Link copied!
Sign in / Sign up
15
Shares

ప్రపంచాన్ని వణికిస్తున్న ‘నిఫా వైరస్’ : మీ ప్రాణాలు, పిల్లలు కాపాడుకోవాలంటే ఈ జాగ్రత్తలు తీసుకోండి. లక్షణాలు..

ప్రస్తుతం ఒక కొత్త వైరస్ మనదేశంలోకి ఎంటర్ అయింది. నిజానికి ఇది కొన్నేళ్ల క్రితమే మలేషియాలో కొంతమంది ప్రాణాలను బలితీసుకుంది. ఇప్పుడు మనకు దగ్గరలో ఉన్నటువంటి కేరళ రాష్ట్రంలో కొంతమంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు వదలగా, ఇంకొంతమంది ఆ వైరస్ సోకడంతోప్రాణాలతో పోరాటం చేస్తున్నారు. ఒకరి నుండి ఒకరికి వ్యాపించే వ్యాధి కాబట్టి, కేరళ రాష్ట్రం నుండి మన రాష్ట్రాలకు అక్కడి ప్రజలు వస్తుంటారు కాబట్టి ఈ జాగ్రత్తలు  తీసుకోవాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

నిఫా వైరస్ ఎలా వ్యాపిస్తుంది..!

నిఫా వైరస్ గబ్బిలాల నుండి మరియు పందుల నుండి ప్రధానంగా వ్యాపిస్తుంది. చెట్లపై, కాలువల దగ్గర, బావుల దగ్గర, మురికి కుంటల వద్ద గబ్బిలాలు, పందులు తిరుగుతూ ఉంటాయి. గబ్బిలాలు చెట్లపై ఉండే చిన్న చిన్న పండ్లను తినివదిలేస్తు ఉంటాయి. వాటిని తినడం వలన, గబ్బిలాల లాలాజలం మీదపడినా, మూత్రం పడినా వైరస్ సోకే అవకాశం ఉంది. ఇలా గబ్బిలాలు వదిలివేసిన పండ్లను పందులు తినడం ద్వారా వాటి నుండి మనుషులకు వైరస్ త్వరగా వ్యాపించే అవకాశం ఉంది. ఈ వైరస్ సోకిన ఒక వ్యక్తికి సోకగా నర్సు వైద్యం చేస్తుంటే ఆమె కూడా ఈ వ్యాధి బారిన పడి చనిపోయారట.

నిఫా వైరస్ లక్షణాలు ఎలా ఉంటాయి..?

నిఫా వైరస్ లక్షణాలు మనిషి ఆరోగ్యాన్ని క్షీణింపజేస్తాయి. ముందుగా మెదడుపై ప్రభావం చూపుతుంది. మెదడువాపు కన్నా కాస్త తీవ్రత అధికంగానే ఉంటుందని చెబుతున్నారు నిపుణులు. ఆ తర్వాత ఊపిరితిత్తులు, మూత్ర వ్యవస్థ, గుండెలపై ఎక్కువగా ప్రభావం ఉంటుంది. జ్వరం వచ్చినట్లు ఉండటం, శరీరం అలసట, తలనొప్పి, దగ్గు, ఒకచోట కూర్చోకుండా చేయడం, డయేరియా, అధిక ఒత్తిడి ఈ వైరస్ లక్షణాలు.

ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి..?

మీ చుట్టూ గబ్బిలాలు, పందులు సంచారం లేకుండా చూసుకోవాలి. బయటకు వెళ్ళేటప్పుడు ముఖానికి మాస్క్ లు ధరించడం, చేతులకు గ్లౌజులు వేసుకోవడం చేయాలి. ఒకరికొకరు షేక్ హ్యాండ్ ఇచ్చుకోవడం వలన కూడా వైరస్ వ్యాపిస్తుంది కాబట్టి చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. నీటిని శుభ్రంగా ఉంచుకోవాలి. స్టోర్ చేసుకున్న నీటిని, బాక్టీరియా ఉన్నటువంటి నీటిని బయటకు పడేయాలి. గబ్బిలాలు తిన్న పండ్లను, కింద పడిన పండ్లను అస్సలు తీసుకోరాదు. అలాగే మీరు తినే పండ్లను శుభ్రంగా నీటితో కడిగి తినాలి.

చిన్నపిల్లల్లో, ముసలివాళ్ళల్లో రోగ నిరోధకశక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి వెంటనే వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా ఈ వైరస్ త్వరగా వ్యాపిస్తుంది కాబట్టి వయస్సు సంబంధం లేదని అంటున్నారు. అందుకని అందరూ జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలను అందరికీ షేర్ చేయండి.   

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon