Link copied!
Sign in / Sign up
29
Shares

"నువ్వు నాకు కావాలి" అని మీ భర్తకు అర్ధమయ్యేలా మీరు చెప్పడానికి 4 సలహాలు

మీకు పిల్లలు పుట్టిన తర్వాత మీరు చాలా బిజీగా అయిపోతారు. ఎంతగా అంటే, మీరు మీభర్తను కూడా చాలా మిస్ అవుతారు.  మీ వృత్తిగత పని వల్ల, మీకు  తల్లిగా వచ్చిన అదనపు బాధ్యత వల్ల మీభర్తతో గడపడానికి సమయం ఉండదు. అప్పుడు ఈ కింది పనులు చేస్తూ ఉండటం వల్ల మీరు మీభర్తకు దగ్గరవడానికి అవకాశం ఉంటుంది. అవేంటంటే,

మెసేజ్ చేయడం

మీభర్తకు అప్పుడప్పుడు మెసేజ్ చేయండి. మీరంటే ఇష్టం అనో, మీరు అందంగా ఉన్నారనో మెసేజ్ చేయండి. ఇలా చేస్తే మీభర్త ఆనందం ఫీల్ అవుతారు.

వాయిస్ మెసేజ్

మీభర్తను మీరు ఎంతగా అభిమానిస్తున్నారో వాయిస్ సందేశం రూపంలో పంపండి. దీంతో కొత్త రకంగా మీరు సంభాషించుకున్నట్లు ఉంటుంది. మీవారికి ఇష్టమైన పాటను పంపినా బాగుంటుంది.

మాట్లాడటం

మీరు మీభర్తతో ఏదో ఒకటి మాట్లాడండి. ఆ మాటల ద్వారా తనంటే చాలా ఇష్టం అనేలా చెప్పండి. మీరు గతంలో గడిపిన మంచి సంధర్భాల గురించి మాట్లాడుకోండి, ఒకవేల మీరు ఏదైనా సమస్యతో బాధపడుతుంటే ఒకరికొకరు మాట్లాడుకొని పరిష్కారాన్ని వెతకండి.

కలిసి వంట

ఎప్పుడైనా మంచి సమయం చూసి మీరు, మీభర్త కలిసి వంట చేసుకోండి. మీభర్త చేత కర్రీ వండించుకొని తినండి. మధ్యలో మీభర్తను మీరు టీజ్ చేస్స్తూ ఆ సంధర్భాన్ని ఎంజాయ్ చేయండి.

డిన్నర్ డేట్

మీకిద్దరికీ ఎప్పుడు సమయం కుదిరితే అప్పుడు డిన్నర్ చేయడానికి బయటకు వెళ్ళండి. మీరిద్దరూ మొదటిసారి ఎక్కడ కలిశారో అక్కడ్దికి తీసుకెళ్ళి ఆ రాత్రిని ఎంజాయ్ చేయండి.

నడవడం 

మీరు, మీభర్త ఏకాంతంగా నడుస్తూ వెళ్ళండి. అలా వెల్తూ మీకు నచ్చిన విషయం గురించి మాట్లాడ్దుతూ వెళ్ళండి. దీంతో మీమధ్య అన్యోన్య మరింత పెరుగుతుంది.

హగ్స్

మీకు వీలు కుదిరినప్పుడల్లా హగ్స్ ఇవ్వండి లేదా మీభర్త దగ్గర నుండి తీసుకోండి. దీని వల్ల మీమధ్య ఏవైనా అపార్థాలు ఉన్నా తొలగిపోతాయి.

అతని వేలును పట్టుకోండి

ఒక్కోసారి చిన్న చిన్న విషయాల ద్వారా కూడా ప్రేమను వ్యక్తపరచవచ్చు. మీభర్త వేలిని పట్టుకోవడం, లవ్ యూ అని చెప్పడ్దం వంటివి చేస్తూ ఉండ్దాలి.

పిల్లల గురించి మాట్లాడటం

పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలనూ భర్తతో షేర్ చేయండి. ఎలా పెంచాలి? ఎలాంటి స్కూల్‌కు వెయ్యాలి? వంటి విషయాలను చర్చిస్తూ ఉంటే మీ ఇద్దరి మధ్యా మంచి అవగాహన కుదురుతుంది.

వీకెండ్ ప్లాన్స్

మీరు, మీభర్త కలిసి వారాంతాలల్లో ఎక్కడికైనా వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దీని వల్ల మీరిద్దరే గడపడానికి కొంచెం సమయం దొరుకుతుంది. ఆ సమయంలో బేబిని మీ తల్లిదండ్రుల దగ్గర ఉంచండి.

పనిని షేర్ చెసుకోండి

కలిసి పని చేయడం ద్వారా ఒకరి మీద ఒకరికి మంచి అవగాహన కుదురుతుంది. కాబట్టి ఇంటి పనిని ఇద్దరూ సమానంగా చెసేలా ప్లాన్ వేసుకోండి.

పుస్తకాలు బహుమతిగా ఇవ్వడ్దం

మీకు బాగా ఇష్టమైన బుక్‌ను మీ వారికి బహుమతిగా ఇవ్వడం లేదా మీ ఆశ్సయాల గురించి రాసుకున్న డైరీని మీరు మీభర్తకు ఇవ్వడం చేయండ్ది. దీని వల్ల మీ అభిరుచులు మీభర్తకు తెలుస్తాయి.

సలహ

మీభర్తకు మించిన సలహాదారుడు మీకు ఉండ్దకపోవచ్చు. మీకు ఏదైనా సమస్య వస్తే, చిన్నదైనా పెద్దదైనా సలహా కోసం మీ భర్తను అడగండి. దాని వల్ల మీ ఇద్దరి మధ్యా స్నేహం మరింత పెరుగుతుంది.

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon