Link copied!
Sign in / Sign up
0
Shares

నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల మరణానికి కారణమయ్యే సిడ్స్(SIDS) వ్యాధి గురించి తెలుసుకోండి

ఈమధ్య కొందరు శిశువులు పుట్టిన కొద్ది రోజులకే చనిపోతున్నారు. ఇందుకు కారణం – సిడ్స్ అనే ఒక అరుదైన వ్యాధి. సాధారణంగా పిల్లలకు ఇది రాదు. 2000 మందిలో ఒకరికి ఇది వస్తుంది. చాలామంది తలిదండ్రులు ముందు జాగ్రత్తలు తీసుకొంటూ ఎంతో మంచిపని చేస్తున్నారు. వారు తీసుకునే ఆ జాగ్రత్తల వల్ల పసిపిల్లల మరణాలు 50 శాతం తగ్గడం నిజంగా శుభవార్త. బిడ్డ పుట్టిన తర్వాత 1 నుంచి 4 నెలల లోపు సిడ్స్ వ్యాధి సోకే అవకాశం ఉంది.

సిడ్స్ గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు

1. తల్లి గర్భంలో ఉండగానే శిశువు మరణించడాన్ని కూడా సిడ్స్ అంటారు.

2. తక్కువ బరువుతో పుట్టినా లేదా బిడ్డ పుట్టడానికి ముందు లేక పుట్టిన తర్వాత తల్లి స్మోకర్ అయినా సిడ్స్ వచ్చే ప్రమాదం ఉంది. అలాగే, బిడ్డ పుట్టిన తర్వాత సరిగా పట్టించుకోకపోవడం, డ్రగ్స్, పొగాకు ఉత్పత్తుల వాడకానికి అలవాటు పడడం, 20 ఏళ్ల లోపే బిడ్డకు జన్మ నివ్వడం వంటివి కూడా సిడ్స్ కు కారణాలుగా చెప్పవచ్చు.

3. బిడ్ల నిద్రకు సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం కూడా ఇందుకు కారణం. ఎక్కువ వేడి నిచ్చే తలగడలు వాడడం కూడా కారణమే.

4. నిద్రపోయేటప్పుడు పిల్లలకు తగినంత గాలి, వెలుతురు తగిలేలా చూడడం, ఫలానా వైపు తిరగి పడుకోవడానికి వీలుగా ఎలాంటి పరికరాలూ వాడకపోవడం, అలాగే వదులుగా ఉండే బెడ్డింగ్స్, తలగడలు, దుప్పట్లు వాడకపోవడం వల్ల సిడ్స్ వచ్చే అవకాశాల్ని తగ్గించవచ్చు.


Click here for the best in baby advice
What do you think?
100%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon