Link copied!
Sign in / Sign up
15
Shares

పుట్టుమచ్చలు ఈ 5 చోట్ల ఉంటే మాములు అదృష్టవంతులు కాదు : పుట్టుమచ్చల గురించి అసలు రహస్యాలు

ప్రతి ఒక్కరి శరీరంపై పుట్టుమచ్చలు ఉండటం సహజమే. పుట్టుమచ్చల ఆధారంగా మనం ఎలాంటి వాళ్ళం, మన స్వభావం ఎలాంటిది, మన వ్యక్తిత్వం గురించి తెలుసుకోవచ్చని హిందూ మరియు చైనీస్ ఆస్ట్రాలజీ ప్రకారం చెబుతున్నారు. చేతి రేఖల ద్వారా, సంఖ్యా శాస్త్రం ద్వారా, న్యూమరాలజీ ప్రకారం మనం ఏ విధంగా అయితే అన్ని విషయాల గురించి తెలుసుకుంటున్నామో ఇది కూడా అలాగే.. ఎక్కడ పుట్టుమచ్చ ఉంటే ఏం జరుగుతుందో ఇక్కడ చూడండి..

తల నుదుటిపై కుడివైపు

కుడివైపు తల నుదుటిపై పుట్టుమచ్చ ఉంటే ఆరోగ్యం, మంచి పేరు మరియు కాస్త ఆలస్యమైనా సరే మంచి విజయాన్ని అందుకుంటారు.

కనుబొమ్మలపై

కనుబొమ్మలపై పుట్టుమచ్చ ఉంటే చాలా తెలివైనవారు మరియు సృజనాత్మకత కలిగిన వారు.

బొడ్డుపై లేదా బొడ్డు మధ్య భాగాన

ఇలా బొడ్డుపై లేదా బొడ్డు మధ్య భాగాన పుట్టుమచ్చ ఉంటే మగవారు చాలా అదృష్టవంతులు. అదే మహిళలు ఐతే వారికి గొప్ప జీవితం ఉంటుందని చెబుతున్నారు.

పెదవులపై

పెదవులపై పుట్టుమచ్చ ఉన్నవారికి ఎప్పుడు ఒకేచోట ఉండటం అంటే చాలా బోర్ గా ఫీలవుతూ ఉంటారు. అందుకనే ప్రయాణాలు చేయడం అంటే చాలా ఇష్టపడతారు. కొత్త వ్యక్తులతో స్నేహం చేయడం కూడా వీరికి చాలా ఇష్టం. చాలా త్వరగా వారితో కలిసిపోతారు.

గడ్డం లేదా పెదవికి దగ్గరగా

పై పెదవికి దగ్గరగా గానీ గడ్డంపై పుట్టుమచ్చ ఉంటే మహిళలు చాలా అందంగా ఉంటారు. వీరు తమ జీవితాన్ని ఎటువంటి ఇబ్బందులు వచ్చినా సరే బ్యాలెన్స్ చేసుకోగలరు. అలాగే వీరు చేసే ప్రతి పనీ బాగా ఆలోచించి చేయడం వలన విజయం పొందగలరు.

ముక్కుపై

ముక్కుపై లేదా ముక్కుకి దగ్గరగా ఉన్నవారు షార్ట్ టెంపర్ కలిగిన వ్యక్తులు. ఏ విషయానికైనా సరే త్వరగా కోపం వస్తుంది. అలాగే ఎంత కోపం వచ్చినా అంతే త్వరగా తమ కోపాన్ని దూరం పెట్టి ప్రేమిస్తారు.

చెవిపై

చెవులపై పుట్టుమచ్చలు చాలా అరుదుగా చూస్తుంటాం. అయితే కుడి చెవిపై పుట్టుమచ్చ ఉంటే వీరు చాలా అదృష్టవంతులు. తమ కుటుంబ సంతోషం కోసం ఎంత కష్టమైన పనైనా చేస్తారు. కుటుంబం అంటే చాలా ఇష్టం కాబట్టి..

మెడపై

మెడపై పుట్టుమచ్చ కలిగిన వారు మంచి వ్యక్తిత్వం కలిగినవారు. వీరి స్వభావం చాలా మంచిది కూడా. మహిళలలో ఇలా మెడపై పుట్టుమచ్చలు ఎక్కువని చెబుతున్నారు.

చేతులపై పుట్టుమచ్చ

చేతులపై పుట్టుమచ్చ ఉన్నవారు ఏ విషయంలో అయినా సరే ధైర్యంగా ముందుకు వెళ్తారు. చాలా ధైర్యం కలిగినవారు. కష్ట సమయాలలో కూడా మంచి నిర్ణయాలు తీసుకుంటారు.

అరచేతిలో

అరచేతిలో పుట్టుమచ్చ ఉన్నట్లయితే మహిళలు డబ్బును బాగా పొదుపు చేయగలరట. అదే మగవారిలో అయితే డబ్బు నిలవడం కాస్త కష్టమని చెబుతున్నారు.

సో, ఇదండీ పుట్టుమచ్చల రహస్యం.. ఇది నిజమో కాదో మీరే చెక్ చేసుకోండి..  

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon