Link copied!
Sign in / Sign up
108
Shares

మొండిగా ఉండే పిల్లలను మార్చడానికి 9 మార్గాలు

పిల్లలు ఒకోసారి అనేక కారణాల వలన ఏడుస్తూ చికాకు పెడుతూ ఉంటారు. నచ్చిన ప్రతి వస్తువు కావాలనుకోవడం,  ఒక వేళ తీసివ్వకపోతే వీపరీతంగా ఏడవడం, మారాం చేయడం. ఇవన్నీ మొండి గా ఉండే పిల్లల లక్షణాలు. మరి దీనిని ఆపేదెలా అని చూసేద్దామా మరి?

1. పట్టించుకోవద్దు

పిల్లలు కొన్ని సార్లు వారి పైన దృష్టి మళ్లించాలి అని చెప్పేసి ఇలా చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇలా చేయకుండా ఉండాలంటే ముందు వాళ్ళని పట్టించుకోవటం మానేయండి. ఇలా చేయడం వల్ల వారు ఇది ఇంక పనిచేయదు అని తెలుసుకుని వేరే ఏదైనా చేస్తారు మీ దృష్టిని వారి పై మళ్లించడం కోసం.

2. దండన

పిల్లలు ఇలా ఏదైనా చేసినపుడు అల్లా వారికీ ఏదైనా చిన్న శిక్ష లాంటిది ఇవ్వండి. బొమ్మలతో కాసేపు ఆడుకోకూడదు లేదా వేరే ఏదైనా సరే కానీ మరి కఠినంగా ప్రవర్తించవద్దు. ఇలా చేయడం మూలంగా వారికీ అర్ధం అవుతుంది వారు చేస్తున్నది తప్పు ఆలా చేయకూడదు అని. ఒకసారి వారికీ అర్ధం అయితే ఇంక వాళ్లే మానేస్తారు.

3. దృష్టి మళ్లించడం

ఇది చాలా మంది తల్లిదండ్రులు ఉపయోగించే చిట్కాలతో ఒకటి. పిల్లలకి దేనిమీద అయినా సరే దృష్టి తక్కువగా ఉంటుంది అందువలన వారిని ద్రుస్తి మళ్లించడం చాలా సులభం. ఇటువంటి సమయంలో ఏదైనా వారితో ఆదుకోండి లేదా ఎదో ఒకటి చేసి ఆ చోటు నుండి వారిని తీసుకెళ్ళిపోతే వారు కాస్త శాంతిస్తారు.

4. కౌగిలించుకొండి

పిల్లలు ఇలా మారం చేస్తున్న సమయంలో వారిని వెళ్లి కౌగిలించుకొంది. ఆలా చేసినపుడు వారు మారం చేయడం ఆపేసారు అని ఎంతో మంది తల్లులు అంటూ వుంటారు. అంతే కాకుండా ఆలా తల్లిదండ్రులు పిల్లలని కౌగిలించుకోవడం వలన వారికీ ప్రేమగా మరియు మనసుకు హాయిగా అనిపిస్తుంది.

5. నవ్వించండి

పిల్లలని నవ్వించండి. వారికీ చెక్కింలిగింత పెడుతూ లేదా ఎదో ఒకటి చేసి పిల్లలని నవ్వించండి. ఆలా చేసినపుడు వారు బాధని మర్చిపోయి సంతోషంగా ఉంటారు.

6. ప్రేమగా మాట్లాడండి

పిల్లలు ఇలా బెట్టు చేస్తూ ఉన్నపుడు సహజంగా మనం కఠినంగా మాటాడటం లేదా వారిని తిట్టేస్తూ ఉంటాము. ఆలా చేయడం వల్ల వారు ఇంక బెట్టు చేస్తారు గాని అది తగ్గదు అందువలన వారితో ప్రేమగా మాట్లాడండి. ప్రేమగా చెప్తే పిల్లలు బాగా అర్ధం చేసుకుంటారు.

7.ఒప్పుకోవద్దు

వారు బెట్టు చేస్తున్నారని ఏడుస్తున్నారు అని చెప్పేసి వారిని ఆపడానికి వారు ఏమి అడిగిన ఒప్పేసుకోకండి. ఆలా ఒప్పుకుంటే వారికీ ఎం కావాలన్నా సరే ఇలా బెట్టు చేస్తే చాలు ఇచ్చేస్తారు అని వారి మనసులో ఉండిపోతుంది. అంతే కాకుండా ఇంక ఎక్కువ చేస్తారు.

8. ప్రదేశం మార్చేయండి

పిల్లలు బెట్టు చేస్తుంటే వారిని ఆలా ఎత్తుకుని లేదా ఎదో ఒకటి చేసి వారిని ఆ ప్రదేశం నుండి తీసుకెళ్లిపొండి. ఆలా చేసినప్పుడు తల్లి దండ్రులు వారిని కౌగిలించుకున్నపుడు ఎంత భద్రత భావం కలిగి ఉంటారో ఇలా చేసినపుడు కూడా అంతే ప్రభావం వుంటుంది.

9. చర్చ

పిల్లలతో చర్చించండి. వారికీ వారు గనక ఇలా బెట్టు చేస్తూ మంచి పిల్లలుగా ఉండకపోతే బొమ్మలు కొనివ్వను అని లేదా వారికీ నచ్చింది ఏదైనా ఇవ్వను అని చెప్పండి ఆ భయం తో అయినా వారు మానేస్తారు. లేదా మంచి పిల్లలుగా ఉంటె ఇంక ఎక్కువ చాక్లేట్లు కొనిస్తాను ఆలా ఏదైనా చెప్పి చుడండి.

వారు పిల్లలు కదా వారికీ వారి నిరాశ భావన లేదా విసుగ్గా ఉండటం ని ఎలా తెలపాలి అని తెలియక ఆలా చేస్తూ ఉంటారు.  పై చెప్పబడిన విధానాలు ఏదైనా పాటించండి. తప్పకుండ ఎట్టి పరిస్థితుల్లోనూ వారితో అసహనంగా మరియు కఠినంగా మాట్లాడవద్దు.

 

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
100%
Like
0%
Not bad
0%
What?
scroll up icon