Link copied!
Sign in / Sign up
14
Shares

రూ. 2 లకు దొరికే ఈ 'నిమ్మకాయ' తో ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో ఒక్కసారి చూడండి..

నిమ్మకాయను మనం ఎక్కువగా పులిహోర చేసుకోవడానికి, పాత్రలను శుభ్రం చేసుకోవడానికి, జ్యూస్ గా చేసుకోవడానికి ఉపయోగిస్తూ ఉంటాం. అయితే ఇంత చిన్న నిమ్మకాయ మానవ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి బాగా దోహదపడుతుంది. ఆయుర్వేద, ఆరోగ్య నిపుణులు తెలిపిన ప్రకారం నిమ్మకాయ వలన కలిగే ప్రయోజనాలు ఎలా ఉన్నాయో ఒక్కసారి ఇక్కడ చూడండి. నిమ్మకాయ గురించి మీరు ఎప్పటికీ నమ్మలేని నిజాలు.. 

ఊబకాయం సమస్య ఉన్నవారు 

జీర్ణ వ్యవస్థ, ఊబకాయం సమస్యతో బాధపడేవారు ప్రతి రోజూ పరగడుపున ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో రెండు స్పూన్ల నిమ్మరసం మరియు ఒక స్పూన్ తేనె కలిపి తీసుకోవడం వలన జీర్ణ సంబంధిత సమస్యలు ఉండవు మరియు ఊబకాయం నుండి బయటపడవచ్చు. 

జలుబు తగ్గడానికి 

నిమ్మకాయలో ఎక్కువగా విటమిన్ 'సి' ఉండటం ఇది ఆరోగ్యానికి బాగా పనిచేస్తుంది. జలుబుతో బాధపడేవారు నిమ్మరసం (చల్లగా ఉండే నీరు తీసుకోకూడదు) సేవించడం వలన త్వరగా నయం అవుతుంది. ప్రతి చిన్న విషయానికి త్వరగా అలసిపోవడం, నీరసంగా ఉండేవారు నిమ్మరసం తీసుకున్నట్లయితే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. నిమ్మలో యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు అధికంగా ఉండటమే ఇందుకు కారణం. 

నలుపుగా ఉన్న చర్మం 

మెడ, భుజాలు, మోచేతులు, చంకల భాగాలలో నలుపుగా ఉన్నవారు, తరచూ మొటిమలు, నల్లని మచ్చల సమస్యతో బాధపడేవారు నిమ్మరసంను ఆ భాగాలలో రాసుకుని సున్నితంగా మసాజ్ చేసుకోవడం వలన ఇకపై ఈ సమస్యలు ఉండవు. లేదా డైలీ ఒక్కసారి ఒక గ్లాస్ లెమన్ జ్యూస్ తాగినట్లయితే ముఖం కాంతివంతంగా మెరిసిపోతుంది. 

కిడ్నీ స్టోన్స్ 

మనం ప్రస్తుతం తీసుకునే ఆహారం, జీవన విధానం కారణంగా ఎన్ని వ్యాధులు మన శరీరాన్ని అంటుకుంటున్నాయో చెప్పడం కాస్త కష్టమే. కిడ్నీలో చిన్న చిన్న రాళ్లు ఉన్నాయని డాక్టర్లు చెప్పినప్పుడు సహజంగా స్టోన్స్ కరిగిపోవడానికి మంచి నీరు ఎక్కువగా సేవించమని అంటుంటారు. మంచి నీటితో రోజుకి రెండు గ్లాసుల నిమ్మరసం సేవించడం వలన కిడ్నీ స్టోన్స్ కరిగించివేస్తుంది. అలాగే మలబద్ధకం సమస్యతో బాధపడేవారు కూడా గోరు వెచ్చని నీటిలో రెండు లేదా మూడు స్పూన్ల నిమ్మరసం కలుపుకుని సేవించడం వలన మలబద్దకం సమస్య ఉండదు. 

చెడు కొలెస్ట్రాల్ 

రక్తంలో చేరుకున్న చెడు కొలెస్ట్రాల్ ను శుద్ధి చేయడంలో మరియు రక్తంలో ఉన్నటువంటి కొవ్వును బయటకు పంపించడానికి ప్రతిరోజూ నిమ్మరసంలో కాస్త తేనె కలిపి సేవించడం వలన మంచి ఫలితం ఉంటుంది. 

చుండ్రు సమస్య 

పొల్యూషన్ కారణంగా, దుమ్ము ధూళి కారణంగా, వివిధ రకాల షాంపూలు వాడటం వలన చుండ్రు సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటివారు కాస్త నిమ్మరసం తీసుకుని జుట్టు కుదుళ్లకు తాకేలా అప్లై చేసుకుని మర్దనా చేసుకోవాలి. ఇలా చేయడం వలన చుండ్రు సమస్య నుండి బయటపడవచ్చు. 

నిమ్మకాయతో ఇవే కాదండోయ్ ఇంకా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మీకు ఏమైనా తెలిసి ఉంటే అందరికీ తెలిసేలా కామెంట్ చేయండి. ఈ ఆరోగ్య ప్రయోజనాలను అందరికీ షేర్ చేయండి..

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Dear Mommy,

We hope you enjoyed reading our article. Thank you for your continued love, support and trust in Tinystep. If you are new here, welcome to Tinystep!

We have a great opportunity for you. You can EARN up to Rs 10,000/- every month right in the comfort of your own HOME. Sounds interesting? Fill in this form and we will call you.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon