Link copied!
Sign in / Sign up
22
Shares

ముద్దు పెట్టుకుంటున్నారా..! అయితే ఈ 4 నిజాలు ప్రతి దంపతులు తెలుసుకోవాల్సిందే..

ముద్దు, కిస్, చుంబనం..ఇలా వివిధ పేర్లతో పిలిచినా ఇద్దరి మధ్య ప్రేమను వ్యక్తపరిచే అందమైన పధ్ధతిగా చెప్పుకోవచ్చు. అమ్మ ముద్దులో ఆప్యాయత, అనురాగం, ప్రియురాలి ముద్దులో ప్రేమ, అనుభూతి, మనకు కావలసిన వారు దగ్గరైన వారు పెట్టే ముద్దులో అభినందన, స్వాగతం ఉంటాయి. దంపతుల మధ్య  పడకగదిలో ఉత్తేజపరిచే ముద్దులో ఇద్దరినీ మరింత దగ్గరి చేసే ప్రేమ ఉంటుంది. ఈ ముద్దు వలన ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు  ఉన్నాయో ఒక్కసారి చూద్దాం…

ముద్దు పెట్టుకునే చోటు

సాధారణంగా అందరూ నుదుటిపై, బుగ్గల మీద, కళ్లపై, ముంగురులపై ముద్దు పెట్టుకోవడం చేస్తుంటారు. దంపతులు ఐతే లేదా భాగం, బొడ్డు, నడుం, పెదవులపై, చన్నులపై, నాలుకపై, రహస్య ప్రదేశాలను ముద్దాడటం సర్వసాధారణం. ఇలా చేయడం తప్పేమీ కాదు, ఆరోగ్యకరం మరియు ఇద్దరి మధ్య కోపతాపాలను తగ్గించి దగ్గర చేసి బంధాన్ని పెంచుతుంది.

ముద్దు వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి..?

చేతిపై ముద్దు పెట్టడం వలన స్వాగతించినట్లు, తమ గౌరవాన్ని చూపించినట్లు, నుదుటిపై ముద్దు పెట్టుకోవడం వలన ఇష్టాన్ని అనురాగాన్ని చూపించినట్లు, పెదవులను ముద్దాడటం వలన మీరంటే ఎంత ఇష్టమో మీపై ఉండే ప్రేమను చూపించడం, ఎద భాగాలపై ముంగురులపై ముద్దు పెట్టుకోవడం వలన ఇంకా ఏదో కోరుకుంటున్నట్లు.

ఒత్తిడి ఆందోళన - రక్త ప్రసరణ

ముద్దు పెట్టుకోవడం వలన ఒత్తిడి, ఆందోళన దూరమవుతుంది. రక్తనాళాలను ఆక్టివ్ గా చేసి రక్తప్రసరణ బాగా జరిగేలాగా సహాయపడుతుంది. ముద్దు దంపతుల మధ్య సంతోషాన్ని ఆనందాన్ని పెంచడంలో ప్రభావం చూపిస్తుంది.

ఒక్క ముద్దు ఏం చేస్తుందంటే

ఒకే ఒక్క ముద్దు అందులో అంత మధురం ఏంటి అని అందరికీ ఉన్న అనుమానం. ముద్దు పెట్టుకోవడం ఈజీ కాదు, చాలా కష్టమైన పని. ముద్దు పెట్టుకునేటప్పుడు 34 ముఖ కండరాలు మరియు ఇతర 112 కండరాలు పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు.

నొప్పులు దూరం - రోగ నిరోధక శక్తి

ముద్దు పెట్టుకునేటప్పుడు అడ్రినలిన్ అనే రసాయనం రిలీజ్ అవుతుంది. ఈ రసాయనం వలన కొన్ని రకాల నుండి నొప్పుల నుండి బయటపడవచ్చు. ముద్దు పెట్టుకునే క్రమంలో ఒకరి నుండి మరొకరి శరీరంలోకి వెళ్లే బాక్టీరియా కారణంగా రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఆరోగ్య నిపుణులు వెల్లడించారు.

తలనొప్పి, దంతాలు, రక్తపోటు

ముద్దు పెట్టుకోవడం వలన తలనొప్పి నుండి ఉపశమనం లభిస్తుంది. రక్తపోటు తగ్గుతుంది. కిస్ చేసేటప్పుడు నోటి నుండి ఉత్పన్నమయ్యే ఉమ్మి దంతాలకు రక్షణగా పనిచేస్తుంది. వీటన్నిటికీ మించి దంపతుల మధ్య గౌరవాన్ని, బంధాన్ని వందరెట్లు పెంచుతుంది.

ఈ ఆర్టికల్ పై మీ విలువైన అభిప్రాయాన్ని COMMENT రూపంలో చెప్పవచ్చు. అలాగే అందరికీ SHARE చేయవచ్చు.  

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon