంటుంది కాబట్టి నోటి దుర్వాసన ఉండదు.

నిమ్మరసంతో పుక్కిలించండి

ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం తీసుకుని ఒక గ్లాస్ నీటిలో కలుపుకోవాలి. ఈ నీటితో పొక్కిలించడం వలన నోట్లో బాక్టీరియా చేరకుండా కాపాడుకోవచ్చు. ఒకవేళ బాక్టీరియా ఉన్న ఇలా నిమ్మరసంతో పుక్కిలించడం వలన చనిపోతుంది.

కొబ్బరినూనె

నోటి నుండి చెడు దుర్వాసన రావడానికి కారణం చిగుళ్ల సమస్య కూడా కాబట్టి, కొన్ని చుక్కల కొబ్బరి నూనె నోటిలో వేసుకుని పుక్కిలించడం వలన నోటిలో బాక్టీరియా చేరదు మరియు చిగుళ్ల సమస్య నుండి బయటపడవచ్చు. ఇది చాలా సింపుల్ గా ఉంటుంది కాబట్టి ఇది ప్రయత్నించి చూడండి. అలాగే ఇలా చేసిన తర్వాత గోరు వెచ్చని నీటితో పుక్కిలించడం మంచిది.

పెరుగుతో ఇలా చేయండి

పళ్ళపై చేరుకున్న పసుపు పచ్చని గార వలన కూడా ఇలా జరుగుతుంది కాబట్టి, పెరుగులో చక్కర కలుపుకుని సేవించారు, అన్నంలో కలుపుకుని తినేవారు, డైరెక్ట్ గా ఏమీ కలుపుకోకుండా తినడం మంచిది. ఇలా తినడం వలన పళ్లపై ఉన్న గార తొలగిపోతుంది మరియు నోటి పూత కూడా ఉండదు.

కొత్తిమీర

కొత్తిమీర ఆకులను నోటిలో వేసుకుని నమిలి ఆ తర్వాత నీటితో పుక్కిలించుకోవడం వలన నోటి దుర్వాసన ఉండదు. ఇలా కాకుండా కొత్తిమీర జ్యూస్ ను సేవించడం వలన కూడా చెడు దుర్వాసన నుండి బయటపడవచ్చు. ఇలా చేయడం వలన నోరు తెరచి మాట్లాడేటప్పుడు దుర్వాసన రాకుండా మరియు సరైన శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.

ఉదయం నిద్ర లేచిన తర్వాత మరియు రాత్రి పడుకునేముందు రెండుసార్లు బ్రష్ చేసుకోవడం చాలా మంచిది. అందరికీ SHARE చేయగలరు.    

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon