Link copied!
Sign in / Sign up
1
Shares

నార్మల్ డెలివరీలో కూడా కుట్లు ఉంటాయా?

ప్రెగ్నన్సీ తో ఉన్న మహిళలందరు కోరుకునేది తమకు నార్మల్ డెలివరీ జరగాలని. కానీ నార్మల్ డెలివరీలో కూడా కొన్ని సమస్యలు ఉంటాయి. ముఖ్యంగా కుట్లు. అవును నార్మల్ డెలివరీ లో కూడా కుట్లు ఉంటాయి. అందుకు కారణాలు ఏంటో తెలుసుకోండి….

1. యోని చినిగి పోతే

నార్మల్ డెలివరీలో సహజంగా కుట్ల అవసరం ఉండదు. కాన్పు జరిగేటప్పుడు యోని మార్గం ద్వారా బిడ్డ బయటకు వస్తాడు. అందుకు మీ యోని గోడలను వెడల్పు చేయాల్సి ఉంటుంది. ఒక వేళ బిడ్డ బయటకు రాడానికి మీరు వెడల్పు చేసిన యోని మార్గం సరిపోకపోతే, మీ యోని చిన్నగా చినిగిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని సార్లు ఆ చినగడం ఎక్కువగా ఉండచ్చు, యోని ద్వారం, మల ద్వారం కలిసి పోయేంత కూడా చినిగిపోవచ్చు. ఈ చినిగిపోయిన ప్రాంతం కుట్లు వేస్తారు.

2. ఎపీసీయోటమి - Episiotomy

ఒక వేళ కడుపులోని బిడ్డ బయటకు రావడానికి మీరు యోని మార్గాన్ని వెడల్పు చేయలేకపోతే. కాన్పు ముందే యోని మార్గాన్ని కోత ద్వారా వెడల్పు చేస్తారు. బిడ్డను బయటకు తీసిన తరువాత కుట్లు వేస్తారు.

నార్మల్ డెలివరిలో కుట్లు వేసినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు

1. కుట్ల దగ్గర లావెండర్ ఆయిల్ ను పూయండి. కుట్లు త్వరగా మానిపోతాయి.

2. కూర్చోవడానికి ఇబందిగా ఉన్నప్పుడు. మెత్తని దిండు లేదా వాటర్ బాగ్ కుర్చునేటప్పుడు వాడండి.

3. వాపు, నొప్పి ఎక్కువగా ఉంటే ఐస్ క్యూబ్స్ తో ఆ ప్రాంతంలో మర్దన చేసుకోండి.

4. కుట్లను వేడి నీళ్ళతో కడగండి.

 

 

 

5. ఎక్కువుగా నీరు, పీచు పదార్ధాలు ఆహారంగా తీసుకోండి. మలం సులభంగా వస్తుంది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon