Link copied!
Sign in / Sign up
2
Shares

నెలలు నిండకుండా పిల్లలు పుడితే ఏం జరుగుతుంది..! అలాంటప్పుడు ఏం చేయాలి?

ప్రస్తుత రోజుల్లో ప్రగ్నన్సీ సమయంలో మహిళలు తీసుకునే ఆహారం లేదా మరే ఇతర కారణాలు  అయినా కావచ్చు కానీ పిల్లలు నెలలు నిండకుండానే పుట్టడం జరుగుతోంది. ఈ విధంగా జరగడం వలన కొన్నిసార్లు పిల్లలలో ఇంకా అవయవాలు అభివృద్ధి చెందని దశలోనే బయటకు వస్తారు కాబట్టి ప్రతి తల్లి తండ్రులకు ఆందోళన కలుగుతుంది. అయితే నెలలు నిండకుండా పిల్లలు పుడితే ఏం చేయాలో ఇక్కడ వివరంగా తెలుసుకోండి.

37 వారాలు పూర్తి కాకముందే పుట్టే బిడ్డలని ప్రీమెచ్యూర్ బేబీ అంటారు. బిడ్డ ఇరవై రెండో వారంలోలో పుట్టినట్లయితే ప్రాణాలతో ఉండే అవకాశాలు తక్కువ.  28-31 వారాల మధ్య పుట్టిన పిల్లలకు దీర్ఘకాల లోపాలు లేదా అనారోగ్యంతో ఉండే అవకాశాలు ఉన్నాయి. అలా ఉన్నట్లు అయితే వెంటనే డాక్టర్ ను సంప్రదించండి.

నెలలు నిండకుండా పిల్లలు పుడితే వెంటనే మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..

1 . మీరు ప్రీమెచ్యూర్ బేబీ కి డెలివరీ ఇచ్చినట్లు అయితే డాక్టర్ లు బిడ్డని ఇంక్యుబేటర్ లో పెట్టి బిడ్డ ఆరోగ్యంగా ఉండేలా చూస్తారు వైద్యులు.

2 . మీరు మీ బిడ్డని తాకడం గానీ బిడ్డకి తినిపించడం గానీ డాక్టర్ ఒప్పుకునే దాక చేయకూడదు. డాక్టర్ సలహా మేరకు వాళ్ళు చెప్పిన విధంగా పాటించాలి. ఆ..ఏమీ కాదులే అని నిర్లక్ష్యం చేయకూడదు.

౩. మీ బిడ్డ తల శరీరంలో అన్ని భాగాలు కన్నా కొంచెం పెద్దదిగా అనిపించవచ్చు, అందుకు భయపడాల్సిన అవసరం లేదు కొన్ని వారాల్లో మాములు స్థితిలోకి వస్తుంది.

4 . మీ బిడ్డ మీద ఉన్న దిగులులో మిమల్ని మీరు జాగ్రత్త తీసుకోరు. మీ నొప్పులను పట్టించుకోకుండా ఉండకండి. అవసరమైతే థెరపిస్ట్ ను సంప్రదించండి. మీ మనసులో మీరు ఎన్నో బాధలను మోస్తున్నారు. మీకు అవసరం అనిపిస్తే సైకియాట్రిస్ట్ తో ఒకసారి మాట్లాడండి.

5 . మీ శిశువు కన్నా మీరు ఆస్పత్రి నుండి డిశ్చార్జ్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మీరు ఎప్పుడు కలవాలి అనుకున్న మీ బిడ్డను వెళ్లి కలవవచ్చు. మీ బిడ్డ మంచి వారి చేతుల్లో ఉందని మర్చిపోకండి.

6 . డాక్టర్ అమ్మ పాలు లేదా ప్యాకెట్ పాలుకి వ్యతిరేకంగా సలహాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది మంచిదో డాక్టర్ ని అడిగి ఇవ్వండి.

7 . ట్యూబ్స్ మరియు పైప్స్ లాంటివి మీ బిడ్డకి నోరు మరియు ముక్కు ద్వారా ఫిక్స్ చేసి ఉంటారు. ఇవి చూసి బయపడిపోకండి. ఆ సమయంలో ఇవన్నీ సాధారణమే.

8 . మీ శిశువుతో శారీరక సంబంధం ప్రీమెచ్యూరిటీ పైన ఆధారపడి ఉంటుంది. 32-37 వారాలు అయ్యేవరకు జన్మనిచ్చిన తల్లి శిశువుతో చర్మ సంబంధాన్ని కలిగి ఉంటుంది. మీ శిశువు ని తాకడం లేదా వారి చేతిని పట్టుకోవడం మీకు మరియు మీ శిశువును యొక్క ఉపశమనానికి సహాయపడుతుంది.

9 . మీ శిశువు ఇప్పటికీ పూర్తిగా అభివృద్ధి చెందలేదు, అంటే వారి చర్మం పారదర్శకంగా కనిపిస్తుంది మరియు వారి సిరలు మరియు రక్త నాళాలు కనిపించవచ్చు. కొద్ది రోజుల్లో మీ బిడ్డ కొత్తగా పుట్టిన బిడ్డలా కనిపిస్తుంది.

10 . మీ శిశువు చిన్నగా ఏడుస్తారు. వారి లక్షణాలు సాపేక్షంగా రౌండర్ లక్షణాలతో ఉన్న ఇతర పిల్లలను కన్నా పదునుగా ఉంటాయి. ఊపిరి పీల్చుకోడం కూడా కష్టంగా ఉంటుంది , ఎందుకంటే అభివృద్ధి చెందని  శ్వాస అవయవాలు వలన . వారు ఆస్పత్రిలో ఉన్నారు మరియు వైద్యులు మరియు నర్సుల సంరక్షణలో ఉన్నంత కాలం మీరు చింతించవలసిన అవసరం లేదు.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon