మిమ్మల్ని ఎప్పటికీ యవ్వనంగా ఉంచే అశ్వగంధ : ఎప్పుడు, ఎలా వాడాలో తెలుసుకోండి..
అశ్వగంధ.. ‘కింగ్ ఆఫ్ ఆయుర్వేద’ గా అని పిలవబడుతున్న అశ్వగంధను వాజిగంధి, పెన్నేరుగడ్డ, గుర్రపు వాసన అనే పేర్లతో పిలుస్తున్నారు. చూడటానికి చిన్న పరిమాణంలో ఆకులు, విత్తనాలు ఉంటాయి. కానీ దీనివలన కలిగే ప్రయోజనాలు తెలిస్తే మాత్రం షాక్ అవ్వాల్సిందే. అందాన్ని పెంచే దగ్గరి నుండి సంతానానికి సైతం ఉపయోగపడుతున్న అశ్వగంధను ఎప్పుడు, ఎలా వాడాలో తెలుసుకుందాం.. ఈ ఆర్టికల్ మీకు నచ్చితే అందరికీ SHARE చేయండి…
పిల్లల జ్ఞాపకశక్తి పెరుగుతుంది

అశ్వగంధ యొక్క ఎండిన వేరును తీసుకుని నీటిలో వేసి 30 నిముషాలు తక్కువకాకుండా మరిగించుకోవాలి. ఇలా మరిగిన దీనినే అశ్వగంధ టీ అని అంటారు. ఈ టీని ప్రతి రోజూ పిల్లలకు ఒక గ్లాస్ తాగించడం వలన జ్ఞాపకశక్తి పెరుగుతుంది. ప్రతి విషయాన్ని మర్చిపోకుండా క్షుణ్ణంగా గుర్తుపెట్టుకుంటారు. పెద్దలు కూడా తీసుకువచ్చి.
యవ్వనంగా ఉండేలా చేస్తుంది

అశ్వగంధ పౌడర్ లో కొంచెం మోతాదులో నెయ్యిని కలుపుకుని ఒక బాక్స్ లో పెట్టుకోవాలి. ప్రతి రోజూ అర స్పూన్ మోతాదులో ఒక గ్లాస్ వేడినీటిలో గానీ వేడి పాలలో కలుపుకుని సేవించడం వలన ఎప్పటికీ యవ్వనంగా అందంగా ఉంటారు. కీళ్లనొప్పులు ఉండవు. వృద్ధాప్య లక్షణాలు రాకుండా యాంటీ ఏజింగ్ గా పనిచేస్తుందన్న మాట.
గర్భం కోసం

గర్భం రాలేదని బాధపడుతున్నవారికి అశ్వగంధ టీ లేదా ఈ ఔషధాన్ని స్త్రీలకు ఇవ్వడం వలన స్త్రీల శరీరంలోని రక్తాన్ని శుభ్రపరచి రోగ నిరోధక శక్తిని పెంచేందుకు ఉపయోగపడుతుందని, బిడ్డ పెరుగుదల మరియు అభివృద్ధికి ఈ ఔషధం చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
ఒత్తిడి ఉండదు సుఖం మాత్రమే ఉంటుంది

అశ్వగంధ పొడిలో కాస్త చక్కర కలుపుకుని నెయ్యితో కలిపి సేవించడం వలన ఒత్తిడి, ఆందోళనలు దూరమవుతాయి. నిద్రలేదని బాధపడేవారు ఈ విధంగా చేయడం వలన సుఖ నిద్రను పొందవచ్చు. నీరసం ఉండదు మరియు ఎప్పటికీ ఉత్సాహంగా ఉండేలా చేస్తుంది.
రాత్రి స్త్రీలకు మంచిది, మగవారికి ఇంకా మంచిది

స్త్రీలలో చెడు రక్తం బయటకు పోతూ ఉంటుంది కాబట్టి, మహిళలలో రక్తాన్ని శుభ్రం చేసి, శృంగారంలో ఇబ్బందిపడుతూ లైంగిక సామర్థ్యం తగ్గిందని బాధపడుతున్న మగవాళ్ళు రాత్రి నిద్రకు ముందు చిటికెడు పల్లేరు కాయల చూర్ణంలో కొంచెం అశ్వగంధ పౌడర్ ను మిక్స్ చేసి పాలతో పాటు మరిగించి వడగట్టుకుని సేవించడం వలన చాలా మంచిదని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.
అశ్వగంధతో ఇలా అస్సలు చేయకండి

ఇందులో ఔషధ గుణాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయుర్వేద నిపుణులు మరియు వైద్యుల సలహా మేరకే వాడాలి (కొందరికి పడకపోవచ్చు). అలాగే అశ్వగంధాను ఎక్కువ మోతాదులో తీసుకోవడం వలన గుండె, అడ్రినల్ గ్రంధులపై ప్రభావం ఉంటుందని, కొన్నిసార్లు థైరాయిడ్ కు దారి తీసే అవకాశం ఉందని అంటున్నారు నిపుణులు.
ఈ ఆర్టికల్ ఉపయోగకరం అనిపించినట్లయితే అందరికీ SHARE చేయండి…