Link copied!
Sign in / Sign up
2
Shares

పావురాల వలన ప్రాణాలు పోగొట్టుకున్న 2 ఏళ్ళ పసివాడు : బెంగుళూరులో జరిగిన ఘటన

నిండా రెండేళ్లు కూడా నిండని బాలుడిని క్షణికావేశంలో కొట్టి, ఆ బాలుడి చావుకు కారణం అయ్యాడు 14 ఏళ్ళ కుర్రాడు. ఎందుకు కొట్టావు అని అడిగితే తన పావురాలను పంజరం నుండి వదిలిపెట్టినందుకు కొట్టానని సమాధానం చెప్పాడు. బెంగళూరులో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం వైరల్ గా మారింది. అసలేం జరిగిందంటే..

ఇంటిపక్కనే కుటుంబాలు తరచూ గొడవలు

రాయచూర్ కు చెందిన బసవరాజ్, వెంకమ్మ అనే దంపతులు బెంగళూరులోని సోలాన్ దేవనహళ్లి మెయిన్ రోడ్ పై తుముకూరు వెళ్లే దారిలో తోపుడుబండిపై తినుబండారాలు అమ్ముకుంటూ తమ ముగ్గురు పిల్లలతో జీవనం సాగిస్తున్నారు. వీళ్ళ మూడవ కుమారుడే 2 ఏళ్ళ పిల్లాడు. పేరు వెంకటేష్. ఇక తమ ఇంటి పక్కనే ఉండే మరో కుటుంబం టీ వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరి కుమారుడికి 14 ఏళ్ళు, 8 వ తరగతి చదువుతున్నాడు. ఈ రెండు కుటుంబాల మధ్య తరచూ ఏదో ఒక గొడవ జరుగుతూ ఉండేదట.

రూ.100 పావురాలు విడిచిపెట్టాడని

టీ వ్యాపారి కుమారుడు 100 రూపాయలు పెట్టి 3 పావురాలను కొన్నాడు. వీటిని ఇంటి దగ్గర పంజరంలో ఉంచుకుని ప్రేమగా చూసుకుంటున్నాడు. బసవరాజ్ కొడుకు వెంకటేష్ వాటితో ఆడుకోవాలనే ఆశతో పంజరం కిటికీ తీయగా పావురాలు బయటకు వెళ్లిపోయాయి. తన పావురాలు కనిపించకపోయేసరికి స్కూల్ నుండి ఇంటికి వచ్చిన టీ వ్యాపారి కొడుకు, వాళ్ళ ఇంటికి వెళ్లి గొడవ చేశాడు. నేనే బయటకు వదిలాలని చెప్పగా, ఆ అబ్బాయి బయటకు వెళ్లి వెతికాడు. బయట కనిపించకపోయే సరికి కోపంతో 2 ఏళ్ళ వెంకటేష్ ను కిందకు పడేసి గట్టిగా కొట్టడంతో అపస్మారక స్థితిలోకి పడిపోయాడు. పిల్లాడి తండ్రి ఇంటికి వచ్చాక కొడుకు అలా ఉండటం చూసి హాస్పిటల్ కు తీసుకెళ్లాడు. అప్పటికే బాబు మరణించినట్లు డాక్టర్ తెలిపారు.

నేనే చేశాను

తన పావురాలు విడిచిపెట్టాడని కోపంతో నేనే వెంకటేష్ ను కొట్టానని టీ వ్యాపారి కొడుకు పోలీసుల ముందు నిజం ఒప్పుకున్నాడు. ఇంత చిన్న వయస్సులోనే అభం శుభం తెలియని మరో 2 ఏళ్ళ పిల్లాడి చావుకు కారణమైన ఈ బాబు చేసిన పనికి ఆ తల్లితండ్రులు విలవిలలాడిపోతున్నారు. కోపంతో చేసిన ఆ పనివలన బాబు ప్రాణాలను వెనక్కు తీసుకురాలేరు కదా… 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon