Link copied!
Sign in / Sign up
1
Shares

నెలలు తక్కువు పిల్లల గురించి మీరు తెలుసుకోవాల్సిన పూర్తి వివరాలు

నెలలు తక్కువ శిశువుకు జన్మనివ్వడం అనేక ప్రశ్నలకు దారితీస్తుంది. శిశువు యొక్క ఆరోగ్యం గురించి ఆందోళన, భయం అన్ని కలగలిసి తల్లి మనస్సుని ప్రశాంతంగా ఉండనివ్వవు. కానీ, అకాల శిశువు జననం సాధారణమే. కంగారు పడాల్సిన అవసరం లేదు, పెరిగిన వైద్య సదుపాయల వలన వారు బ్రతికి ఎటువంటి సమస్య లేకుండా జీవించే అవకాశాలు కూడా ఈ రోజుల్లో అధికమయ్యాయి.

శిశువు 37 వారాల సమయం కంటే ముందు జన్మించినప్పుడు అకాల జననంలా పరిగణిస్తారు. 22 వ వారం లేదా ఆ దరిదాపుల్లో పుట్టిన శిశువు జీవించి ఉండడం కష్టం. 28-31 వారాల వయస్సులో జన్మించిన శిశువు దీర్ఘ కాలిక రుగ్మతలు లేదా అనారోగ్యం కలిగి ఉంటుందని, అందువలన వారికి మొదట్లోనే సరైన చికత్స అందేలా చేయాలి.

మీరు మరియు మీ శిశువు ఆరోగ్యంగా ఉండటానికి, ఈ విషయాలు మనస్సులో ఉంచుకోండి.

1. నెలలు తక్కువుగా జన్మించిన బిడ్డను వెంటనే డాక్టర్స్ ఇంక్యూబేషన్లోకి తీసుకొని వెళ్తారు. దానిని చూసి బయపడకండి, అది మీ బిడ్డ మంచి కోసమే.

2. వైద్యులు అనుమతించే వరకు మీరు మీ శిశువును తాకడం లేదా ఆహారం ఇవ్వడం చేయకండి. . మీ శిశువు సురక్షితంగా మీకు డాక్టర్స్ అప్పగించే వరకు కొంచెం ఓపిక పట్టండి.

3. మీ శిశువు తల, శరీరం కంటే పెద్దదిగా ఉండవచ్చు. ఇది సాధారణమైన విషయమే. కొన్ని వారాల్లోనే తను సరైన స్థితికి వచ్చేస్తాడు.

4. బిడ్డ పరిస్థితిని చూసి దిగులు చెంది మీ ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం చేయకండి. అవసరమైతే మనోరోగ వైద్యుడిని సంప్రదించి మీ బాధను కొంత తగ్గించుకోవడానికి ప్రయత్నించండి.

5. మీ బిడ్డ కంటే తొందరగా మీరు ఆసుపత్రి నుండి డిచ్ఛార్జ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. కానీ, కంగారు పడకండి, మీరు ఎప్పుడు కావాలన్నా హాస్పిటల్ వెళ్లి మీ చిన్నారిని చూసుకోవచ్చు. మీ శిశువు సురక్షితంగా ఉందని మాత్రం గుర్తించండి.

6. మీ డాక్టర్ మీ బిడ్డకు రొమ్ము పాలు లేదా బాటిల్ పాలు ఇవ్వకూడదు అని సలహా ఇవ్వచ్చు. అప్పుడు కంగారు పడకుండా డాక్టర్ సలహా మేరకు నడుచుకోండి.

7. మీ బిడ్డ ముక్కులో మరియు నోట్లో పైపులు పెట్టి ఉండచ్చు. అది చూసి ఆందోళన చెందకండి. ఇదంతా కేవలం మీ బిడ్డను సురక్షితంగా మీ చేతుల్లో పెట్టడానికే అని అనుకోండి.

8. మీ బిడ్డను తాకడానికి మీకు అనుమతి ఉండకపోవచ్చు. ఎందుకంటే సున్నితమైన చర్మానికి ఇన్ఫెక్షన్ అవుతుందేమో అన్న భయంతో డాక్టర్స్ అలా చెప్తారు. కానీ, కొన్ని రోజుల్లోనే మీరు చిన్నారిని చేతుల్లోకి తీసుకునే రోజు వస్తుంది. ఇన్ని రోజులు ఎదురు చూసారు ఇంకా కొన్ని రోజులు ఎదురు చూడండి.

9. మీ శిశువు ఇంకా పూర్తిగా అభివృద్ధి చెందలేదు, అంటే వారి చర్మం పారదర్శకంగా ఉంది రక్త నాలాలు కూడా కనిపించవచ్చు. కొన్ని రోజుల్లోనే మాములుగా అయిపోతారు కంగారుపడకండి.

10. అకాలంగా పుట్టిన బిడ్డ లక్షణాలు ఇతర పిల్లల కంటే వ్యత్యాసంగా ఉంటాయి. కొన్ని రోజులు శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా ఉండవచ్చు. వారు ఆస్పత్రిలో వైద్యులు మరియు నర్సుల సంరక్షణలో ఉన్నంత కాలం మీరు చింతించవలసిన అవసరం లేదు అని మాత్రం నమ్మండి. 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon