Link copied!
Sign in / Sign up
6
Shares

మొదటిసారి 'తల్లి' అయిన ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన నిజాలు : నిర్లక్ష్యం చేయకండి..

అమ్మ.. అక్షరాలు రెండే. కాని.. అమ్మకు అర్థం అనిర్వచనీయం. అమ్మ అనేది రెండక్షరాల పదం మాత్రమే కాదు.. అది విడదీయలేని బంధం. మరి.. ఆ అనుభూతిని పొందాలని కలలు కనని మహిళలు ఉండరు అంటే అతిశయోక్తి కాదేమో. అంతటి ప్రాధాన్యత ఉన్న అమ్మ.. తన బిడ్డ పుట్టడానికి ముందే ఎన్నో రకాల ఊహలలో విహరిస్తుంది. బిడ్డ పుట్టాక ఎలా ఉండాలో ముందే అన్నీ తయారు చేసి పెట్టుకుంటుంది. బిడ్డే తనకు లోకం అనుకుంటుంది. బిడ్డ కోసం తన జీవితాన్ని త్యాగం చేయాలనుకుంటుంది. కాని.. రియాలిటీకి వచ్చేసరికి ఏమౌతుందో తెలుసా? మొదటి సారి బిడ్డకు జన్మనిచ్చిన తల్లులకు ఇవి కామనే కావచ్చు కాని ఇవి వాళ్లను ఆశ్చర్యానికి గురి చేస్తాయి. మరి అవేంటో తెలుసుకుందాం పదండి.

1. ఎక్స్ పెక్టేషన్: మీ బేబీ చాలా క్యూట్ గా ఉంటుందని,ఉంటాడని మీరు అనుకుంటారు.

రియాలిటీ: మీ బేబీని మీరు తినేయాలనుకుంటారు.

బేబీని తినేయడం ఏంటి? మేము నరమాంస భక్షకులం కాదు కదా? అని అనకండి. ఎందుకంటే తినయడమంటే వాళ్లకు మీరు చేసే సేవను తినేయడంతో పోల్చామన్నమాట. వాళ్లను మీరు సంతోషంగా ఉంచటం కోసం అహర్నిషలు కష్టపడతారు.

2. ఎక్స్ పెక్టేషన్: డైపర్స్ మార్చడమే కదా పెద్దగా కష్టమేమీ ఉండదులే.

రియాలిటీ: దేవుడా.. కలలో కూడా డైపర్సే వస్తున్నాయి.

రోజుకు ఒక్క డైపరే కదా అని ముందు అనుకుంటారు తల్లులంతా. కాని.. ఒక్కటి కాదు.. రోజుకు ఎన్ని సార్లు మార్చాలో తెలియక విసుగు పుడుతుంటుంది తల్లులకు. వంట వండటం, బట్టలు ఉతకడం కంటే కూడా పిల్లలకు డైపర్స్ మార్చడం కష్టం బాబోయ్ అంటూ తల్లులు తలలు పట్టుకుంటుంటారు. మంచి డైపర్ వాడకపోతే పిల్లలకు వేరే సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకే డైపర్స్ విషయంలో తల్లులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. పచ్చిగా చెప్పాలంటే పిల్లలకు డైపర్ మార్చడమంటే తల ప్రాణం తోకకొచ్చినట్టే.

3. ఎక్స్ పెక్టేషన్: మీ పిల్లలకు కావాల్సిన అన్ని పనులను మీరే చూసుకోవాలనుకుంటారు. దాని కోసం ఎంతో రీసెర్చ్ కూడా చేస్తారు.

రియాలిటీ: మీ పిల్లలకు సంబంధించిన అన్ని విషయాలను మీరే చూసుకోవాలంటే మాత్రం మీకు చుక్కలే.

మీ పిల్లలు మీ దగ్గర ఉన్నంత వరకు ఓకే కాని. వాళ్లు మీమ్మల్ని వదిలి ఎక్కడికైనా వెళ్తే వాళ్లకు సంబంధించిన అన్ని పనులపై మీకు టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. వాళ్లు మీ దగ్గర ఉన్నప్పుడు వాళ్ల పనులు చేయలేక విసుగెత్తుతారు. మీ పిల్లలను మీరే తెగ ఇబ్బంది పెడతారు. మళ్లీ వాళ్లకు ఏదైనా అయితే మాత్రం తెగ కంగారు పడతారు. వెంటనే డాక్టర్ ను సంప్రదించి.. డాక్టర్ ఏమి కాలేదు అని చెప్పాక కాని ఊపిరి పీల్చుకోరు తల్లులు.

4. ఎక్స్ పెక్టేషన్: మీకు సపోర్ట్ గా ఉండే భర్త, ప్రేమించే ఫ్యామిలి ఉంటుంది.

రియాలిటీ: వాళ్లంతా నా లైఫ్ లో ఎందుకు ఉన్నారు.

మీ పిల్లల సంరక్షణకు సంబంధించి మీరు మీ ఫ్యామిలీ మీద అస్సలు డిపెండ్ కారు. చివరకు మీ భర్త పిల్లలకు ఏదైనా చేసినా చిరాకు పడతారు. అలా కాదు.. ఇలా అంటూ నోరు నెత్తిన పెట్టుకుంటారు. అసలు ఎవరినీ పిల్లలకు సంబంధించిన పనులను చూసుకోనివ్వరు. మీ పిల్లల గురించి మీకే తెలుసు అన్న నమ్మకమే మిమ్మల్ని అలా చేయిస్తుంది. మీ బేబీ గురించి వాళ్లకు ఏం తెలుసు అని మీరు భావిస్తుంటారు. ఒక్కోసారి మీ బేబీ, మీరు ఉంటే చాలు వీళ్లంతా ఎందుకు అని అనిపిస్తుంటుంది.

5. ఎక్స్ పెక్టేషన్: మీరే ఉత్తమమైన తల్లి

రియాలిటీ: మీరు ఏది చేసినా అది తప్పే అవుతుంది

పిల్లలకు పాలు పట్టడం మీకు రాదని మీరు అనుకుంటారు. బాటిల్ ఫీడింగ్, డైపర్ మార్చడం, పొత్తి బట్టలు మార్చడం లాంటివేమీ మీకు తెలియదనుకుంటారు. కాని.. మీరు ఉత్తమమైన తల్లి కావాలనుకుంటారు. కాని.. పిల్లలకు చేసే పనుల్లో ఎన్నో తప్పులు దొర్లుతూనే ఉంటాయి.

అయితే.. ఈ సమస్య మీ ఒక్కరిలోనే కాదు.. మొదటి సారి తల్లి అయిన ప్రతి ఒక్కరికి ఉండేదే. మరి మీరెందుకు మీ తప్పులను ఒప్పుకోవాలి. ఇదంతా కామనే. తప్పులు చేస్తూనే ఒప్పులను నేర్చుకుంటారు.

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon