Link copied!
Sign in / Sign up
10
Shares

ప్రెగ్నన్సీతో ఉన్నప్పుడు మొదటి 3 నెలలు ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, ఏ ఆహారం తీసుకోవాలో తెలుసుకోండి


ప్రెగ్నన్సీ అప్పుడు మంచి పోషణ కలిగి ఉన్న ఆహారం తీసుకోవడం చాలా అవసరం. సాధారణంగా గర్భవతి గా ఉన్నపుడు ఇద్దరి కి కలిపి తినాల్సినంత తిండి తినాలి అంటూ ఉంటారు. కానీ అలా కాకుండా సరైన పోషకాలు కలిగి ఉన్న ఆహారం తీసుకోవాలి. ఇలా చేయడం వలన కడుపు లో ఉన్న బిడ్డ యొక్క ఎదుగుదలకి మరియు అభివృద్ధి కి మంచిది. 

ప్రతి ట్రైమెస్టర్ లోను బిడ్డ ఎదుగుదల చెక్ చేసుకోవడం వలన, బిడ్డకు ఎదుగుదల కోసం తీసుకోవాల్సిన ఆహరం, జాగ్రత్తలను ముందే ప్లాన్ చేసుకునే అవకాశం కలుగుతుంది.

మొదటి ట్రైమెస్టర్ లో జరిగే అభివృద్ధి

టెక్నాలజీ డెవలప్ అవ్వడం వల్ల బిడ్డ లోపల ఎలా ఉంది అని ఆల్ట్రాసౌండ్ స్కాన్ ద్వారా చూసుకోగలుగుతున్నాము. దీనితో పటు గా మీ శరీరం లో జరిగే మార్పులు గురించి మీరు అవగాహన పెంచుకోవాలి. ఆలా చేసినట్లు అయితే మీరు ఇంకా తయారు గా ఉండటం లో సహాయపడుతుంది.

రెండవ నెల లో ముఖ లక్షణాలు అభివృద్ధి చెందుతూ చెవులు కూడా రూపు చెందుకుంటాయి. వీటి తరువాత మెల్లగా కాలు,చేతులు,వేలు అన్ని పెరుగుతాయి. నది వ్యయస్థ, జ్ఞాన అవయవాలు, జీర్ణ వాహిక అభివృద్ధి చెందుతున్నాయి మెల్లగా ఎముకలు కార్టిలగినోస్ నిర్మాణం ని భర్తీ చేస్తాయి.

మూడవ నెల వేలుగోళ్లు, కాలాగోళ్లు , చెవులు, పునరుత్పత్తి అవయవాలు, ఫంక్షనల్ ప్రసరణ మరియు మూత్ర వ్యవస్థలు మరియు కాలేయ స్రవిట్ పైల్ అభివృద్ధి చెందుతాయి. బిడ్డ నోరు తెరిచి ముస్కోగలడు మరియు పిడికిలి బిగించి వదలగలదు.

క్లుప్తంగా చెప్పాలంటే మొదటి ట్రైమెస్టర్ లో అత్యంత క్లిష్టమైన అభివృద్ధి జరుగుతుంది. అందువలన చాలా జాగర్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మొదటి ట్రైమెస్టర్ లో గర్భపాతం అయ్యే అవకాశాలు కూడా బాగా ఎక్కువ.

మొదటి ట్రైమెస్టర్ అప్పుడు తీసుకోవలసిన డైట్ 
భోజనం 

గర్భవతులు ఈ మొదటి మూడు నెలలు లో వికారంగా,అలసట గా, మరి నిద్రగా అన్ని ఎక్కువగా అనిపిస్తూ ఉంటాయి ఏ మూడు నెలలు లో. పెద్దవారు నుండి మరియు డాక్టర్ లు ఇచ్చే సలహాలు తప్పకుండ సహాయపడుతాయి. అవసరమైతే నార్మల్ గా తినే ఫుడ్ తో పటు న్యూట్రిషనల్ సప్ప్లీమెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఈ మూడు నెలలు లో గుర్తుంచుకోవలసిన కొన్ని పదాలు ఏమిటి అంటే చిన్న భోజనం, వేడి భోజనం మరియు వండిన భోజనం.

కూరగాయలు - పాలు - మాంసం 

క్లుప్తంగా చెప్పాలంటే గర్భవతులు బాగా ఉడికిన, చాలా పరిశుభ్రమైన మరియు వేడి గా ఉన్న భోజనాన్ని రెగ్యులర్ ఇంటెర్వల్స్ లో తీసుకోవాలి. ఒకే సరి ఎక్కువగా తినకూడదు. పచ్చిగా కూడా తినకూడదు తినాలన్న బాగా శుభ్రం చేసినవే తినాలి. పళ్ళు మరియు కూరగాయలు బాగా కడగాలి. పాలు పెరుగు లాంటి పదార్ధాలు తినే ముందు అవి సుక్ష్మక్రిమిరహిత చేయబడినవి అయ్యుండాలి. డాక్టర్ లు మాంసం తినే తల్లులను ఇంకా జాగర్తగా ఉండాలి అని సూచిస్తారు. మాంసం లాంటి పదార్ధాలు తినే పక్షం లో డాక్టర్ గారి సూచనలు తీసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే ఒకోసారి ఎలర్జీ లు వచ్చే ప్రమాదం ఉంది గనుక.

పోషకాలు 

సమతుల్య ఆహారం లో ప్రోటీన్, కాల్షియం, ఇనుము, ఫోలేట్, విటమిన్ ఎ, విటమిన్ బి 12, ప్రొటీన్, విటమిన్ డి, అయోడిన్, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ ఉన్నవాటిని చేర్చుకోవాలి. ఇవి బిడ్డ అభివృద్ధి లో ఎంతో ప్రాధాన్యం వహిస్తాయి.

డైట్ ఇలా ఉండాలి

భోజాన్ని అల్పాహారం, మధ్యాహ్నం చిరుతిండి, భోజనం, మధ్యాహ్నం చిరుతిండి, సాయంత్రం అల్పాహారం మరియు డిన్నర్ గా విభజించుకోవచ్చు. గోధుమ బ్రెడ్ , ఇండియన్ బ్రెడ్ (పారాథాలు, చపాతీలు, నాన్స్, రోటిస్, కుల్చాలు మరియు మరిన్ని), బియ్యం, వివిధ ద్రాక్ష (పప్పులు), దోసస్, ఇడ్లిస్, పురీస్, అప్మా, పోహా, తీపి, కూరగాయలు, పండ్లు, గింజలు, పెరుగు లాంటి వాటిని ఆహారంగా తీస్కోవచ్చు. నీరు ని ఎప్పుడు మర్చిపోకండి మంచి నీరు ని ఎప్పుడు తాగుతూ ఉండాలి. అప్పుడపుడు కొబ్బరి నీళ్లు తాగడం కూడా మంచిది.

కొన్ని సార్లు ప్రెగ్నన్సీ లో కాంప్లికేషన్స్ వాస్తు ఉంటాయి. అలాంటపుడు తరచూ  డైట్ మార్చాల్సి ఉంటుంది.  తరచూ డాక్టర్ దగ్గరికి వెళ్తూ ఉండటం మంచిది. ఇలా చేస్తున్నారు అయితే భవిష్యత్తు లో మంచిది.

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon