మూడు కాళ్లతో జన్మించిన అరుదైన శిశువు : తల్లి నిర్లక్ష్యమే అసలు కారణం 😱😱
తలలు రెండు అతుక్కుపోయి పుట్టిన పిల్లలు, శరీరాలు అతుక్కుని ఉండి ఒకే గుండెతో పుట్టిన పిల్లలను అరుదుగా అప్పుడప్పుడు టీవీలలో లేదా న్యూస్ పేపర్ లలో చూస్తూనే ఉంటాం కదా. అలా ఒక బిడ్డ మూడు కాళ్ళతో జన్మించాడు. ఇది చాలామందికి వినడానికి కాస్త కొత్తగా ఉండవచ్చు, కానీ ఆరోగ్య నిపుణులు తెలిపిన ప్రకారం 10 లక్షల మందిలో ఒకరికి ఇలా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే ఈ చిన్నారికి ఆపరేషన్ చేసి ఒక కాలును తీసివేయడం జరిగింది. అసలు ఎందుకిలా జరిగిందో మీరే చూడండి..
మూడు కాళ్ళ శిశువు

ఇలా మూడు కాళ్ళతో పిల్లలు పుడితే దీనిని వైద్య భాషలో పారాసిటిక్ ట్విన్ అని అంటారు. ఈ చిత్రంలో ఉన్న ఈ బాబు పేరు జియో ఫియో. చైనాకు చెందిన ఈ బుడతడు పుట్టుకతోనే మూడు కాళ్లతో జన్మించాడు. తమ కొడుకు ఇలా పుట్టడంతో ఆ తల్లితండ్రులు ఎంతో ఆందోళన చెందారు. తమ బిడ్డను ఈ బాధ నుండి బయటపడేయటానికి ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు. ఇప్పుడు ఆ బాబుకు 11 నెలలు. చైనాలోని షాంఘైలో గల పబ్లిక్ హెల్త్ హాస్పిటల్ లో దాదాపు 10 గంటల పాటు ఆపరేషన్ చేసి ఒక కాలును వేరు చేశారు.
తల్లితండ్రుల సంతోషం

తమ బాబు 11 నెలలుగా ఈ సమస్యను ఎదుర్కుంటూ ఉండటంతో నిస్సహాయ స్థితిలో ఉండిపోయిన జియో ఫియో పేరెంట్స్ ఆపరేషన్ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంటూ సంతోషించారు. ఐతే ఈ బాబు మూడు కాళ్లతో పుట్టడానికి కారణం ఏంటా అని ఆరా తీయగా ఆ చిన్నారి తల్లి ప్రేగ్నన్ట్ అయిన తర్వాత కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడా లేదా, బిడ్డ పరిస్థితి గురించి చెకప్ కు రెగ్యులర్ గా వెళ్లకపోవడమే అని డాక్టర్లు చెప్పారు. అందుకే గర్భంతో ఉన్నప్పుడు డాక్టర్లు చెప్పినట్లుగా సరైన సమయంలో చెకప్ చేయించుకోవడం ఉత్తమం.