Link copied!
Sign in / Sign up
75
Shares

మహిళల ముఖం, పెదవులపై అవాంఛిత రోమాలను తగ్గించే 3 ఉత్తమ ఇంటి చిట్కాలు

మహిళలలో చాలామంది ఎదుర్కుంటున్న సమస్య అవాంఛిత రోమాలు. చూడటానికి చాలా అందంగా ఉన్నా పెదవులు, చెంపలపై మరియు ముఖం అంతా ఉండి అంద వికారంగా కనిపిస్తాయి. దీనితో బయటకు వెళ్ళడానికి, ఏదైనా ఫంక్షన్ కు వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. అయితే ఇంటి వద్దనే మహిళలు ఈ టిప్స్ పాటించడం వలన ఈ సమస్య నుండి దూరం కావచ్చు.

పచ్చి పాలు, బొప్పాయి

పచ్చి పాలు రెండు స్పూన్లు, అర స్పూన్ స్పూన్, కాస్త బొప్పాయి గుజ్జు తీసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి.  ఈ మిశ్రమాన్ని అవాంఛిత రోమాలపై అప్లై చేసుకుని ఆరిన తర్వాత శుభ్రం చేసుకుంటే ఈ సమస్య నుండి త్వరగా బయటపడవచ్చు.

నిమ్మరసం మరియు తేనె

రెండు స్పూన్ల నిమ్మసరంలో ఒక స్పూన్ తేనే కలిపి, ఈ మిశ్రమాన్ని పై పెదవిపై రాసుకుంటే అవాంఛిత రోమాలకు చెక్ పెట్టవచ్చు.  వారానికి రెండు లేదా మూడు సార్లు చేసుకోవడం వలన అవాంఛిత రోమాల సమస్య ఉండదు.

అరటిపండు

అరటిపండు గుజ్జును ఒక బౌల్ లోకి తీసుకుని అందులో రెండు స్పూన్ల ఓట్ మీల్ ను కలిపి మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని ముఖంపై అవాంఛిత రోమాలు ఉన్న చోట రాసుకుని మర్దనా చేసుకోవాలి. కొద్దిసేపు అలాగే ఉంచి ఆరిన తరవాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచిది. ఇలా చేయడం వలన అవాంఛిత రోమాలు తొలగిపోవడమే కాదు ముఖం కాంతివంతంగా ఉంటుంది.

ఎగ్ వైట్,  షుగర్

ఎగ్ వైట్ ను ఎగ్ నుండి తీసి ఒక బౌల్ లో వేసుకోవాలి. ఇందులో ఒక టేబుల్ స్పూన్ షుగర్ మరియు అర టేబుల్ స్పూన్ మొక్క జొన్న పిండి కలుపుకుని బాగా మిక్స్ చేసి పై పెదవిపై అప్లై చేసుకోవాలి. ఆరిన తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా రెండు మూడు వారాలు చేస్తే ఈ సమస్యకు గుడ్ బై చెప్పవచ్చు.

పసుపు

రెండు టేబుల్ స్పూన్ల పసుపు తీసుకుని అందులో పాలు లేదా నీరు కలుపుకుని ముద్దలా కలుపుకోవాలి.  ఈ మిశ్రమాన్ని ముఖంపై రాసుకోవడం వలన ముఖం కాంతివంతంగా అందంగా ఉంటుంది. ఉన్న వెంట్రుకలు తొలగిపోయి, కొత్త అవాంఛిత రోమాలు రాకుండా సహాయపడుతుంది.

 శనగపిండి

ఒక టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకుని అందులో కాస్త పసుపు, నీరు వేసి మిక్స్ చేసుకోవాలి. నీటికి బదులుగా పాలు కలుపుకోవచ్చు.  మెత్తని పేస్ట్ గా అయ్యేలా చేసుకుని అవాంఛిత రోమాలు ఉన్న పై పెదవులపై రాసుకుని ఆరిన తర్వాత క్లీన్ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

మహిళలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్న ఈ సమస్య నుండి సులభంగా బయటపడేసే ఈ చిట్కాలు అందరికీ తెలిసేలా SHARE చేయగలరు.

ఇవి కూడా చదవండి.

మీ పిల్లల ఎముకలు బలంగా, దృఢంగా చేసేందుకు తినిపించాల్సిన 5 ఆహారాలు

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon