నెలలు తక్కువగా పిల్లలు పుడితే వచ్చే సమస్యలు,వాటి పరిష్కారాలు
మహిళ గర్భం దాల్చడం అనేది గొప్ప వరం. బిడ్డ ఎప్పుడు ఈ ప్రపంచంలోకి వస్తుందా అని ప్రతి దంపతులు ఎదురుచూస్తూ ఉంటారు. అయితే ప్రస్తుత జీవన విధానం కారణంగా చాలామంది పిల్లలు నెలలు నిండకుండానే పుడుతున్నారు. నెలలు నిండకుండానే బిడ్డ జన్మనివ్వడానికి కారణాలు, వాటివల్ల వచ్చే సమస్యలు మరియు పరిష్కారాల గురించి తెలుసుకుందాం.
నెలలు నిండకుండా పుట్టడానికి కారణాలు
ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి సరైన ఆహార నియమాలు పాటించకపోవడం, ఒత్తిడి, భయాందోళనలకు ఎక్కువగా గురి కావడం, డయాబెటిస్ సమస్యలు, ఆల్కహాల్, ధూమపానం అలవాట్లు ఉండటం, ఆలస్యంగా వివాహం చేసుకోవడం, తల్లిలో బిడ్డలో లేదా మాయలో ఏదైనా సమస్య ఉన్నప్పుడు ఈ విధంగా జరగడానికి కారణాలు.
నెలలు నిండకుండా బిడ్డ జన్మిస్తే?
తల్లి గర్భంలో 9 నెలలు ఉండి ఆ తర్వాత ఈ ప్రపంచంలోకి అడుగుపెడితే బిడ్డకు ఆరోగ్యకరం మరియు ఎదుగుదల బాగా జరుగుతుంది కూడా. సాధారణంగా చివరి మూడు నెలలలోనే గుండె, ఊపిరితిత్తులు, పేగులు, వ్యాధి నిరోధకశక్తి సామర్థ్యాన్ని పొందగలిగేది ఈ సమయంలోనే కాబట్టి ఈ సమస్యలు రాకుండా ఉండాలంటే నెలలు తక్కువగా పిల్లలు పుట్టకూడదని చెబుతారు.
తక్కువ నెలలతో జన్మిస్తే ఏం చేయాలి?
బిడ్డలు తక్కువ నెలలతో జన్మించినప్పుడు అత్యాధునిక ఆరోగ్య పరికరాలైన ఇంక్యుబేటర్ లో ఉంచి వీనింగ్ చేస్తారు వైద్యులు. ఈ సమయంలో ఇచ్చే మందుల వలన పిల్లలకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే ఈ సమయంలో అన్ని మందులు సరైన సమయానికి ఇవ్వడం చేయాలి. ఇంటికి తీసుకెళ్లాక కూడా డాక్టర్ సలహాలను తప్పకుండా పాటించాలి.
శ్వాసతీసుకోవడం
తక్కువ నెలలతో జన్మించిన పిల్లల్లో ఊపిరితీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. శ్వాససంబంధిత పూర్తిగా అభివృద్ధి చెందకపోవడం వలన ఈ సమస్య వస్తుంది. మెదడులో రక్త గడ్డ కట్టడం, ఫిట్స్ వంటి సమస్యలు తక్కువ నెలలో పుడితే వస్తాయి.
సేఫ్టీ బ్యాగ్స్
తక్కువ నెలలతో జన్మించిన పిల్లలను బయటకు లేదా హాస్పిటల్ కు తీసుకువెళ్ళేటప్పుడు వారిని సురక్షితంగా సేఫ్టీ బ్యాగ్స్ లో తీసుకువెళ్లాలి. ఇలా చేయడం వలన దుమ్ము, ధూళి, కాలుష్యం నుండి రక్షించవచ్చు. వారికి రోగ నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా చేయకతప్పదు..
భవిష్యత్ లో వచ్చే అనారోగ్య సమస్యలు
తక్కువ నెలలతో పాటు, తక్కువ బరువుతో కూడా కొందరు పిల్లలు పుడుతూ ఉంటారు. అటువంటప్పుడు మంచి వైద్యం, డాక్టర్లు చెప్పిన సలహాలను తప్పక పాటించాలి. లేకపోతే భవిష్యత్ లో కిడ్నీల సమస్యలు, గుండె సంబంధిత మరియు శ్వాసకోస సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా బిడ్దను చూసుకోవాలి.
ఈ ఆర్టికల్ అందరికీ ఉపయోగపడుతుంది అని మీకు అనిపిస్తే వెంటనే LIKE చేయండి SHARE చేయండి. మరిన్ని విషయాలు తెలుసుకోవాలన్నా, ఈ ఆర్టికల్ పై మీరు COMMENT చేయవచ్చు.
ఇవి కూడా చదవండి.
బ్రెయిన్ ఫుడ్స్ : పిల్లల బ్రెయిన్ పవర్ పెంచే 10 అద్భుతమైన ఆహారాలు
