Link copied!
Sign in / Sign up
0
Shares

నిండు గర్భిణికి నొప్పులు వస్తుంటే బయటకు పంపిన డాక్టర్లు : గేటు బయట ఆడపిల్ల పుట్టింది

స్వాతంత్య్రం వచ్చి 70 ఏళ్ళు దాటినా ఇంకా మనదేశంలో స్వేచ్ఛ, నమ్మకం, నిజాయితీ, కనికరం అనేవి ప్రజల పట్ల అధికారులకు, ప్రభుత్వానికి లేవనేది కొన్ని కోట్ల మంది భారతీయలు చెబుతున్న మాటలు. ఇక్కడ చెప్పుకునేది వింటే నిజమే అనిపిస్తుంది. 22 ఏళ్ళ నిండు గర్భిణీని హాస్పిటల్ లో చేర్చుకోకుండా గేటు బయటకు పంపించిన ఈ బాధాకరమైన ఘటనను చూస్తే గుండెల్లో బాధకలుగుతుంది. అసలేం జరిగిందంటే…

ఆధార్ కార్డు, బ్యాంకు అకౌంట్ లేవని..

ఉత్తరప్రదేశ్ లోని జాన్పూర్ జిల్లాలో గల షాగంజ్ గ్రామంలో కూలీ పని చేసుకుంటున్న అజయ్ భార్య చందా (22) గర్భవతి. నెలలు నిండడంతో తమకు దగ్గరలోని కూర్గాన్ కమ్యూనిటీ హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. హాస్పిటల్ కు వెళ్లిన తర్వాత మీ దగ్గర ఉండే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లేదా రేషన్ కార్డు చూపించమని అడిగారు. ఇంటి దగ్గర ఉన్నాయని చెప్పడంతో హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ చేయమని గేటు బయటకు పంపించారు. గేటు బయటకు నిండు గర్భిణీ అయిన చందాకు నొప్పులు రావడం మొదలయ్యాయి.

గేటు బయట ఆడపిల్లకు జన్మను ఇచ్చింది..

ఆధార్ కార్డు లేవని నొప్పులు వస్తున్నా హాస్పిటల్ లోపలికి అనుమతించకపోవడంతో పాపం ఎటువంటి వైద్యం లేకుండానే పండంటి ఆడపిల్లకు జన్మను ఇచ్చింది. ఇంటికి వెళ్లి తీసుకువస్తాను, నా భార్యకు నొప్పులుగా ఉంటే ఆలస్యం చేయకుండా వచ్చామని చెబుతున్నా కనికరించలేదట. గేటు బయట, నడిరోడ్డులో బిడ్డకు జన్మను తర్వాత హాస్పిటల్ నుండి బయటకు వెళ్లేవారు, లోపలికి వచ్చేవారు ఏంటిలా చేస్తున్నారని నిలదీయడంతో ఆ బాలింతను లోపలికి తీసుకువెళ్లి వైద్యం చేశారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. జనవరి 29 2018న ఈ సంఘటన చోటు చేసుకుంది. 

నిండు గర్భిణీ ఇంత బాధ అనుభవిస్తుంటే ఆధార్ లేదు, రేషన్ లేదు అని బయటకు పంపించారు. కనీస మానవత్వం మీకు లేదా? తల్లికీ బిడ్డకు ఏమైనా జరిగి ఉంటే మీరు బాధ్యత వహిస్తారా అని నిలదీస్తున్నారు సామాన్యులు. ఇలాంటి పరిస్థితుల్లో అయినా గవర్నమెంట్ మంచి రూల్స్ ను తీసుకువస్తే బాగుంటుంది. అందరికీ SHARE చేయగలరు…

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon