Link copied!
Sign in / Sign up
13
Shares

నార్మల్ డెలివరీ జరగాలంటే ప్రగ్నెన్సీ సమయంలో ఈ 10 పనులు తప్పక చేయాలి

పిల్లలను కనడం, తల్లి కావడం అనేది మహిళలకు అత్యంత ఆనందాన్ని ఇచ్చే క్షణాలు. అయితే ప్రస్తుతం చాలామందిలో సహజ కాన్పు కన్నా సిజేరియన్ ఆపరేషన్స్ ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో కొందరు మహిళలు పిల్లలను కడగడానికి భయపడుతున్నారు.అయితే పవిత్రమైన స్త్రీ యోని నుండి బిడ్డ జన్మ ఇవ్వడానికి గర్భంతో ఉన్నప్పుడు ఎటువంటి టిప్స్ పాటించాలో తెలుసుకోండి.

మీ శరీరాన్ని కదపాలి

నిజమే గర్భంతో ఉన్నప్పుడు ఎక్కువగా పడుకోవాలని, నిద్రించాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. ఐతే ఎప్పుడు నిద్రతోనే కాకుండా అప్పుడప్పుడు మీ శరీరాన్ని కదిలిస్తూ ఉండటం చేయాలి. వ్యాయామాలు చేయడం, అటు ఇటు ఇంటి వద్దనైనా నడవడం, స్విమింగ్ చేయడం చేయాలి. ఇలా చేయడం వలన నార్మల్ డెలివరీ జరగడానికి ఉపయోగపడుతుంది.

ఒత్తిడి అనే మాట ఉండకూడదు

ప్రెగ్నన్సీ సమయంలో బిడ్డ ఎలా పుడతాడు, ప్రసవం బాగానే జరుగుతుందా, నా బిడ్డ ఆరోగ్యంగానే పుడతాడు కదా..! ఇలా లేనిపోని ఆలోచనలు, టెన్షన్స్ మైండ్ లో గరగరా తిరుగుతూ ఒత్తిడికి గురి చేస్తాయి. ఒత్తిడికి గురి కావడం మీకు, బిడ్డకు మంచిది కాదు. అందుకే ధ్యానం చేయడం లేదా చక్కనైన సంగీతం వినడం చేయాలి.

శ్వాస పీల్చుకోవడం

ఇది అందరికీ కాస్త ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ సహజ కాన్పు జరగడానికి బాగా ఉపయోగపడుతుంది. మీరు పీల్చే శ్వాస మీతో పాటు బిడ్డకు ఆక్సిజన్ ను అందిసస్తుంది. అందుకే కడుపు నుండి చెస్ట్ వరకు బాగా గాలి పీల్చడం వదలడం చేయాలి.

సరైన ఆహారం

మనదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా గర్భం సమయంలో సరైన పోషక విలువలు కలిగిన ఆహారం తీసుకోలేక బిడ్డను కోల్పోవలసి వస్తోంది. గ్రీన్ వెజిటేబుల్, ప్రోటీన్స్, విటమిన్స్ ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం చేయాలి.

బరువు పెరగకండి

గర్భం దాల్చిన తర్వాత కొందరు బరువు పెరగడం, బరువు తగ్గడం జరుగుతూ ఉంటుంది. బరువు తగ్గకుండా చూసుకోవాలి,  అలాగే అధిక బరువు కారణంగా నార్మల్ డెలివరీ జరగడానికి ఇబ్బందిగా ఉంటుంది. ఎక్కువ వెయిట్ కారణంగా నార్మల్ డెలివరీ కాకుండా సి సెక్షన్ చేయాల్సి వస్తుంది.

ఈ మాటలు అస్సలు నమ్మకండి

పిల్లలు కనినవారు లేదా మీరంటే ఇష్టం లేనివారు, పడనివారు కొన్ని భయపడే విషయాలు చెప్పి బిడ్డ కనడం అంత ఈజీ కాదు, నువ్వు బిడ్డను కనలేవు ఇలా ఐతే నిరుత్సాహపరుస్తూ ఉంటారు. ఇలాంటివి అస్సలు నమ్మకండి. వీలైనంత వరకు వారికి దూరంగా ఉండండి.

బిడ్డ జననం గురించి తెలుసుకోండి

మీరు తరచూ గర్భంతో ఉన్నప్పుడు డాక్టర్ ను కలవడం చేస్తూ ఉంటారు కాబట్టి సహజ కాన్పు జరగాలంటే ఏం చేయాలి, ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అని మీరే అడిగి తెలుసుకోండి. నిజానికి సి సెక్షన్ కన్నా సహజ కాన్పు జరిగితే మీరు ఆరోగ్యంగా ఉండగలరు. ఐతే బిడ్డకు ప్రమాదం అని తెలిసినపుడే సి సెక్షన్ చేస్తుంటారు.

నీటితో ఎక్కువ సమయం గడపండి

ప్రెగ్నన్సీతో ఉన్నప్పడే కాదు, మాములుగానూ ఎక్కువ నీటిని తీసుకోవడం వలన డీహైడ్రేషన్ బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండగలరు. అందుకే వీలైనంత ఎక్కువగా నీటిని తీసుకోమని చెప్పడానికి అదే కారణం. అలాగే బాత్ టబ్ స్నానం చేయడం వలన మీలో ఉన్న ఒత్తిడి దూరం అవుతుంది. లేకపోతే షవర్ బాత్ అయినా బెటరే.

మీకు సపోర్ట్ ఇచ్చేవాళ్ళు ఉండాలి

ప్రెగ్నన్సీ సమయంలో నెగటివ్ ఆలోచనలు రాకుండా మీకు ధైర్యాన్ని ఇచ్చేవాళ్ళు, మీకు సపోర్ట్ గా నిలబడే మీ భర్త, మీ తల్లితండ్రులు మీ పక్కన ఉండటం వలన మీకు ప్రసవం గురించి ఎటువంటి భయం ఉండదు.

నార్మల్ డెలివరీ ఎలా జరుగుతుందో ఈ వీడియోలో చూడండి. ఇందుకు సిద్దపడండి. 

Video Source : 7activesstudio

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon