Link copied!
Sign in / Sign up
2
Shares

పిల్లల చర్మంపై దోమకాటుకు వచ్చే మంట, దద్దుర్లులను తగ్గించే సహజ చిట్కాలు

దోమకాటు ఎంత ప్రాణాంతకమో అందరికీ తెలిసే ఉంటుంది. దోమకాటు వలన జ్వరం బారినపడి రోజు ఎంతోమంది ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా పసిపిల్లల చర్మం చాలా సున్నితంగా ఉండటం వలన వారిపై దోమకాటు ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దోమ వాలినా సరే మంట, దద్దుర్లు కలిగి కొన్నిసార్లు వాపును కూడా కలిగిస్తాయి. అందుకని ఇక్కడ చెప్పుకునే ఈ సహజ చిట్కాలు ఫాలో అవ్వడం వలన దోమకాటు మంట, దద్దుర్ల నుండి  బయటపడవచ్చు.

ఈ లోషన్ రాయండి

మీ పిల్లలు దోమకాటుకు గురికాకుండా ఉండాలంటే కేలమైన్ లోషన్ రాయడం ఉత్తమం. ఇది పిల్లల చర్మంపై దోమలు వాడకుండా చేస్తుంది. పొరపాటున దోమలు కుట్టినా మంట, దద్దుర్లు కలగకుండా సహాయపడుతుంది.

ఐస్ క్యూబ్

దోమలు కుట్టకుండా దోమతెరలు వాడటం మంచిదే. కానీ ఎప్పుడు ఇలా చేయలేరు కాబట్టి దోమ కుట్టిన ప్రాంతంలో చిన్న ఐస్ ముక్కను ఉంచడం కానీ చల్లగా ఉండే నీటిని ఉంచడం వలన మంట, దద్దుర్లు, వాపు ఉండవు. ఇది సహజంగా బాగానే పనిచేస్తుంది.

టూత్ పేస్ట్

పిల్లలకే కాదు పెద్దలు కూడా దోమకాటుకు గురైనప్పుడు కాస్త టూత్ పేస్ట్ ను ఆ ప్రాంతంలో రాయడం వలన నొప్పి మంట ఉండదు. కెమికల్ టూత్ పేస్ట్ వలన ఏమైనా రియాక్షన్స్ వస్తే వాటికి బదులుగా సహజమైన టూత్ పేస్ట్ లు వాడటం మంచిది.

లెమన్ జ్యూస్

దోమకాటు మంటను, దురద, దద్దుర్లను తగ్గించడంలో లెమన్ జ్యూస్ కూడా బాగా ఉపయోగపడుతుంది. తాజా నిమ్మకాయను తీసుకుని దోమ కుట్టిన చోట రాయడం లేదా లెమన్ జ్యూస్ ను అప్లై చేయడం వలన మంట, దురద తగ్గుతుంది.

బేకింగ్ సోడా

బేకింగ్ సోడాను అర స్పూన్ లేదా అంతకంటే తక్కువ మోతాదులో చల్లని నీటిలో కలిపి దోమ కుట్టిన చోట రాసినట్లయితే త్వరగా తగ్గిపోతుంది. పిల్లల చర్మంపై మరీ ఎక్కువగా బేకింగ్ సోడాను ఉపయీగించరాదు.

పిల్లల చర్మం చాలా సున్నితం కాబట్టి దోమకాటు బారిన పడకుండా చూసుకోండి. ఆరోగ్యంగా ఉంచండి. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon