Link copied!
Sign in / Sign up
47
Shares

‘మనీ ప్లాంట్’ ను ఇంట్లో ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టుకోవాలి..? అసలు నిజం తెలుసుకోండి

మనీ ప్లాంట్.. ఈ మొక్క ఇంట్లో ఉండటం వలన సిరిసంపదలు బాగా కలిసివస్తాయని, అదృష్టవంతులు అవుతారని చాలామంది నమ్ముతున్నారు. ప్రస్తుతం ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా మనీ ప్లాంట్ పెట్టుకోవడం కామన్ అయిపొయింది. ఈ మొక్క ఇంట్లో ఉండటం వలన పాజిటివ్ ఎనర్జీ కలుగుతుందని, ఇంట్లో వాళ్లకు అదృష్టంతో పాటు శుభం కలుగుతుందని అంటున్నారు. ఐతే ఈ మొక్కను ఎక్కడ ఎలా పెట్టుకోవాలో చాలామందికి తెలియదు. మనీ ప్లాంట్ ను   ఎక్కడ పెడితే అదృష్టం  కలిసివస్తుందో చూడండి..

మనీ ప్లాంట్ ఇంట్లో ఎక్కడ ఉంచాలి..?

మనీ ప్లాంట్ ను మీ ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచాలి. ఆగ్నేయ దిశలో అంటే తూర్పు -దక్షిణం మధ్యలో ఉంచాలని చెబుతున్నారు. ఈ దిశ అంటే విఘ్నేశ్వరుడికి చాలా ఇష్టమని, ఇక్కడ ఉంచడం వలన మీరు చేస్తున్న పనికి శుభం, అదృష్టం తోడై ధనం చేకూరుతుందని చెబుతున్నారు. ఈ మొక్కను ఎలా పడితే అలా ఉంచకూడదు. ఒక కుండీలో లేదా ఒక బాటిల్ లో నీటిని నింపి అందులో ఉంచాలి.

మనీ ప్లాంట్ ఎక్కడ ఉంచకూడదు..?

మనీ ప్లాంట్ ను ఉత్తరం- తూర్పు మధ్యన (ఈశాన్య) దిశలోనూ మరియు పశ్చిమ దిశలోనూ అస్సలు ఉంచకూడదట. ఇలా ఉంచడం వలన ఇంట్లో ఉన్న ధనం అంతా పోతుందని, దంపతుల మధ్య మనస్పర్థలు, తగువులు వచ్చి దూరం అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే ఈ మొక్క ఆకులు ఎండిపోయిన, చనిపోయిన, పసుపు వర్ణంలోకి మారినా తీసివేయడం చేయాలి. లేకపోతే మీ ఇంటికి నష్టం కలుగుతుందని, అప్పుడప్పుడు మనీ ప్లాంట్ కు నీరు పోస్తూ ఉండాలని చెబుతున్నారు.

నిజంగానే డబ్బు వస్తుందా..!

మనీ ప్లాంట్ ఇంట్లో ఉంచుకోవడం వలన నిజంగానే ధనవంతులు, అదృష్టవంతులు అవుతారా? అని చాలామందికి ఉన్న అనుమానం. అందులో నిజమెంత అనేది కాసేపు పక్కన పెడితే ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉంటుందని, అందరికీ శుభం కలుగుతుందని ఈ మొక్కను ఇంట్లో పెట్టుకున్నవారు అంటున్నారు.

మనీ ప్లాంట్ గురించి మీకు తెలిసిన రహస్యం ఏదైనా ఉంటే COMMENT మరియు SHARE చేయగలరు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon