Link copied!
Sign in / Sign up
3
Shares

పీరియడ్స్ నొప్పులు వెంటనే తగ్గించుకోవడానికి చిట్కాలు

ఆడవాళ్ళు ప్రతి నెల ఎదురుకోవాల్సిన ఒక విషయం పీరియడ్స్. పీరియడ్స్ సమయంలో మిమ్మల్ని అత్యంత బాధపెట్టే విషయం పొత్తి కడుపు భాగంలో వచ్చే తిమ్మిరి నొప్పి. వీటి వలన చాలా బాధపడతారు. పీరియడ్స్ నుండి తప్పించుకోవడం ఎలానో తప్పదు. కానీ పీరియడ్స్ వలన కలిగే నొప్పిని తగ్గించుకోవచ్చు. అందుకు మీరు చేయాల్సినది ఏంటో ఇక్కడ తెలుసుకోండి…

1. వ్యాయామం

పీరియడ్స్ సమయంలో నడవడానికే కష్టంగా ఉంటుంది, అలాంటిది వ్యాయామం అంటే కొంచెం కష్టమే అనుకుంటున్నారా. చిన్నగా నడవడం, లాంటి వ్యాయామం పీరియడ్స్ సమయంలో చేయడం వలన శరిరంలో రక్త ప్రసరణ వేగవంతం అవుతుంది. అలానే వ్యాయామం వలన మెదడులో ఎండోర్ఫిన్స్ విడుదలవుతాయి. ఇవి మీ పీరియడ్స్ నొప్పిని తగ్గిచ్చి, రిలీఫ్ ను ఇస్తాయి.

2. వేడి

పొత్తి కడుపు మీద వెచ్చని బట్టతో నిధానంగా మర్దన చేసుకోవడం వలన పీరియడ్స్ నొప్పి తగ్గుతుంది. వేడి వలన ముడుచుకుపోతున్న  కండరాలు రిలాక్స్ అయ్యి నొప్పి, తిమ్మిరి తగ్గుతుంది. తడి బట్ట బదులు థెర్మో పాడ్స్ కూడా వాడచ్చు.

3. డైరీ ప్రొడక్ట్స్

పీరియడ్స్ సమయంలో పాలు, పెరుగు, లాంటి డైరీ ప్రొడక్ట్స్ కు దూరంగా ఉండండి. అవి పీరియడ్స్ వలన కలిగే నొప్పిని ఇంకా పెంచుతాయి.

4. జ్యూస్స్

క్యారోట్, బీట్ రూట్ లాంటి జ్యూస్స్ పీరియడ్స్ సమయంలో తీసుకోవడం వలన నొప్పి తగ్గుతుంది.

5. స్ట్రేట్చింగ్

మెల్లగా కాళ్ళను స్ట్రెచ్ చేస్తూ ఉండండి. మీ పొత్తి కడుపుల దగ్గర కండరాలు రిలాక్స్ అయ్యి నొప్పి తగ్గుతుంది.

6. అల్లం

అల్లానికి చాలా ఆయుర్వేద గుణాలు ఉంటాయి. పీరియడ్స్ సమయంలో నొప్పిని తగ్గించుకోడానికి అల్లాన్ని ఇలా వాడండి. అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, నీటిలో వేసి వేడి చేయండి. ఆ నీటిని వడ కట్టి, చల్లారాక కొంచెం కొంచెం గా రోజు మొత్తం తీసుకుంటూ ఉండండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon