Link copied!
Sign in / Sign up
32
Shares

నెలసరి (ఋతుక్రమం) సక్రమంగా జరగాలంటే ఈ 3 ఆహారాలు తీసుకోవాలి

పీరియడ్స్..ప్రతి నెల మహిళలను బాధించే, ఇబ్బందిపెట్టే సమస్య. దీని కారణంగా ఆ రెండు రోజులు ఏం చేస్తున్నారో,  వారి చుట్టూ  ఏం జరుగుతుందో మహిళలకు ఒకరైన నరకంగా ఫీలవుతూ ఉంటారు. ఐతే కొందరిలో అనుకున్న సమయానికి కంటే పీరియడ్స్ త్వరగా రావడం, సమయం మించిపోతున్నా కూడా పీరియడ్స్ రాకపోవడం బాధాకరమైన విషయం. ఇక్కడ చెప్పుకునే ఈ ఆహారాలు తీసుకోవడం వలన నెలసరి సక్రమంగా సరైన సమయానికి జరుగుతుంది.  ప్రతి మహిళకు చేరేలా SHARE చేయండి.

పండని బొప్పాయి

మన ఆయుర్వేద నిపుణులు చెబుతున్న సూచనల ప్రకారం పండని బొప్పాయి లేదా గ్రీన్ బొప్పాయిని జ్యూస్ గా చేసుకుని కొన్ని నెలల పాటు సేవించడం వలన గర్భాశయంలోని కండరాలపై ప్రభావం చూపించి పీరియడ్స్ సక్రమంగా జరిగేలా చేస్తుంది. అయితే పీరియడ్స్ సమయంలో మాత్రం ఇది తీసుకోకూడదు.

పసుపు

పసుపులో అధిక శాతం యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండటం వలన హార్మోన్ల అసమతుల్యత లేకుండా నియంత్రించి రుతుక్రమం సరిగ్గా జరిగేలా చేస్తుంది. రుతుక్రమం సరిగ్గా జరగడం లేదని ఇబ్బందిపడే వారు మరియు నెలసరి సరిగ్గా జరగడానికి ఒక గ్లాస్ పాలలో ఒక స్పూన్ పసుపు, తేనె లేదా బెల్లం కలుపుకుని ప్రతి రోజూ కొన్ని వారాలపాటు సేవించడం మంచిది.

అలోవెరా

పీరియడ్స్ సమయంలో ఇది అస్సలు తీసుకోకూడదు. పీరియడ్స్ సక్రమంగా జరగాలంటే తాజా అలోవెరా ఆకు నుండి ఒక స్పూన్ అలోవెరా జెల్ తీసుకుని అందులో ఒక స్పూన్ తేనె కలిపి ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు ముందు తీసుకోవడం వలన పీరియడ్స్ రెగ్యులర్ జరుగుతాయి.

అల్లం

ఒక అల్లం ముక్కను టేబుల్ స్పూన్ అంత మోతాదులో తీసుకుని బాగా ఉడికించాలి. ఆ నీటిని వడగట్టుకుని అందులో ఒక స్పూన్ చక్కర కలుపుకుని రోజులో మూడు సార్లు మీరు ఆహారం తీసుకున్న తర్వాత సేవించడం రుతుక్రమం సరిగ్గా సరైన సమాయానికి జరుగుతుంది.

జీలకర్ర

నెలసరితో ఇబ్బందిపడే వారే కాకుండా మాములుగా అయినా సరే జీలకర్రను తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది. రెండు స్పూన్ల జీలకర్ర ఒక గ్లాస్ నీటిలో రాత్రి ఉంచి ఉదయాన్నే నోరు శుభ్రం చేసుకున్న తర్వాత జీలకర్రతో పాటు ఈ నీటిని సేవించడం వలన నెలసరి సక్రమంగా జరుగుతుంది.

మహిళలు ఇబ్బందిపడే సమస్య పీరియడ్స్ కాబట్టి అందరికీచేరేలా SHARE చేయండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon