Link copied!
Sign in / Sign up
2
Shares

మొదటిసారి ప్రేగ్నన్ట్ అయిన ప్రతి మహిళ తెలుసుకోవాల్సిన 10 ముఖ్యమైన విషయాలు


ప్రతి మహిళ జీవితం అమ్మ అవ్వడంతో పరిపూర్ణం అవుతుంది. మొదటి సారి ప్రేగ్నన్ట్ అవడంలో చాలా ఆనందం ఉంటుంది. అంతేకాకుండా మొదటిసారి ప్రేగ్నన్ట్ అయినప్పుడు అనేక అనుమానాలు, ప్రశ్నలు ఉంటాయి. సలహాలు ఇచ్చే వాళ్ళు చాలా మందే ఉన్న, వాటి మీద సందేహాలు ఉంటాయి. అందుకే మీరు మొదటి సారి ప్రేగ్నన్ట్ అయితే, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో, తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటో ఇక్కడ చూడండి…

1. నిర్దారణ

ప్రేగ్నన్ట్ అవ్వలనే కోరిక మీలో బలంగా ఉన్నప్పుడు, కొన్ని సార్లు తప్పు సంకేతాలతో ప్రేగ్నన్ట్ అయ్యారని అనుకుంటారు. అందుకే జాగ్రత్తగా గుర్తులను చెక్ చేసుకోండి. తొందరపడి నిర్ధారణకు రాకండి. కాదని తెలిసిన తరువాత బాధపడాల్సి ఉంటుంది.

2. తరచుగా కలవండి

మీరు ప్రేగ్నన్ట్ అయ్యారు అనే నిర్ధారణకు వచ్చాక మీరు చేయాల్సిన మొదటి పని, డాక్టర్ ను కలవడం. డాక్టర్ సలహా మేరకు చేయించుకోవాల్సిన పరీక్షలన్నీ తప్పకుండా చేయించుకోండి. వీటి కడుపులోని బిడ్డకు ఏదైనా లోపాలు ఉంటే, ముందే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

3. కుటుంబంలో ఎలా జరిగింది 

మీరు మొదటిసారి ప్రేగ్నన్ట్ అయిన తరువాత మీరు చేయాల్సిన పనులలో ఇది చాలా ముఖ్యమైనది. మీ కుటుంబంలో, మీ అమ్మ, లేదా పిన్ని, అక్కలు ప్రెగ్నన్సీ సమయంలో ఏదైనా సమస్యలకు లోనయ్యారో లేదో తెలుసుకోండి. అవి జన్యుపరమైనవి అయితే మీకు ఆ సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అవేంటో ముందే తెలుసుకుంటే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు.

4. వాక్సినేషన్

మీకు ప్రెగ్నన్సీ సమయంలో ఏ జబ్బులు రాకుండా ఉండడానికి, కొన్ని వ్యాక్సిన్స్ చేయించుకోవాల్సి ఉంటుంది. డాక్టర్ సలహా మేరకు అవన్నీ క్రమం తప్పకుండా వేయించుకోండి. మీరు ప్రేగ్నన్ట్ గా ఉన్నప్పుడు ఏదైనా సమస్య వస్తే అది కడుపులోని బిడ్డ మీద ప్రభావం చూపిస్తుంది.

5. బ్లీడింగ్ జరగచ్చు

మీరు ప్రేగ్నన్ట్ అయితే పీరియడ్స్ ఆగిపోతాయి. కానీ బ్లీడింగ్ జరిగే అవకాశం ఉంటుంది. అండం ఫెలోపియన్ ట్యూబ్ ద్వారా గర్భసయంలోకి చేరుకున్నాక, గర్భాశయ లైనింగ్స్ ఊడిపోయి రక్తం ద్వారా బయటకు వస్తాయి. ఆ రక్తం బ్రౌన్ లేదా పింక్ కలర్ లో ఉంటుంది.

6. బరువు

మొదటి సారి ప్రేగ్నన్ట్ అయిన వారికి బరువు మీద అనేక అనుమానాలు ఉంటాయి. ప్రెగ్నన్సీ సమయంలో ఎంత వరకు బరువు పెరగచ్చు అనేది, ప్రేగ్నన్ట్ కాకముందు మీ బరువు మీద ఆధారపడివుంటుంది. ఒకవేళ మీరు ప్రేగ్నన్ట్ కాకముందు అధిక బరువు ఉంటే, ప్రేగ్నన్ట్ అయిన తరువాత బరువు విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది.

7. ఏమి తినాలి? ఏమి తినకూడదు?

విటమిన్లు, ప్రోటీన్లు, పోషకాలతో కూడిన సమతుల్యమైన ఆహారాన్ని తీసుకోండి. ఆహారాన్ని కొంచెం కొంచెం గా ఎక్కువ సార్లు తీసుకోండి. కెఫిన్ అధికంగా ఉండే కాఫీ లాంటి వాటికి దూరంగా ఉండండి.

మీరు తీసుకునే ఆహరం కడుపులోని బిడ్డకు అందడం ముఖ్యం.

8. ప్రయాణాలు

వీలున్నంత వారకు నెలలు నిండిన తరువాత ప్రయాణాలను మానుకోండి. ఒకవేళ తప్పనిసరిగా చేయాల్సి వస్తే తగిన జాగ్రత్తలు తీసుకోండి. ఒంటరిగా ప్రయాణం చేయద్దు. ప్రయాణం చేసే సమయంలో ఎవరినైనా తోడుగా ఉంచుకోండి.

9. కాన్పు తేది

కాన్పు తేదిని ముందే అంచనా వేసుకోవడం మంచిది. మీ చివరి పీరియడ్స్ ఆధారంగా కాన్పు తేది తెలుసుకోవచ్చు. ప్రేగ్నన్ట్ అయిన 37 వారాల నుండి 40 వారాల లోపు కాన్పు జరగడం సహజం.

10. కాన్పు నొప్పులు

కాన్పు తేది దగ్గరవుతున్న కొద్ది మీకు నొప్పులు మొదలవుతాయి. నొప్పులకు ముందుగా కడుపు సంకోచించినట్టు ఉంటుంది. తరువాత నొప్పులు మొదలవుతాయి. ఇవి అధికమైతే హాస్పిటల్ కు వెళ్ళడం ఉత్తమం. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon