Link copied!
Sign in / Sign up
2
Shares

నెలసరి సమయంలో మహిళలు తప్పక చేయాల్సిన 5 పనులు

నెలసరి ప్రతి నెల మహిళలను వేధించే సమస్య.. ఇది వారికి మంచేనా, చెడా? అని పక్కనపెడితే ప్రతి నెల రుతుక్రమం కారణంగా ఎన్నో ఇబ్బందులను ఎదుర్కుంటారు. దాదాపు 3 నుండి 5 రోజుల పాటు ప్రత్యక్ష నరకమే అని చెప్పాలి. ఈ ఒక్క విషయం చాలు, మహిళలను గౌరవించడానికి అని అంటారు. ఐతే ఈ నెలసరి సమయంలో మహిళలు తమకు తెలిసి కూడా కొన్ని తప్పులు చేస్తున్నారు. ఆ తప్పులేంటో తెలుసుకుని, ఇక ఎప్పుడు జరగకుండా జాగ్రత్త పడండి..

ఆహారం

అవును, నిజమే.. ఈ సమయంలో ఇంట్లో దూరంగా ఉండటం, ఏదో నేరం తప్పు చేసిన వారిలా ఒక పక్కన కూర్చోవడం చాలా బాధాకరమే. అలాగే ఈ  సమయంలో ఎందుకో గానీ చాలామంది ఆహారానికి దూరంగా, ఇష్టంలేనట్లుగా ఉంటారు. ఇది చాలా తప్పు, ఈ సమయంలో సరైన డైట్ ప్రకారం సరైన సమయానికి తప్పకుండా ఆహారం తీసుకోవాలి. ఆహారం తీసుకోవడానికి దూరంగా ఉంటున్నవారు ఇకపై ఇలా చేయకండి.

ఈ డేట్స్ గుర్తుపెట్టుకోండి

మహిళలు చేస్తున్న అతి సాధారణమైన తప్పులలో ఇది ఒకటి. కొందరిలో నెలసరి సరిగ్గా నెలకు జరగకపోవచ్చు, మరికొందరిలో ముందే జరగవచ్చు. కాబట్టి, ఋతుక్రమం జరిగిన డేట్ ను రాసిపెట్టుకోవడం వలన ఎక్కడికైనా వెళ్లాలనుకున్నప్పుడు ముందే జాగ్రత్త పడవచ్చు, నెలసరి ప్రకారం మీ ప్లాన్ వేసుకోవచ్చు.

రంగు

ఇది వరకే మనం టైనీ స్టెప్ తెలుగులో దీని గురించి చెప్పుకున్నాం. నెలసరి  సమయంలో వచ్చే రంగును బట్టి మీ ఆరోగ్యం గురించి తెలుసుకోవచ్చని. ఎరుపు, లేత ఎరుపు, పింక్..ఇలా ఋతుక్రమం  అప్పుడు రక్తంలో మార్పులు జరుగుతూ ఉంటాయి. ఐతే ఎప్పటిలా కాకుండా ఏదైనా అనుమానంగా ఉంటే వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. ఇది మాములే కదా అని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.

ఒక్కటవ్వడం

పీరియడ్స్ సమయంలో దంపతులు ఒక్కటి కావచ్చా లేదా అనే అపోహ ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఆరోగ్య నిపుణులు చెప్పిన ప్రకారం పీరియడ్స్ సమయంలో ఇలా కలవడం తప్పేమీ కాదని అంటున్నారు. ఐతే సేఫ్టీ ఈ సమయంలో చాలా ముఖ్యం. ఎందుకంటే మహిళ శరీరం నుండి ఈ టైంలో ఎక్కువ ఇన్ఫెక్షన్స్ చేరి ఇద్దరికీ అనారోగ్యాన్ని కలిగించే అవకాశం ఉంది కాబట్టి..

ఈ రెండు అస్సలు చేయకూడదు

నెలసరి సమయంలో దాదాపు మహిళలందరూ ఎక్కువగా రెస్ట్ తీసుకోవడానికే ఇష్టపడుతుంటారు. ఎందుకంటే ఈ సమయంలో వారికి చాలా ఇబ్బందిగా, నీరసంగా ఉంటుంది. ఏం చేయాలనీపించదు. మనస్సుకు కష్టంగా ఉండటం వలన. ఐతే ఈ టైంలో ఎక్కువ రెస్ట్ తీసుకోవడం వలన తిమ్మిర్లు వస్తాయని, అప్పుడప్పుడు శరీరాన్ని కాస్త కదల్చడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

దయచేసి ఈ ముఖ్యమైన సమాచారాన్ని ప్రతి ఒక్కరికీ తెలిసేలా SHARE చేయగలరు.. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon