Link copied!
Sign in / Sign up
49
Shares

నిద్ర వలన కలిగే 10 ఆరోగ్య ప్రయోజనాలు

image source: New Health Advisor

నిద్ర..మనుషులకు, జంతువులకు, పక్షులకు దేవుడు ఇచ్చిన అందమైన వరం. ఆకలి రుచిఎరుగదు నిద్ర సుఖమెరుగదు అని మన పెద్దలు ఎప్పుడో చెప్పారు కదా, ఆకలి గురించి కాసేపు పక్కనపెడితే నిద్రించడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం అద్భుతం అనే చెప్పాలి. ఒకటి కాదు రెండు కాదు ఒక్కసారి ప్రశాంతంగా నిద్రించడం వలన మన శరీరానికి కలిగే ఆరోగ్య ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే శరీరానికి సరైన విశ్రాంతి ఏమిటంటే ప్రశాంతంగా నిద్రించడమే అని అంటారు. మీలో ఎంతమంది ఎన్ని గంటలు ప్రశాంతంగా నిద్రిస్తున్నారో కానీ నిద్ర వలన కలిగే ఈ ప్రయోజనాలు తెలుసుకుంటే మాత్రం నిజంగానే ఆశ్చర్యం కలుగుతుంది.. నిద్ర వలన కలిగే ఆ ఉపయోగాలేంటో ఒక్కసారి మీరే చూడండి.

1.మెదడు షార్ప్ గా పనిచేస్తుంది 

2.ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది 

3.ఒత్తిడి దూరం అవుతుంది 

4.క్యాన్సర్ సమస్యలు ఉండవు 

5.రోగ నిరోధకశక్తి పెరుగుతుంది 

6.గుండె పనితీరు 

7.బరువు 

8.యవ్వనంగా కనిపిస్తారు 

9.డిప్రెషన్ సమస్య 

10.మగ, ఆడ ఇద్దరిలో కలిగే మార్పులు 

ప్రతిరోజూ ప్రశాంతంగా నిద్రించడం వలన కలిగే టాప్ 10 ఆరోగ్య ప్రయోజనాలు ఇవి. అయితే రోజూ మీ శరీరానికి ఎన్ని గంటల నిద్ర అవసరం, ఎటువైపు తిరిగి నిద్రించాలి, ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు ఎలా నిద్రించాలి, ఎన్ని గంటల నిద్ర అవసరం, చిన్న పిల్లలు సరిగ్గా నిద్రించడం లేదా..! అందుకుగల కారణాలు మరియు పరిష్కారాలను ఇక్కడ మీకోసం అందిస్తున్నాం.. 

1.మెదడు షార్ప్ గా పనిచేస్తుంది 

ఏదైనా నిర్ణయం తీసుకునేముందు ఒకటికి రెండుసార్లు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని చెబుతుంటారు. ఎందుకంటే టెన్షన్ గా ఉన్నప్పుడు లేదా కోపంగా ఉన్నప్పుడు తీసుకునే నిర్ణయాలు కొత్త సమస్యలకు దారితీస్తాయి కాబట్టి. మనం తీసుకునే నిర్ణయాలన్నీ మన మెదడు పనితీరుపై ఆధారపడి ఉంటాయి. అందుకే ప్రశాంతంగా నిద్రపోవడం వలన మెదడు షార్ప్ గా పనిచేస్తుంది. కొందరిలో మతిమరుపు సమస్య కూడా ఎక్కువగా ఉంటుంది. అలాంటివాళ్ళు మంచి నిద్రను పొందటం వలన ఈ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు. అయితే చాలామంది ఎంత మంచి ఆహారం తీసుకున్నా కూడా నిద్ర సరిగ్గా పట్టడం లేదని అంటున్నారు. నిద్ర సరిగ్గా రాలేదని బాధపడేవారు ఒక్కసారి ఇది క్లిక్ చేసి చదవండి. ప్రశాంతంగా నిద్రించడానికి సహాయపడే 5 ఆహారాలు

2.ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది

ఈ ఉరుకుపరుగుల జీవితంలో ఉదయం నిద్ర లేచిన దగ్గరి నుండి రాత్రి నిద్రించేవరకు ఎన్నెన్నో ఆలోచనలు. అది చేయాలి, ఇది చేయాలి అంటూ ప్రతి ఒక్క విషయాన్ని ప్రతిసారీ ఆలోచిస్తూనే ఉంటారు. దీని కారణంగా సరైన సంతోషం మరియు ఆనందాన్ని పొందలేరు. అయితే ప్రతిరోజూ మీరు క్రమం తప్పకుండా మీ శరీరానికి విశ్రాంతిని ఇస్తూ నిద్రించడం వలన ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండగలరు. పసిపిల్లలు అయితే రోజుకి 16 గంటలు నిద్ర అవసరం. ఇది నెలలు గడిచే కొద్దీ కాస్త తగ్గుతూ ఉంటుంది. సాధారణంగా మనిషికి 7-8 గంటల నిద్ర ఖచ్చితంగా అవసరం. 

3.ఒత్తిడి దూరం అవుతుంది

మీకో విషయం తెలుసా.! పని ఒత్తిడి కారణంగా, ఆర్ధిక ఇబ్బందుల ఒత్తిడి కారణంగా, ఆఫీస్ టెన్షన్స్ కారణంగా కొన్ని లక్షల మంది ప్రతి రోజూ మానసికంగా ఆందోళనచెందుతూ ఆరోగ్యం మీదకు తెచ్చుకుంటున్నారు. ఇందుకు కారణం ఏంటంటే వారి డైలీ జీవితంలో ఎక్కువ శాతం వాటి గురించి ఆలోచిస్తూ భయపడుతున్నారు, సరైన నిద్రను విశ్రాంతిని పొందలేకపోతున్నారు. నిజానికి ఈ ఒత్తిడి వీరిలోను మాత్రమే కాదు, గర్భంతో ఉన్న మహిళలలో సైతం ఎక్కువగా ఉందని చెబుతున్నారు. అందుకని ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు ప్రశాంతంగా నిద్రించడం ఎలాగో దీనిపై క్లిక్ చేసి తెలుసుకోగలరు..

4.క్యాన్సర్ సమస్యలు ఉండవు

ఆరోగ్య పరిశోధకులు చేసిన పరిశోధనల ప్రకారం శరీరానికి సరైన విశ్రాంతిని అందిస్తూ నిద్రించే వారిని, రోజులో సరిగ్గా నిద్రకు కేటాయించని వారిపై పరిశోధనలు చేయగా నిద్రించే వారికన్నా నిద్రించని వారిలోనే శరీరానికి హానికరం అయ్యే క్యాన్సర్ సోకుతుందని, ఇది ప్రాణాలకే ప్రమాదం అని తెలిపారు. నిద్ర తక్కువ కావడం వలనే అసలైన కారణంగా చెప్పారు. సో, నిద్రను మాత్రం నిర్లక్ష్యం చేయకండి..

5.రోగ నిరోధకశక్తి పెరుగుతుంది

కొందరి శరీరం చాలా సున్నితంగా ఉంటుంది. వర్షంలో తడవకపోయినా జలుబు రావడం, పౌష్టికరమైన ఆహారాన్ని తీసుకుంటున్నా సరే అనారోగ్యాల బారిన పడటం.. ఇలా కొందరిలో కనిపిస్తూ ఉంటాయి. ఇందుకు కారణం శరీర రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండటమే అసలు కారణం. రోగ నిరోధకశక్తి పెరగడానికి మంచి నీరు, మంచి ఫుడ్ ఎంత ముఖ్యమో మంచి నిద్ర కూడా అంతే అవసరం. అలాగే చాలామందికి అనుమానాలో ఎటువైపు పడుకుని నిద్రించడం ఆరోగ్యానికి మంచిదని అడుగుతున్నారు. మీరు నిద్రించేటప్పుడు ఎటు పక్కగా పడుకుని నిద్రిస్తే మంచిదో ఇక్కడ క్లిక్ చేసి తెలుసుకోగలరు..

6.గుండె పనితీరు

ఒకప్పుడు వందేళ్లు వచ్చినా వారి ఆరోగ్యం, వారి గుండె పనితీరు బాగా పనిచేసేది. కానీ ఇప్పుడు మాత్రం యువతీ యువకుల్లోనూ, ఆరోగ్యం బాగా ఉన్నవారు సైతం గుండె సంబంధిత సమస్యలు, హార్ట్ ఎటాక్ కు గురి కావడం వంటివి చూస్తూనే ఉన్నాం. దీనికి కారణం టెన్షన్ తో కూడుకున్న జీవితం మరియు సరైన విశ్రాంతి, మంచి నిద్రలేకపోవడం. అందుకే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కనీసం 8 గంటలు అయినా నిద్రించాలి. లేకపోతే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. 

7.యవ్వనంగా కనిపిస్తారు

కొందరు వయస్సు పెరుగుతున్నా సరే చాలా అందంగా, ముఖవర్చ్చస్సు కళకళలాడుతూ ఉంటుంది. ఎలా అంటే ఎప్పుడు ఎంత టెన్షన్ ఉన్నా సరే ఒత్తిడి, ఆందోళన చెందకుండా ఉండటం, చిరునవ్వుతో సమస్యకు పరిష్కారం వెతుక్కోవడం, ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారం తీసుకుంటూ సుఖ నిద్రను పొందటం. ఇలా చేయడం వలన ఎంతో యవ్వనంగా కనిపిస్తారు. మీరు కూడా ఇలా కనిపించాలంటే మీకు కూడా మంచి నిద్ర అవసరం. అయితే మీకు మధ్యాహ్నం నిద్రించే అలవాటు ఉందా..! మధ్యాహ్నం నిద్రపోవడం వలన రాత్రి నిద్ర రావడం లేదని అంటుంటారు చాలామంది. అయిత్ ఇందుకు పరిష్కారం తెలుసుకోవాలంటే ఇది చదవండి. మధ్యాహ్నం నిద్ర ఆరోగ్యానికి మంచిదేనా..! అసలు ఏం జరుగుతుందో చూడండి..

8.బరువు

మీరు బాగా గమనించారో లేదో, సరైన నిద్ర లేకపోయినా..ఎక్కువగా విశ్రాంతి తీసుకున్నా సరే వెంటనే శరీర బరువులో మార్పు కనిపిస్తూ ఉంటుంది. అంటే ఉన్నట్లుండి బరువు పెరగడం లేదా బరువు తగ్గడం జరుగుతుంది. మీరు ప్రతిరోజూ నిద్రించవలసిన సమయం కన్నా తక్కువ నిద్రించినప్పుడు జీర్ణ సంబంధిత సమస్యలు, ఆకలిగా లేకపోవడం జరుగుతుంది. అదే ఎక్కువగా నిద్రిస్తే ఇంకా పడుకోవాలి, విశ్రాంతి తీసుకోవాలనిపిస్తుంది. హార్మోన్ల అసమతుల్యత కారణంగా బరువు పెరగడం, తగ్గడం జరుగుతుంది. అయితే ఎప్పుడు ఒకే విధమైన బరువు మైంటైన్ చేయాలంటే మాత్రం రోజుకి కనీసం నిద్రించాల్సిన గంటలు విశ్రాంతి తీసుకోవాలి. లేకపోతే పొట్ట పరిమాణంలో మార్పులు కనిపిస్తాయి. 

9.డిప్రెషన్ సమస్య

నిద్ర మనుషులతో పాటు పక్షులు, జంతువులు మరియు సరీసృపాలకు చాలా ముఖ్యం అని ఇదివరకే చెప్పుకున్నాం. అయితే మిగతా వాటితో పోల్చితే మానవ శరీరానికి నిద్ర తగినంత అవసరమని, సరైన నిద్ర లేకపోవడం మానసికంగా ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. నిద్ర రావడం లేదని కొందరు మందులు, ఇంజెక్షన్స్..ఇంకా ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదైనా విషయంలో విఫలం అయినప్పుడు ఎక్కువగా డిప్రెషన్ అవుతూ ఉంటారు. మనం కష్టంగా ఇష్టంగా చేసినపని సక్సెస్ కాకపోతే ఎంత బాధపడతామో మంచి నిద్రలేకపోయినా సరే డిప్రెషన్ సమస్య ఎదుర్కోవాల్సి వస్తుంటుంది. ఈ సమస్య లేకుండా ఉండాలంటే మంచి నిద్ర అవసరం. సుఖ నిద్ర డిప్రెషన్ ను దూరం చేస్తుంది. 

10.మగ, ఆడ ఇద్దరిలో కలిగే మార్పులు 

ఈ విషయాలు చాలామంది నమ్మరు గానీ మగ, ఆడ ఇద్దరిలో ఆ కోరికల వృద్ధి పెరగడానికి, ఇష్టం కలగడానికి తప్పనిసరిగా 8 గంటల నిద్ర అవసరం. నిద్ర బాగా ఉన్నప్పుడు అక్కడ ఒకరినొకరు బాగా ఇష్టపడగలరు, ఎక్కువ సమయం గడగలరు. పడకగదిలో బాగా ఎక్కువ సమయం దంపతులు గడపాలంటే మంచి నిద్ర తప్పనిసరి అంటున్నారు. అలాగే చిన్నపిల్లలు బాగా నిద్రించగలరు. కానీ కొందరు పిల్లలు మాత్రం నిద్రకు చాలా ఇబ్బందిపడుతూ ఉంటారు. ఇలా మీ పిల్లలలో కూడా జరుగుతూ ఉంటే ఈ విషయాలు తెలుసుకోండి. మీ పిల్లలు సరిగ్గా నిద్రించడం లేదా..! కారణాలు మరియు పరిష్కారాలు ఇవే.. 

సో, ఇవండీ నిద్ర వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు. ఈ విషయాలు మీకు నచ్చితే వెంటనే అందరికీ షేర్ చేయండి మరియు ఇంకా ఏమైనా తెలుసుకోవాలనుకుంటే కామెంట్ చేయండి..

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon