Link copied!
Sign in / Sign up
5
Shares

మెటికలు విరిస్తే కీళ్ళ నొప్పులు వస్తాయా? అసలు నిజాలను బయటపెట్టిన డాక్టర్లు

ఏమి ఊసుపోనప్పుడు లేదా కాలిగా ఉన్నప్పుడు ఏదో ఒక సమయంలో అందరూ సహజంగా చేసే పని మెటికలు వీరచడం. దాని గురించి మనం పెద్దగా   ఆలోచించం. కానీ మెటికలు వీరచడం కీళ్ళ నొప్పులకు ఒక కారణమని కొందమంది అభిప్రాయం. దీనిలోని నిజ నిజాలను తెలుసుకోవడానికి అనేక అధ్యాయనాలు జరుగుతున్నాయి. ఈ మధ్య కొంతమంది శాస్త్రవేత్తలు చేసిన అధ్యయనాల ప్రకారం మెటికలు వీరచడానికి, కీళ్ళ నొప్పులకు ఉన్న సంబంధం గురించి కొన్ని నిజాలు తెలిసాయి, అవేంటో ఇక్కడ తెలుసుకోండి…

అసలు కీళ్ళ నొప్పులు ఎందుకొస్తాయి?

మీరు చేతితో పని చేసే సమయంలో మీ చేతి కీళ్ళు వత్తిడిని తట్టుకునే విధంగా సహాయపడుతాయి. ధృడమైన, ఎటువైపైనా కదలడానికి అనువుగా వుండే కార్టిలేజ్ (cartilage) అనే కణజాలం మీ కీళ్ళలో నిర్మాణమైవుంటుంది. ఈ కణజాలం ఎప్పుడైతే ఆరిగిపోతుందో అప్పుడు కీళ్ళ నొప్పుల సమస్యలు వస్తాయి. ఇలా జరగడానికి కారణం కీళ్ళకు ఏదైనా దెబ్బలు తగలడం వలన లేదా కొన్ని ఇన్ఫెక్షన్ల వలన అయ్యుండచ్చు. అయితే మెటికలు వీరచడం కూడా ఇందుకు ఒక కారణం అనే ఒక భావన వుంది. అందులో ఎంత నిజం ఉందొ ఇక్కడ తెలుసుకుందాం.

అసలు నిజం ఇదే!!

శాస్త్రవేత్తలు మెటికలు వీరచడం కీళ్ళ నొప్పులకు కారణమా కాదా అని తెలుసుకోడానికి ప్రణాళిక ప్రకారం ఒక అధ్యాయనం చేసారు. ముందుగా కొన్ని సంవత్సరాల నుండి కీళ్ళ నొప్పులతో బాధపడుతున్న పదిమంది వైద్య సమాచారాన్ని సేకరించారు. అలాగే కీళ్ళ నొప్పుల సమస్య లేని పది మంది వైద్య సమాచారాన్ని సేకరించారు. ఇప్పుడు వీరి వేసిన ప్రశ్నలనుండి సేకరించిన సమాధానాల ప్రకారం, కీళ్ళ సమస్యల నుండి బాధపడే వాళ్ళలలో మెటికలు వీరిచే అలవాటు అంతగా లేదు. అలాగే సహజంగా మెటికలు వీరిచే వాళ్ళకు కీళ్ళ నొప్పుల సమస్యలు లేవు.

వీటి ఆధారంగా మెటికలు వీరచడానికి, కీళ్ళ నొప్పులకు ఏ విధమైన సంబంధం లేదని శాస్త్రీయంగా తేల్చారు. 

Click here for the best in baby advice
What do you think?
0%
Wow!
0%
Like
0%
Not bad
0%
What?
scroll up icon