నెలసరి సమయంలో మహిళలు ఈ తప్పులు చేయకూడదు : ఇలా చేస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది..
నెలసరి ప్రతి నెల మహిళలను ఇబ్బంది పెడుతూ, వేధించే సమస్య అనే చెప్పవచ్చు. స్త్రీ జన్మలో మహిళలు ప్రతి నెల ఎదుర్కుంటున్న ఈ ఒక్క పరిస్థితికే వారికి చేతులెత్తి దండం పెట్టవచ్చు. అయితే నెలసరి సమయం కరెక్ట్ టైంకు వస్తే సమస్య లేదు గానీ కొన్నిసార్లు చాలా ఆలస్యమవుతూ ఉంటుంది. ఒకటి రెండు సార్లు ఇలా జరిగితే ఫర్లేదు గానీ ఎప్పుడు ఇలాగే ఉంటే తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి. అయితే మహిళలు వాళ్లకు తెలిసో తెలియకో నెలసరి సమయంలో ఈ తప్పులు చేస్తున్నారు. వీటివలన ఆరోగ్యానికే చాలా ప్రమాదం అని హెచ్చరిస్తున్నారు నిపుణులు. అవేంటో మీరే చూడండి.
ఆహారం

నెలసరి అనేది ప్రతి నెల వచ్చేదే కాబట్టి, ఈ సమయంలో కడుపులో ఇబ్బందికరంగా ఉండటం, మహిళల ప్రైవేట్ ప్రాంతంలో మంటగా ఉండటం, ఏమీ చేయాలనిపించడం, కొందరికి అయితే కూర్చోనివ్వదు మరియు పడుకోనివ్వకుండా చేస్తుంటాయి. ఇటువంటప్పుడు ఏ ఆహారం తీసుకోవాలనిపించదు. కానీ అది చాలా తప్పు. మూడు పూటలా ఈ సమయంలో మంచి డైట్ పాటిస్తూ ఆహారాన్ని తీసుకోవాలి. లేకపోతే ఆ తర్వాత జరిగే పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
ఈ తప్పు చేయకండి

సాధారణంగా ఇది ఎవరూ చేయకపోవచ్చు గానీ కొంతవరకు ఇది ఇబ్బందే అని అంటున్నారు ఆరోగ్య నిపుణులు. పీరియడ్స్ సమయంలో భర్తతో కలవడంఓకే గానీ, ఎటువంటి సేఫ్టీ లేకుండా చేయడం వలన బాక్టీరియా మరియు మీ భాగస్వామికి ఉన్న సుఖ వ్యాధులు మీరు ఎదుర్కోవాల్సి వస్తుందని చెబుతున్నారు. అందుకని సేఫ్టీ ఉపయోగించడం మర్చిపోకూడదు.
రక్తం రంగు చూసుకోవాలి

మనం ఇదివరకే చెప్పుకున్నాం కదా, రుతుక్రమం సమయంలో వచ్చే రంగును బట్టి మీ ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చని. సాధారణంగా వచ్చే రక్తం రంగు వలన ఎటువంటి ఇబ్బంది ఉండదు గానీ, పింక్, ముదురు రంగు, ఇంకా వేరువేరుగా నెలసరి అప్పుడు ఉంటే మాత్రం వెంటనే డాక్టర్ ను సంప్రదించడం చేయాలి.
అక్కడ తిమ్మిర్లు

నెలసరి సమయంలో ఆ భాగంపై ప్రభావం కారణంగా ఏ పని చేయాలనిపించదు కాబట్టి, ఒకేచోట కూర్చోవడం లేదా పడుకోవడం చేస్తుంటారు. కానీ ఎప్పుడు ఇలాగే ఉండకూడదు. కాస్త సమయం రెస్ట్ తీసుకుని మిగతా సమయం అటుఇటు తిరగటం చేస్తుండాలి. లేకపోతే తిమ్మర్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.
ప్యాడ్స్

నెలసరి ఎప్ప్పుడు జరుగుతుందనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి జాబ్ చేసేవాళ్ళు అదే పనిగా ఇంట్లో కూర్చోలేరు. ఉద్యోగం కారణంగా ఆఫీస్ వెళ్లడం, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు ప్యాడ్స్ మార్చుకోవడం చేయాలి. వాసన సంగతి పక్కనపెడితే ఒకే ప్యాడ్స్ ధరించడం వలన బాక్టీరియా ఎక్కువగా చేరటం జరుగుతుంది.
ఈ విషయాలు ప్రతి మహిళకు తెలిసేలా షేర్ చేయగలరు..
..............................
మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..
Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.
ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.
Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి
