Link copied!
Sign in / Sign up
23
Shares

ఈ డ్రింక్ ఒక్క గ్లాస్ తాగితే చాలు మీ నడుం చుట్టూ ఉన్న కొవ్వు తగ్గిపోతుంది

పగలంతా అలసిపోయి రాత్రి పడుకుంటాం కదా? తెల్లారి ఉత్సాహంగా, చురుగ్గా లేవాలనుకుంటున్నారా? కానీ, లావుగా ఉండడం వల్ల నడుం  బరువు ఎక్కువై లేవలేకపోతున్నారా? మరి ఏదైనా కషాయం లాంటిది తాగితే వర్కవుట్ అవుతుందేమో ప్రయత్నించారా? సరే మీరు ట్రై చేయకపోతే ఆ ఉపాయం మేం చెబుతాం. పడుకోబోయే ముందు ఆ డ్రింక్ తాగితే, మర్నాడు ఉదయం లేచేసరికి ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. ఈ డ్రింక్ ను మీరు ఇంట్లో ఉండే వాటితోనే తయారు చేసుకోవచ్చు.

మరి ఈ పానీయం ఎలా పనిచేస్తుందని మీరు అడగవచ్చు. మనం ఏదైనా బలమైన ఆహారం తీసుకుంటే వాటివల్ల జీర్ణక్రియను మందగిస్తుంది. అది జీర్ణం కావడానికి టైం పడుతుంది. పైగా బరువు పెరిగి లావు అవుతారు. అలా కాకుండా ఉండేందుకు, తిన్నది జీర్ణం కావడానికి వ్యాయామం చేయాలి. అయితే ఈ పానీయం గొప్పదనమేంటంటే ... కొవ్వు ఎక్కువగా ఉండే ఆహారం తీసుకున్నా వాటిని సులభంగా జీర్ణించుకునేందుకు ఇది బాగా తోడ్పడుతుంది.

చీజీ పిజా లేదా క్రీమీ చీజ్ కేక్ తీసుకున్నామనుకోండి. మన కడుపు బరువుగా అనిపిస్తుంది. అలాగని, వాటిని తినకుండా ఉండలేము. కాబట్టి, అలాంటి కొవ్వు పదార్థాలున్న ఆహారం తీసుకున్నప్పుడు మీరు పడుకునే ముందు ఈ కషాయం తీసుకుంటే మరి సమస్యే ఉండదు. మీరు నిద్ర పోతున్నప్పుడు ఈ కషాయం తన పని తను చేసుకుంటుంది.

పడుకునే ముందే ఈ మందు ఎందుకు తీసుకోవాలి? అని అడగొచ్చు. మీరు మేలుకొని ఉన్నప్పటికంటే ---  నిద్రపోయేటప్పుడు మీ శరీరంలో జీర్ణక్రియ నిదానంగా జరుగుతుంది. ఈ డ్రింక్ తీసుకుంటే అది జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. అంటే మీరు తిన్నది తొందరగా జీర్ణమవుతుంది. కాబట్టి, వెంటనే ఈ డ్రింక్ తయారు చేసుకునేందుకు సిద్ధం కండి.

ఎలా తయారు చేయాలి?

ఈ పానీయం తయారు చేసుకునేందుకు కావలసినవి:

దోసకాయ, కొత్తిమీర లేదా పుదీనా కట్ట, నిమ్మకాయ, ఒక స్పూన్ తురిమిన అల్లం. అర గ్లాసు నీళ్లు. ఈ పదార్థాల్ని నీళ్లలో కలిపి రాత్రి పడుకునే ముందు తాగాలి.

ఒక్కో దాన్లో ఒక్కో గుణం:

ఈ పదార్థాల్లో ఒక్కొక్క దాన్లో ఒక్కో గుణముంది. నిమ్మరసంలో సి విటమిన్ ఉంది. ఇది జీర్ణప్రక్రియకు పనికొస్తుంది.  దోసకాయ శక్తినిస్తుంది. అంతేకాదు – శరీరంలో మలినాల్ని తొలగిస్తుంది. తిన్న ఆహారం త్వరగా జీర్ణమయ్యేందుకు అల్లం, పుదీనా దోహదం చేస్తాయి.

ఈ పానీయాన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే నడుం దగ్గర పట్టిన కొవ్వును కరిగిస్తుంది..

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon