Link copied!
Sign in / Sign up
6
Shares

మోచేతులు, మోకాళ్ళు, చంకలలో నలుపుదనం పోగొట్టే అద్భుత ఇంటి చిట్కాలు

Image Source : Homemade Health and Beauty Tips

చాలామంది మహిళలు ముఖం ప్రతిబింబంగా, కాంతివంతంగా కనిపిస్తే చాలని అనుకుంటూ ఉంటారు. అలాగే తమకు తెలిసి కూడా నలుపుదనంగా ఉండే మోచేతులు, మోకాళ్ళు, చంకలు, మెడ భాగాలను అశ్రద్ధ చేస్తుంటారు. కానీ పదిమందికి మీ అందాన్ని ఈ భాగాలు కొన్నికొన్ని సార్లు అందవికారంగా కనిపిస్తూ ఉంటాయి.  కాబట్టి ఈ అద్భుత ఇంటి చిట్కాలను మీరు ఫాలో అవ్వడం వలన తక్కువ టైంలోనే ఈ సమస్య నుండి బయటపడవచ్చు.

తేనె పసుపు పాలు

ముందుగా ఒక చిన్న గిన్నెలో రెండు స్పూన్ల తేనె మరియు పసుపును తీసుకుని మిశ్రమంగా చేసుకోవాలి. ఈ మిశ్రమంలో ఒక స్పూన్ పాలు కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నల్లగా ఉండే మోచేతులు, మోకాళ్ళు మరియు చంకలలో రాసుకుని కొన్ని నిముషాల తర్వాత శుభ్రం చేసుకుంటే అందంగా కనిపిస్తాయి.

బంగాళాదుంపలు పెరుగు

కొన్ని బంగాళాదుంపలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా తరిగి ఒక బౌల్ లో వేసి బాగా వేడి చేసుకోవాలి. ఆ తరవాత బంగాళాదుంపలను మెత్తగా చేసుకుని అందులో పెరుగు కలిపి మిక్స్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని నలుపుగా ఉన్న భాగాలలో రాసుకుని శుభ్రం చేసుకోవడం వలన అందమైన మోచేతులు, మోకాళ్ళు మీ సొంతం.

పెరుగు వెనిగర్

రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో కాస్త వెనిగర్ కలుపుకుని నలుపుగా ఉన్న మోచేతులు, మోకాళ్ళు, మెడ, చంకలలో రాసుకుని మర్దనా చేసుకోవాలి. ఆరిన తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

శనగపిండి

పెరుగుపై భాగాన ఉండే వెన్న తీసుకుని రెండు స్పూన్ల శనగపిండిలో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని నలుపుగా ఉన్న భాగాలలో రాసుకుని క్లీన్ చేసుకుంటే మోచేతులు, మోకాళ్లపై ఉండే నలుపుదనం తగ్గిపోతుంది.

ఇంకా మీకు ఏమైనా టిప్స్ తెలిసి ఉంటే COMMENT చేయవచ్చు. అలాగే మీకు ఈ ఆర్టికల్ నచ్చినట్లయితే SHARE చేయండి. 

.....................................................................................................

మహిళలందరికీ ఓ మంచి శుభవార్త..

Tinystep మీరు సురక్షితంగా ఉండటానికి ఎటువంటి కెమికల్స్ లేని సహజమైన ఫ్లోర్ క్లీనర్ ఉత్పత్తిని ప్రారంభించింది. మీ పిల్లల ఆరోగ్యకోసం, మీ ఇంట్లోకి ఎటువంటి క్రిములు చేరకుండా ఈ ఫ్లోర్ క్లీనర్ ఉపయోగపడుతుంది.

ఒక్కసారి మీ ఇంట్లో ఈ ప్రాడక్ట్ ను ఉపయోగించి, మీ విలువైన అభిప్రాయాన్ని తెలియపరచండి.

Tinystep ఫ్లోర్ క్లీనర్ ఆర్డర్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి

Tinystep Baby-Safe Natural Toxin-Free Floor Cleaner

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon