Link copied!
Sign in / Sign up
2
Shares

ముక్కు లేకుండా జన్మించిన బాబు : 2 ఏళ్ళ తర్వాత జరిగింది వింటే ఆశ్చర్యం కలుగుతుంది

ఇప్పుడు ఇక్కడ చెప్పుకోబోయేది 6 నెలల క్రితం జరిగిన సంఘటనే కానీ ప్రతి హృదయాన్ని తాకిన విషాదం.  రెండేళ్ల క్రితం ముక్కు లేకుండా జన్మించిన ఈ బాబు  ప్రస్తుతం మనతోపాటు లేకపోయినా తన జ్ఞాపకాలను మాత్రం అందరితో పంచుకుని ప్రపంచం మొత్తం మాట్లాడుకునేలా చేశాడు. ఆ బాలుడి గురించి మీకోసం..

ముక్కు లేకుండా పుట్టిన ఎలి థాంప్సన్

అమెరికాలోని అలబామాకు చెందిన ఈ బాలుడి పేరు ఎలి థాంప్సన్. రెండేళ్ల క్రితం అర్హినియా అనే అరుదైన వ్యాధి కారణంగా ముక్కు లేకుండా జన్మించాడు.నెలలు నిండకముందే తల్లి గర్భం నుండి బయటకు రావడం, ముక్కు లేకుండా జన్మించడంతో శ్వాసతీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో వెంటనే సర్జరీ చేశారు వైద్యులు. ఆ తర్వాత అమ్మనాన్నలతో, పక్కింటి పిల్లలతో ఆదుకోవడం, సైగలు చేయడం చేశేవాడు. ఐతే రెండేళ్ల తర్వాత ఈ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది.

చనిపోతాడని ముందే వైద్యులకు తెలుసు..కానీ

పిల్లలు ఇలా అవయవలోపంతో జన్మించినప్పుడు బ్రతకడం చాలా  వరకు కష్టమేనని వైద్యులు ముందే తెలిపారు. కానీ కడుపు తెంచుకుని పుట్టిన బిడ్డను ఏ తల్లితండ్రులు వదులుకోలేరు కదా. ప్రపంచంలో ఇలా జన్మించిన వారు దాదాపు 50 మంది ఉన్నట్లు వైద్యులు అన్నారు. తన బిడ్డ ఇలా పుట్టాడే అని ఆ తల్లి తండ్రులు ఎప్పుడు అనుకోలేదు. ఎంతో ప్రేమగా అల్లారుముద్దుగా చూసుకున్నారు. కానీ తన 2వ పుట్టినరోజు జరుపుకున్న 3 నెలలకు ఈ ప్రపంచాన్ని వదిలివెళ్ళాడు.

బిడ్డ చనిపోయాక తండ్రి చెప్పిన మాటలు

రెండేళ్లు అల్లారుముద్దుగా మా మధ్య పెరిగిన ఎలి థాంప్సన్ మా మధ్య ఇకలేడు అంటే నమ్మలేకపోతున్నాం. ఎలి మాకు జన్మించడం మేం అదృష్టంగా భావిస్తున్నాం. తను ఎంతో హుషారుగా, ఉత్సాహంగా ఉండేవాడు. అందుకేనేమో ఆ దేవుడు మళ్ళీ తిరిగి తనవద్దకే పిలుచుకున్నాడు. ఐ లవ్యూ లిటిల్ మ్యాన్.. నీ ఆత్మకు శాంతి చేకూరాలని సోషల్ మీడియా ద్వారా ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ వార్త ప్రపంచం మొత్తం తెలియడంతో అందరూ చలించిపోయాడు. ఈ అబ్బాయిని అందరూ మిరాకిల్ బాయ్ అని పిలిచేవారు.

తనలాగే ఉన్న మరో వ్యక్తిని కలిసిన ఎలి థాంప్సన్ 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon