Link copied!
Sign in / Sign up
14
Shares

బిడ్డ పుట్టి 9 రోజులు అయినా 'బొడ్డు తాడు' తెంచని తల్లి : ఆ తర్వాత ఏం జరిగిందంటే..

కొత్త కొత్త ఆలోచనలతో,ఆవిష్కరణలతో మన ప్రపంచం రోజు రోజుకి ముందుకి అడుగులేస్తోంది. మనకు పూర్వీకుల ద్వారా అందిన జనన పద్దతి కి కూడా ప్రత్యామ్నాయ పద్ధతుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఆలస్యంగా వెలుగు చుసిన లోటస్ జననం (దీనికి ఏ రాజకీయ పార్టీ గుర్తు తో సంబంధం లేదు) అనేది విమర్శలకు లోనవుతూ ఉన్నా అదే విధంగా ఆదరణకు కూడా నోచుకుంటుంది.

వనాస్సా ఫిషర్ అనే బాలింత,లోటస్ జననం ద్వారా తన బిడ్డకు జన్మనివ్వాలనుకుంది. శిశువు యొక్క బొడ్డు తాడును సహజంగా, పుట్టగానే కత్తిరిస్తారు. కానీ అలా కత్తిరించకుండా ఆ బొడ్డు పేగు,దాని అంతటా అదే సహజంగా పుట్టిన బిడ్డ నుంచి వెరయ్యేదాకా ఉంచడమే ఈ లోటస్ బర్త్ అంటే.మరి ఆ బొడ్డు పేగుని అలానే కత్తిరించకుండా ఉండటం వల్ల ఏం లాభమో ఇప్పుడు చూద్దాం:

అస్సలు లోటస్ బర్త్ అంటే ఏమిటి ? అలాంటి పుట్టుక వాళ్ళ లాభమేమిటి?

ఈ లోటస్ బర్త్ అనే పేరు, హిందూ మతంలో మరియు బౌద్ధ మతంలో వివరించినటువంటి పుట్టిన బిడ్డకు మరియు బొడ్డు  పేగుకు మధ్య ఉన్న సంబంధం నుంచి వచ్చింది. క్లినికల్ ప్రోటోకాల్కు విరుద్ధంగా, బొడ్డు త్రాడును శిశువు నుంచి కత్తిరించకుండా, తల్లిదండ్రులు ఒక గిన్నెలో లేదా ఒక ప్రత్యేక పర్సులో ఆ బొడ్డు పేగును, పాలిపోయినా మరియు దాని నాడి ఆగిపోయిన కూడా అలానే ఉంచుతారు.

వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (WHO) రిప్రొడక్టివ్ హెల్త్ లైబ్రరి నివేదిక ప్రకారం, ప్లాసెంటా లో మరియు పిండాలలో గణనీయమైన స్థాయిలో ఐరన్ నిక్షిప్తం చేయబడుతుంది. కాబట్టి ఇలా ఆ బొడ్డు పేగును బిడ్డనుంచి తొలగించకుండా ఉంటే ఆ జన్మించిన బిడ్డకు అదనపు ఐరన్ లభిస్తుంది. తద్వారా పుటిన బిడ్డకు బాల్యంలో వచ్చే ఐరన్ లోపాన్ని నివారించవచ్చు .

ఇలా చెయ్యడం వల్ల ఎన్నో ప్రయోజనాలతో పాటు, సహజంగా మరియు పుట్టిన బిడ్డకు తక్కువ బాధాకరంగా ఉంటుందని ఫిషర్ వివరిస్తుంది. ఈ విధానం యొక్క ప్రయోగాల రీత్యా ఈ పద్దతిని అందరు తల్లిదండ్రులు ఆహ్వానించాలని ఆమె కోరుకుంటుంది. ఈ బొడ్డు పేగు పుట్టిన బిడ్డకు ఎక్కువ కాలం పాటు అలానే ఉండటం వల్ల ఆ బొడ్డు పేగు ద్వారా అందాల్సిన పూర్తి రక్తం మరియు ఇతర ద్రవాలు అన్ని సంపూర్తిగా బిడ్డలకు కు అంది బిడ్డలు ఆరోగ్యంగా ఉంటారు. అంతేకాకుండా, అప్పుడే పుట్టిన పిల్లలకు ఆ బొడ్డు పేగు తెగినప్పుడు కలిగే నొప్పిని కూడా నివారించి ఆ శిశువుకు ఓ ప్రశాంతమైన పుట్టుక కూడా ఇచ్చిన వారవుతాము.

ఫిషర్ కూడా తమ కుటుంబ సభ్యుల నుండి ఈ విషయమై కొంత తిరస్కరణలు అందుకుంది. కానీ ఆమె భర్త మద్దతుతో ఆమె ఈ పద్దతిని విజయవంతగా ఆహ్వానించగలిగింది. ఏది ఏమైనా బొడ్డు పేగుతో పిల్లల్ని చూడటం కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. ఎప్పుడు తీసుకునే వాటికన్నా కొన్ని జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రసవం ఐన 5వ రోజునే ఆ బొద్దుపేగు సహజంగా బిడ్డ నుంచి విడిపోయింది.

“మా అబ్బాయి ,పూర్తిగా ఈ బొడ్డు పేగు తెగిపోయ్యేదాక తన తమ్ముడిని ఎత్తుకోకుడదని నిశ్చయించుకున్నాడు. నేను ఈ పద్దతి గురించి చదివినప్పుడు ఇది మూర్కత్వపు పని అని, అపరిశుబ్రమైనదని రాసారు. అంతేకాదు  డాక్టర్లు సైతం ఏదన్న ఇన్ఫెక్షన్ లు వస్తాయని నమ్మారు కానీ అంతర్జాలంలో సైతం ఈ అపోహలకు ఆధారాలు నాకు దొరకలేదు. అందుకని నేను దీనిని ధైర్యంగా అనుసరించగలిగాను” అని ఫిషర్ అన్నారు.

కానీ, ఇది వైద్యపరంగా సిఫార్సు చేయబడుతుందా?

అమెరికన్ కాలేజ్ ఆఫ్ ఒబెస్ట్రీషియన్స్ మరియు గైనకాలజిస్ట్స్ కమిటీ అధ్యయనం ప్రకారం, బొడ్డు త్రాడు తీసివేయడంలో 30 నుంచి 60 సెకన్ల ఆలస్యం చేయడం వల్ల శిశువు రక్తంలో అధిక హేమోగ్లోబిన్ కౌంట్ మరియు రక్తంలో మంచి ఐరన్ నిల్వలు ఉంటాయని తేలింది. కానీ డాక్టర్లు బొడ్డు త్రాడు ఎక్కువకాలం అంటివుండటం వల్ల కలిగే ప్రయోజనాలు గురించి కొన్ని అనుమానాలు ఉన్నాయి.

కానీ ఇలాంటి కొత్తపద్ధతులను త్వరగా అలవర్చుకోవడానికి మనకున్న సాంప్రదాయ పద్ధతులు అడ్డుగా ఉన్నాయా??

ఏమో ఇలాంటి కొత్త పద్ధతుల వల్ల మేలే జరగవచ్చు,లేదా హానియే జరగొచ్చు.ఏదేమైనా కాలమే అన్నిటికి సమాధానాలు చెపుతుంది.

Image Source : Love what matters

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon